Thursday, November 17, 2011

java program to check armstrong number

import java.util.*;
 
class ArmstrongNumber
{
   public static void main(String args[])
   {
      int n, sum = 0, temp, r;
 
      Scanner in = new Scanner(System.in);
      System.out.println("Enter a number to check if it is an armstrong number");      
      n = in.nextInt();
 
      temp = n;
 
      while( temp != 0 )
      {
         r = temp%10;
         sum = sum + r*r*r;
         temp = temp/10; 
      }
 
      if ( n == sum )
         System.out.println("Entered number is an armstrong number.");
      else
         System.out.println("Entered number is not an armstrong number.");         
   }
}
 
 
 

నిర్మాతల నిరసన

కాపీరైట్‌ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో సినీ నిర్మాతలు నిరాహారదీక్షకు దిగారు. తెలుగు చలన చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న రచయితలు, సాంకేతిక నిపుణులకు చిత్రంపై వచ్చే రాయల్టీలో భాగం ఇప్పించేలా కేంద్రం చట్టం తీసుకరానున్న నేపథ్యంలో నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ ఎదుట దీక్షకు దిగారు. నిజనిజాలు గమనించకుండా సాంకేతిక వర్గాల మాటలు గుడ్డిగా నమ్మి చట్టం తీసుకరావాలని చూడడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

అనుష్కపై ఐటీ పిడుగు

టాలీవుడ్ టాల్ బ్యూటీకి చిక్కులు వచ్చాయి. ఆస్తులు దాస్తున్నదన్న అనుమానంతో అనుష్క ఇంటిలో బుధవారం ఆదాయపు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుష్క ఇంట్లోనే ఉండటం గమనార్హం. బంజారా హిల్స్ లోని ఆమె ఇంటి నుంచి కీలక పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  కేవలం ఆమె ఐటీ లెక్కలు సరిగా చూపిస్తున్నారో లేదో తెలుసుకోవడం కోసం ఈ తనిఖీలు జరిగాయి, అంతకు మించి ఏం లేదని ఆమె సన్నిహితులు చెప్పారు . అయితే, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుష్క అందించిన వివరాల్లో క్లారిటీ లేకపోవడం వల్లే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, నాగార్జున చాలా ఆస్తులు అనుష్క పేరిటే దాచినట్టు టాలీవుడ్ లో సీరియస్ టాక్. ఆమె అంటే నాగ్ కు మంచి గురి అని చెబుతారు. గతంలో ఐటీ అధికారుల కళ్లు చెదిరేలా నాగార్జున పన్నులు కట్టిన విషయం తెలిసిందే. అయితే, మరి అనుష్క పేరిట దాచినవి కూడా అతడి ఆస్తులని తెలిస్తే, తేలితే…!!!

టీడీపీ కరపత్ర యుద్దం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్, చంద్రబాబు గౌరవానికి భంగం కలగకుండా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ చంద్రబాబుపై హైకోర్టులో పిటీషన్‌ వేశారని టీడీపీ నేతలు ప్రజలకు వివరించే పనిలో మునగనున్నారు. విజయమ్మ పిటీషన్‌లో పేర్కొన్న అంశాలకు జవాబుగా 60 పేజీలతో కూడిన కరపత్రం విడుదల చేసేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమవుతోంది.
ముఖ్యంగా పది అంశాలు ఈ కరపత్రంలో పొందుపర్చనున్నారు. జగన్‌ కాంగ్రెస్‌తో మూడు ఒప్పందాలు చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌పై సీబీఐ విచారణను నీరుగార్చడం, జగన్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, టీడీపీని నిర్వీర్యం చేయడం తదితర ఒప్పందాల్లో భాగంగానే విజయమ్మ బాబుపై కోర్టులో పిటీషన్‌ వేసిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.

కాంగ్రెస్ ఖేల్ ఖతం : హరీష్‌రావు

కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామని, తెలంగాణ పేరు మీద కాంగ్రెస్ రాజకీయ చేస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని అన్నారు.
మెదక్ జిల్లా పాదయాత్రలో బుధవారం హరీష్‌రావు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులున్నా ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణకు కట్టుబడి ఉంటామని మాటల్లో చెప్పడం కాదని, తెలంగాణ ప్రజలకోసం ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటదని హరీష్‌రావు స్ఫష్టం చేశారు.

భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే

రాష్ట్రంలో భవిష్యత్ ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. తాను ఎంపిగా ఎన్నికై ఢిల్లీ వెళ్లిన తరువాత కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం తెలుసుకున్నానని, రాష్ట్ర మంత్రిగా ఉండి ఉంటే కాంగ్రెస్ మంత్రిగా ఉండిపోయేవాడినని అన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలుగా మిగిలే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు.
బాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును యనమల తప్పుపట్టడమే కాక, ఇది టీడీపీ ప్రతిష్టకు సంబంధించిన విషయమని చెప్పడం చూస్తే అప్పీలుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరూ, మేమూ కలిసి కూల్చేద్దాం, మీకు దమ్మూ ధైర్యం ఉంటే అవిశ్వాసం పెట్టండి’ అని సవాల్ విసిరారు.
జగన్ తన బురదను బాబుకు అంటించాలని చూస్తున్నారని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. అసలు చంద్రబాబే బురద ఊబిలో కూరుకుపోయారని, ఇక వేరెవ్వరూ ఆయనకు అంటించాల్సిన పనేలేదని ఆయన అన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, ఆయన బండారం సీబీఐ విచారణలో బయట పడుతుందని తాము భావిస్తున్నామని, అందుకే టీడీపీ నేతలు అంతగా ఆందోళన చెందుతున్నారని అన్నారు.

కేకే గ్యాంగ్ ప్రగల్భాలు

బ్రేకింగ్‌లు.. మీటింగ్‌లు తప్ప…. సాధన ఏదీ?
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలకు దిక్కు తోచడం లేదు. తెలంగాణాపై హైకమాండ్ నాన్చుడు ధోరణిని నిరసిస్తూనే ఏమి చేయాలో తెలీని స్థితిలో పడ్డారు మన టి.కాంగ్రెస్ ఎంపీలు. వారానికొకసారి సమావేశం కావడం… టీవీలకు బ్రేకింగ్‌లు ఇవ్వడం మినహా సాధించేదేమీ లేదని జనానినికి కూడా తెలిసి పోయింది. తెలంగాణా రాదని హైకమాండ్ అధికార ప్రకటన చేసిన తర్వాత రాజీనామాలు చేస్తామంటున్నారు ఎంపీలు. కాని తెలంగాణా ఇవ్వమని హైకమాండ్ స్పష్టంగా ఎందుకు చెబుతుంది? ఎప్పుడు చెబుతుంది? కఠిన నిర్ణయాలు ఎన్నిసార్లు?
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు సిద్దమయ్యారు. సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇదంతా ఇప్పుడు కాదు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా చెప్పినప్పుడు మాత్రమే. అదిగో కఠిన  నిర్ణయమని ఇన్నాళ్లు చెపుతూ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇక ఆ కఠిన నిర్ణయం ఏంటో పరోక్షంగా చెప్పారు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధికారికంగా చెపితే పార్టీ నుంచి బయటికి వస్తామన్నారు. తెలంగాణాపై ప్రధాని  చేసిన వ్యాఖ్యలపై మన టి. ఎంపీలు మండిపడుతున్నారు. ప్రధాని మాటలే తెలంగాణపై తుది నిర్ణయం కాదని.. సోనియా కాని, కోర్ కమిటీ కాని తెలంగాణ ఇవ్వమని చెపితే పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లోపు తెలంగాణపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తప్పించి.. ఎస్సార్సీ,ప్యాకేజీ,అభివృద్ది మండలి, సిఎం మార్పు లాంటి  ప్రత్యామ్నయాలు ఒప్పుకోమన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ వాదానికి అనుకూలంగా మల్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశాల సందంర్భంగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే అప్పుడు పార్లమెంట్ లో సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు.
అన్నీ అనుమానాలే…..
పార్టీ నుంచి బయటికి రావాలనే నిర్ణయానికి వచ్చిన టి ఎంపీలు తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు చెపుతోందా.. అనే అనుమానాలు ఉన్నాయి. 2004,2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. డిసెంబర్ 9 ప్రకటన, ఆ తరువాత 23 ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఇవ్వన్నీ చేస్తూ కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వలేమని నేరుగా చెపుతోందా అనేది అనుమానం. కాబట్టీ తెలంగాణ ఎంపీలు పార్టీని వెంటనే వీడే అవకాశాలు లేవు. ప్రస్తుతం వారు పార్టీని వీడుతామని చేసిన ప్రకటన అటు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం, ఇటు తెలంగాణ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం ఏకకాలంలో జరుగుతాయి. అయితే నిజంగా తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానం చెపితే ఎంపీలంతా పార్టీకి గుడ్ బై చెపుతారా అనేది కూడా అనుమానమే. కొందరు ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం చాలా కాలంగా బుజ్జగిస్తోంది. ఒకవేళ ఎంపీలు బయటికి వచ్చి ఏం చేస్తారనేది అయోమయంగా ఉంది. సొంత పార్టీ పెట్టుకుంటారా.. టిఆర్ఎస్ లోకి చేరుతారా.. ఒకవేళ పార్టీ పెట్టుకుంటే ఎవరూ నాయకుడు. ఇలాంటి ప్రశ్నలకు తెలంగాణ ఎంపీల వద్ద సమాదానాలు లేవు. పూటకో మీటింగ్ పెట్టుకుని బయటకు ప్రగల్భాలు పలికే మన ఎంపీలు కార్యాచరణకు వచ్చేసరికి అమ్మ సోనియా అన్న జపం చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేకే, కోమటరెడ్డి రాజీనామాలు మినహా మిగిలిన వారివి తిరస్కరించారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నయానో భయానో ఎంపీలను కట్టడి చేసి రెండో ఎస్సార్సీకే ఒప్పించే ప్రయత్నం చేస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

జగమంత కుటుంబం జగన్ ది!

ఇక నుంచి పాజిటివ్ థింకింగ్ పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మన జగనన్న దగ్గరకు వెళితే చాలు. సీబీఐ కేసులు, ఐఏఎస్ అధికారులను కూడా వదలకపోవడం, స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తుండటం వంటి సంఘటనల నేపథ్యంలో జగన్ వర్గంలో తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనుకడుగు వేశారు. తటస్థంగా ఉండటమో, తిరిగి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమో చేస్తున్నారు. ఈ విషయం గురించి గుంటూరు జిల్లాలో మలివిడత ఓదార్పుయాత్రలో పరోక్షంగా జగన్ వ్యాఖ్యానించారు. “ఎమ్మెల్యేలు వెంటలేకపోయినా రాష్ట్రమంత కుటుంబం తనకు తోడుగా ఉంద”ని అన్నారు. ఓ తల్లిని, బిడ్డను ఎదుర్కొనేందుకు ఇన్ని కుట్రలు, కుతంత్రాలు అవసరమా అని ఆవేదనాగ్రహాలతో కూడిన వ్యాఖ్యలు చేశారాయన.
చరిత్రలో విరుద్ధమైన విషయాలన్నీ జరుగుతున్నాయని, ప్రజా సమస్యల విషయంలో ఏకం కావాల్సిన నేతలు తన కుటుంబ ప్రతిష్టను పాడుచేయడానికి ఏకం కావడం విడ్డూరం అన్నారు. “చంద్రబాబునాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని కేసుల్లో ఇరికించే చేస్తుంటే…” ఒక్కడిని కట్టడి చేయడానికి ఇంతమందా అని జనమే ఆశ్చర్యంతో చూస్తున్నారని జగన్ అన్నారు. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

Vault recruiting feshers for entry-level engineers to be deputed onsite at M/s. SAP Labs India Pvt.


Location: Bangalore
Eligibility:
BE/ B Tech (CS, IT, IS, ECE, EEE, ) /MCA(BSC/BCA) with
min.
65% aggregate in 10th, 12th & 70% aggregate in Degree,
2011 batch Pass out
How to apply:
To apply send resumes to jobs@vcu.in or freshers@vcu.in

Dimensions Innovation Labs recruiting freshers.


Location: Noida
Eligibility:
B.Tech (CS or IT) / MCA / MSc (CS)
Sound knowledge of JAVA, J2EE, SQL/Oracle, Hibernate, Spring, Webwork.
Those undergone training in JAVA or with SCJP or any other certifications will have added privilege.
How to apply:
Send resumes to karuna.sharma@campusdimensions.com

Synopsys recruiting freshers for intern position.


Location: Hyderabad
Requirments:

1. B.tech. or M.tech in CSE/ECE or MCA with minimum of 60% marks.
2. Very good communication skills
3. Platform: Unix
4. Languages/tools: C/C++/Perl/Shell scripting/mySQL/Java scripting
How to apply:

To apply Go to --> http://goo.gl/QgE8E --> search openings-->
search with keyword '2552BR' and apply.

Wednesday, November 16, 2011

ఆడపిల్లకు జన్మనిచ్చిన ఐశ్వర్యా రాయ్, సంబరాల్లో అభిషేక్

ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఈ రోజు ఉదయం సమయంలోని ముంబాయి లోని సెవెన్ హిల్స్ హాస్పటిల్ లో ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు తల్లి అయ్యారు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ అభిషేక్ ధ్రువీకరించారు. ఐశ్వర్యారాయ్ ఆడపిల్ల జన్మించిందన్న వార్తతో ఒక్కసారిగా అభిషేక్ కు అభినందనల జల్లు మొదలయ్యింది. మీడియా స్వీయ నియంత్రణ సంస్థ ఆదేశాల వలన మీడియా ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. మరిన్ని విషయాలు బచ్చన్ ఫ్యామిలీ నుంచి సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉంది.

మమతామోహన్‌దాస్ పెళ్లి కుతురాయనే...



"తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే... రావే నా వంక’ అంటూ చిన్నప్పుడు మమతామోహన్‌దాస్, ప్రజిత్ మలయాళంలో పాడుకుని ఉంటారు. అప్పటి ఈ బాల్య స్నేహితుల అనుబంధం... పెద్దయ్యాక ప్రయణబంధంగా మారింది. ప్రస్తుతం మమతా దక్షిణాదిన తిరుగులేని హీరోయిన్. ప్రజిత్ విజయవంతమైన వ్యాపారవేత్త. అయితే ఆయన బహ్రెయిన్‌లో బిజినెస్ మాన్‌గా ఉన్నారు. మమతా తల్లిదండ్రులు గంగ, మోహన్‌దాస్ కూడా అక్కడే ఉండటంతో... షూటింగ్స్‌కి గ్యాప్ దొరికినప్పుడల్లా మమత బహ్రెయిన్ వెళుతుంటారు. 

అప్పుడే తన బాల్య స్నేహితుడ్ని ఆమె కలుస్తూ ఉండేవారనుకుంటాను. ఏమైతేనేం - ఆ స్నేహితులు ఇప్పుడు ఒకింటివారు కాబోతున్నారు. పెళ్లి తేదీ ఎప్పుడో ఇంకా తెలియదు కానీ నిశ్చితార్ధం మాత్రం నేడే (శుక్రవారం) కేరళలోని కొచ్చిలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగనుంది. తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరును గురువారం వరకు మమత రహస్యంగా ఉంచడం గమనార్హం. ప్రజిత్‌కి కొచ్చిలో కూడా వ్యాపారాలున్నాయి. రెండు మూడు రంగాల్లో ఆయన వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. తమ నిశ్చితార్ధ వేడుక తీపి గుర్తుగా నిలిచిపోవాలనే ఆకాంక్షతో కాబోలు 11-11-11న ఈ వేడుకను ఫిక్స్ చేసుకున్నారు.

తెలుగు వాడుక పదకోశం (Telugu words)

తెలుగు భాష అభివృద్ధికి ఈనాడు తదితర పత్రికలన్నీ నూతన పద కల్పన లోనూ, తెలుగు పదాల ప్రాచుర్యం లోనూ హర్షించదగ్గ కృషి చేస్తున్నాయి. మన భావవ్యక్తీకరణకి సరైన తెలుగు పదం సమయానికి గుర్తు రాకపొవడం తరచూ చాలామందికి అనుభవమే. ఈ చిన్న సమస్యకి సమాధానంగా ఈ పదాల మాలిక కూర్చే ప్రయత్నం. ఈ పదాలన్నీ నిత్యజీవితం లో వార్తాపత్రికల్లో కనిపించేవే. కాకపోతే ఇక్కడ ఒక మాలిక లాగా కూర్చే ప్రయత్నం చేస్తున్నా... ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఈ మాలిక కూర్పుకి సాయం కూడా చేయవచ్చు. (తెలుగులో రాయడానికి లేఖిని ని వినియోగించండి.  లేఖిని వెబ్ చిరునామా www.lekhini.org  )
అభినందనలతో ఇక ముందుకు......

23-06-2011
కాంట్రాక్టర్ = గుత్తేదారు, కాంట్రాక్టు = గుత్త
ఫైలు = దస్త్రం 
job = కొలువు 
campus selections =  ప్రాంగణ నియామకాలు 

24-06-2011


interview (eg. interview of Finance Minister in the media) = పరిచయ కార్యక్రమం
interview (eg. Civil Services interview) = మౌఖిక పరీక్ష

Analytic = విశ్లేషణాత్మక

Descriptive = వివరణాత్మక

Meet (eg. UN General Body meet ) = సదస్సు


Telephone  ని దూరవాణి అనడం వినే ఉంటారు.. మరి Mobile phone  ని ఏమంటారు? 
సంచార వాణి అని ఒక ఔత్సాహకుడి అనువాదం.. అయితే ఇంకా ప్రాచుర్యం పొందలేదు.

07-07-2011


internet =  అంతర్జాలం
Broadcast (used for Radio) = ప్రసారం
Telecast (used for TV) = ప్రసారం
Live telecast = ప్రత్యక్ష ప్రసారం

scope ( eg. micro scope) అనే పదాన్ని దర్శిని అని అనువదిస్తారు
micro scope = సూక్ష్మదర్శిని
tele scope = దూరదర్శిని

endo scope ( used for viewing the internal parts of abdomen) = కుహరాంతరదర్శిని అని ఒక ఔత్సాహకుడి అనువాదం.. అయితే ఇంకా ప్రాచుర్యం పొందలేదు

సెవెన్త్‌ సెన్స్‌ సినిమా చూసిన తర్వాత, నాకొచ్చిన సందేహాలు

 సిక్స్త్‌ సెన్స్‌ అనేదాన్నే చాలామంది ఒప్పుకోనప్పుడు ఈ సెవెన్త్‌ సెన్స్‌ ఎక్కణ్ణుంచి వస్తుందిరా అనుకుంటూ మొదలెట్టాను సినిమా చూడ్డం. కొంతసేపటికే అర్థమైపోయింది మురుగదాస్‌  ఏడో జ్ఞానంగా దేన్ని అనుకుంటున్నాడో..! "జెనిటిక్‌ మెమొరీ"నే అతగాడు సెవెన్త్‌  సెన్స్‌ అన్నాడన్నమాట..!
                 బోదిదమ్మ(ఇక్కడింకో సందేహం..!) వంశస్తుడైన హీరోగారు చివర్లో బోదిదమ్మగా మారిపోతాడు.( ఈ సినిమా కథ ఒక్క వాక్యంలో..!) ఈ లెక్కన గోత్రాలను బట్టి ఎవరైనా వసిస్ఠుడుగానో, విశ్వామిత్రుడిగానో, కశ్యపుడిగానో మారిపోవచ్చన్నమాట..! (అందరూ వారివారి గోత్రనామాలనొకసారి స్మరించుకోండి...ఊరికే...సరదాకి.!) అలాగే హీరోయిన్‌ చేసిన రీసెర్చికీ "క్లోనింగ్‌"కీ పోలికలున్నట్టుగా అనిపించింది. క్లోనింగ్‌ కొత్తగా జీవిని జన్మింపజేస్తారు. ఇందులో అల్రెడీ ఉన్నవాణ్ని పూర్తి "బోది దమ్మ"గా మార్చింది. ఫండమెంటల్‌ తేడా తెలుస్తూ ఉన్నా, క్లారిటీ మాత్రం రాలేదు. ఒకే జన్యులక్షణాలతో పుట్టిన కవలలు కూడా ఒకే విధంగా బిహేవ్‌ చేయవలసిన అవసరం లేనపుడు, ఎప్పుడో 1600 సంవత్సరాల కిందటి వ్యక్తితో జన్యు సారూప్యత కలిగిన వ్యక్తి, పాతవ్యక్తి లక్షణాలూ, శక్తులూ వచ్చేస్తాయనుకోవడం.., అస్సలు బాగోలేదు. అదంతా మనకెందుకులెండి.., రివ్యూవర్స్‌ ఉన్నారుగా వాళ్లపని అది..
                తమిళంలోని బోదిదమ్మ పాత్రకి  తెలుగులో బోధిధర్మ అని పెట్టి వదిలేసారుగా (ఇందాకటి బ్రాకెట్లోని సందేహం)..! అంటే, వాడి ఉద్దేశ్యం తెలుగువాళ్ళకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనా..? లేక వేరే పైత్యపు ఉద్దేశ్యం ఏమైనా ఉందా.? తెలుగువాళ్లకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనుకుంటే చాలా పొరబాటు., "దమ్మపదం (ధర్మపథం)" సాహిత్యాల్లో చాలామంది కొట్టినపిండే..! "బోది దమ్మ" అనేది "బోధి ధర్మ"కి వికృతి అని స్కూల్‌ పిల్లాడుకూడా చెప్పగలిగే విషయం. మరి తెలుగులో "బోధి ధర్మ"అని పాత్రనామం ఇవ్వాల్సిన అవసరమేంటో నాకర్థం కాలేదు. పైగా బౌద్ధం తమిళనాట కన్నా, తెలుగునాటే ఎక్కువ ప్రాచుర్యం పొందిందనుకుంటాను కూడా..! నా ఉద్దేశ్యం (అనుమానం) ఏంటంటే, ఆ చిత్రంద్వారా దర్శకుడు "తెలుగువారి చరిత్ర"ని హైజాక్‌ చేసాడని..! పోనీ... ఇవన్నీ దిక్కుమాలిన సందేహాలు అనుకుందాం..! అసలైన సందేహం ఇంకోటుంది
              సినిమాకి విడుదల అవ్వడానికి ముందు దర్శకుడు చెప్పిన విషయం "ప్రతీ తమిళుడు గర్వించే విధంగా ఉండే సినిమా ఇద"ని.. అంటే అతని ఉద్దేశ్యం, అప్పటి తమిళుల చరిత్ర చూపిద్దామన్నట్లైతే ఫర్వాలేదు. మరి లింక్‌ చేసింది ఎవరితోనయ్యా అంటే, పల్లవులతో..! అక్కడ మొదలైంది నా సందేహం, అసలు పల్లవులు తెలుగువాళ్ళా లేక తమిళులా అని..! చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం చదువుకున్నపుడుకూడా పల్లవులు తెలుగువాళ్లని, వారి రాజధాని కాంచీపురమనీ, చదువుకున్నాం..! అలాగే మహాబలిపురంలోని రాతికట్టడాలపై తెలుగుశాసనాలుంటాయనీ విన్నాను. విశాఖపట్టణాన్ని నిర్మించింది కూడా పల్లవరాజేననీ, సింహాచలం ఆలయాన్ని నిర్మించిందీ వారేననీ విన్నాను. హఠాత్తుగా, పల్లవులు తమిళులెలా అయిపోయారో నాకస్సలు అంతుబట్టడంలేదు..! ఎవ్వరికైనా దీని గురించి తెలిస్తే కొద్దిగా నన్ను ఎడ్యుకేట్‌ చేయగలరు..

                   సెవెన్త్‌ సెన్స్‌ గురించి మాట్లాడగానే నా మనస్సు ఎందుకో మా ఇంట్లోని యాకోవ్  పెరెల్మాన్ "నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం" పుస్తకంపైకి పోతోంది. అందులో నాలుగో మితి(4th dimension) గురించి మాంచి డిస్కషన్‌ ఉంటుందిలెండి. "నాలుగో మితి" అంటే అర్థం కాలేదా..? వివరంగా చెప్పాలంటేదీని గురించి ప్రత్యేకటపా వేస్కోవాలి.  అందువల్ల చిన్నగా రాసేస్తాను. మనమున్న ప్రపంచం "త్రిమితీయ ప్రపంచం" (3 D world)..... అంటే పొడవు”, “వెడల్పు”, “ఎత్తు ఉంటాయి  ఏ వస్తువుకైనా..! 2D ప్రపంచాలూ, 1D ప్రపంచాలూ కూడా ఉన్నాయంటాడు ఆ పుస్తక రచయిత. ఉదాహరణకు, మన నీడ తీసుకున్నారనుకోండి, దానికి పై మూడిట్లో రెండు మాత్రమే ఉంటాయి. అంటే.. 2D ప్రపంచం అన్నమాట.! "నాలుగో మితి"ని కనుక్కుంటే ఎన్ని లాభాలుంటాయో కూడా వివరిస్తాడు ఆ పుస్తకంలో. ఐన్‌స్టీన్‌ అయితే నాలుగో మితి "కాలమే" అంటాడు. కాదనేవాళ్ళూ చాలా మంది ఉన్నారు. అందులో నేనూ ఒకణ్ని..! అదీ "నాలుగో మితి" గురించి చిన్న వివరణ.!

నవంబర్ 18న ముంబై యూనివర్సిటీలో వీకిపిడియా కాన్పరెన్స్

Wikipedia
భారతదేశంలో వీకిపిడియా మొట్టమొదటి సారి ఆఫీసుని ప్రారంభిస్తునందుకు గాను ముంబైలో నవంబర్ 18న మూడు రొజుల అతిపెద్ద కాన్పరెన్స్‌ని ఏర్పాటుచేయనుంది. ఈ కార్యక్రమానికి వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ముఖ్య అతిధిగా రానున్నారు. ఇండియాలో జరిగే వీకి కాన్ఫరెన్స్‌కి జిమ్మీ వేల్స్ రావడం ఇదే మొదటి సారి.
 
ఇక ఈ కార్యక్రమాన్ని ముంబైలో ఉన్న చారిత్రాత్మక యూనివర్సిటీ(ముంబై యూనివర్సిటీ)లో ఉన్న ఫోర్ట్ క్యాంపస్‌ కన్వెక్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ సందర్బంలో వీకిపిడియా ప్రెసిడెంట్ అర్జున్ రావ్ చావ్లా మాట్లాడుతూ ఈ వీకి కాన్పరెన్స్‌ని ఇంత మెగా ఈ వెంట్‌గా నిర్వహించడానికి గల కారణం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలను ఒకతాటి మీదకు తీసుకొని రావడం కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 20 ప్రాంతీయ భాషలకు సంబంధించి సమాచారాన్ని రాబోయే భావితరాలకు ఎలా భద్ర పరచాలో తెలియజేయడం జరుగుతుంది.

వీకికాన్పరెన్స్ ఇండియా కార్యక్రమాన్ని ఆర్గజైన్ చేస్తున్న ఛైర్ పర్సన్ ప్రణవ్ కురమ్‌సే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ఇండియాలో నిర్వహించడం మాకు చాలా సంతోషాన్ని కలగజేసే అంశం అని అన్నారు. వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ఆలోచన రూపమే ఈ వీకి కాన్పరెన్స్ అని అన్నారు. ఇక గతంలో వన్ ఇండియా వీకిపిడియా ఇండియా ఆఫీసుని ఇండియాలో ప్రవేశపెట్టనున్న ఆర్టికల్ ప్రత్యేకంగా మరలా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. వీకిపిడియాని ప్రారంభించిన తర్వాత 2009వ సంవత్సరంలో 340 మిలియన్ రీడర్స్ ఉండగా, ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజూ రీడర్స్ సంఖ్య 420 మిలియన్లకు చేరుకుంది.

నవంబర్ 16న గూగుల్ మ్యూజిక్ స్టోర్

Google Music
ఎప్పటి నుండో ఊరిస్తున్న సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా మార్కెట్లోకి గూగుల్ మ్యూజిక్ స్టోర్‌ని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌తో అనుసంధానం చేసి విడుదల చేయనుంది. ప్రస్తుతం గూగుల్ తనయొక్క మ్యూజిక్ బ్లాగ్స్ ద్వారా లిమిటెడ్ మ్యూజిక్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించడం జరుగుతుంది.

ఎవరైతే గూగుల్ బీటా యూజర్స్ ఉన్నారో వారి కొసం ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్ మ్యూజిక్ లాకర్ సర్వీస్ ద్వారా క్లౌడ్ ఆధారిత ఎమ్‌పి3 సాంగ్స్‌ని 20జిబి వరకు డౌన్ లోడ్ చేసుకొవచ్చు. గూగుల్ కొత్తగా ప్రారంభించనున్న ఈ మ్యూజిక్ స్టోర్స్ ద్వారా యూజర్స్‌కు సెక్యూరిటీ కలిగిన మ్యూజిక్‌ని అందించడమే కాకుండా, లైసెన్సింగ్ డీల్స్‌ని కూడా ప్రవేశపెట్టనుంది.

ఇలా చేయడం వల్ల ప్రస్తుతం మార్కెట్లో ఐట్యూన్స్, ఫేస్‌బుక్ ప్రెండ్లీ స్పోటిపై‌కి గట్టి పోటీనిస్తుందని గూగుల్ ప్రతినిదులు భావిస్తున్నారు. గూగుల్ మ్యూజిక్ స్టోర్ కి సంబంధించిన సమాచారాన్ని అంతటిని కూడా నవంబర్ 16న జరిగే “These Go to Eleven” ఈవెంట్‌లో వెల్లడించనున్నారు.

ఆండ్రాయిడ్ 'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్' సోర్స్ కోడ్ విడుదల

Android 4.0 Ice Cream Sandwich
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు ఇటీవలే తెలిపిన సమాచారం ప్రకారం 'ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌'కి సంబంధించిన సోర్స్ కోడ్ ఇంటర్నెట్లో అందుబాటులోకి ఉంచడం జరిగిందన్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని త్వరలో మొబైల్ మార్కెట్లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ నెక్సస్‌లో ఇమిడికృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటర్నెట్లో విడుదల చేసిన సోర్స్ కోడ్ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1కి సంబంధించినది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే శాంసంగ్ గెలాక్సీ నెక్సస్‌లో చూశామో అదే ఈ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1 ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైతే ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఉన్నారో వారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొత్త డివైజ్‌ల ద్వారా టెస్టు చేయవచ్చు. ఇంటర్నెట్లో‌కి ఈ సోర్స్ కోడ్‌ని విడుదల చేయడానికి కారణం ఆండ్రాయిడ్ యూజర్స్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఎక్స్ పీరియన్స్‌ని పోందగలుగుతారని తెలిపారు.

ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'ని కూడా విడుదల చేయడం జరిగింది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'లో ఆండ్రాయిడ్ హానీ కూంబ్‌కి సంబంధించిన సమాచారం ఉంది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'కి సంబంధించిన సమాచాం కావాలంటే యూజర్స్ ఈ లింక్ ద్వారా http://groups.google.com/group/android-building/msg/c0e01b4619a1455a సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

ఇక ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌తో పాటు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లలో మాత్రమే నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్‌లలో ఈ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడడం వల్ల మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉంటుంది.

ఎన్టీఆర్ తో సినిమాలేదు : రాజమౌళి

జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళిది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో స్టూడెంట్ నెం1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటించాలని చాలా కాలంగా ఎన్టీఆర్ యోచిస్తున్నాడు. రాజమౌళి తనతో సినిమా చేయాలని గట్టిగానే అడిగాడు ఎన్టీఆర్. చేస్తాననే దాకా విడిచిపెట్టనని బెట్టుచేశాడు.
ఆ సంగతి పక్కనపెడితే తాజాగా రాజమౌళి త్వరలో ఎన్టీఆర్‌తో ఓ భారీ 3డీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో తాను ఎన్టీఆర్‌తోనే కాదు అసలు 3డీ చిత్రం దేనిని చేయడం లేదని రాజమౌళి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సో ఇప్పట్లో వీరి కాంబినేషన్ లో సినిమా లేనట్లే.

హాసినికి పెళ్లి కుదిరింది

కొందరికి ఆమె చేష్టలు మొనాటనీగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆ  బబ్లీ గర్ల్  అంటే చాలామంది గుండెల్లో యువరాణి. ఆమె ఎవరో కాదు… ఆ చాలామందిలో ఒకడైన బాలీవుడనటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడిన జెనీలియా.
ప్రేమ చెట్టుకు పెళ్లి ఆకులు చిగురించాయి. ఇద్దరి ప్రేమకు ఆమోదం సులువుగా దొరికింది. వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలు సంతృప్తిగా పెళ్లికి అంగీకరించింది.  2012 ఫిబ్రవరి 4న పెళ్లి  ఉంటుంది.  ఫిబ్రవరి 3,4,5 తేదీల్లో వివాహ వేడుకలు భూదేవి పందిరిగా జరగనున్నాయి.  కార్పొరేట్ కుటుంబం- రాజకీయ కుటుంబం ఇక ఇద్దరూ కలిస్తే పెళ్లి మామూలుగా ఉంటుందా? పెళ్లి అంగరంగ వైభవమే.
పెళ్లితో తన సినిమా కెరీర్ ఆగదని జెనీలియా రితేష్ తో  మాట తీసుకున్నట్లు తెలిసింది. ఇది బాలీవుడ్ టాపిక్. ప్రస్తుతానికి పెళ్లి ని పూర్తి ప్రైవేటు వ్యవహారంగా, అతి ముఖ్యమైన అతిథులతోనే నిర్వహించాలని భావిస్తున్నారట.

శాశ్వతంగా చలనచిత్రోత్సవాలు ఇక్కడే : సీఎం

బాలలను విజ్ఞాన గనులుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం  ప్రణాళికతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మన దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ళ వయసులోపు వారేనని, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని యువశక్తిని భావిభారత నిర్మాణానికి వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. పిల్లలను ప్రోత్సహించకుండా దేశాభివృద్ధి సాధ్యపడదని అన్నారు.
 







సోమవారం నాడాయన గచ్చిబౌలిలోని గ్లోబల్‌ పీస్‌ ఫౌండేషన్‌ ఆడిటోరియంలో 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.  యావత్‌ దేశంలో బాలల చిత్ర నిర్మాణానికి ప్రవేశ పన్నులేకుండా నిర్మాతకు 30 లక్షల రూపాయల సబ్సిడీని అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని,  ప్రభుత్వ సహకారం లేకుండా బాలల చిత్రాలను నిర్మించడం నిర్మాతలకు సాధ్యపడదని అన్నారు.  ప్రభుత్వం చలన చిత్ర అభివృద్ధి సంస్థకు 10 ఎకరాల స్థలం కేటాయించిందని, సదరు స్థలంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించే నాటికి శాశ్వత భవన సముదాయాన్ని సిద్ధం చేస్తామన్నారు.
ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్న 152 చిత్రాలు చాలా గొప్పవని, సినిమాల ఎంపికలో విశిష్ట ప్రమాణాలను పాటించారని అభినందించారు. 17వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు హైదరాబాద్ ప్రజలకు గొప్ప అనుభూతులను ఇస్తాయని నందితాదాస్ అన్నారు. బాలబాలికలకోసం యానిమేషన్, సినిమానిర్మాణం, సినిమా దర్శకత్వం, పప్పెట్‌ తయారీ తదితర సృజనాత్మక రంగాల్లో వర్క్‌షాపులు ఏర్పాటు చేశామని, ఇవి వారికి సృజనాత్మక వేదికలు కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సినిమాటోగ్రాఫర్ పిజివిందా దర్శకత్వం వహించిన  ‘లోటస్‌పాండ్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలకు ఎంపికయ్యాయని మంత్రి డీకే అరుణ తెలిపారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి చౌధురి మోహన్‌ జాత్వా మాట్లాడుతూ, ప్రపంచ జనాభా 700 కోట్లు దాటిపోయిన నేపథ్యంలో బాలల సంరక్షణ చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డికె అరుణ, బాలల చలన చిత్రోత్సవం చైర్‌పర్సన్‌, (సిఎఫ్‌ఎస్‌ఐ) నటి నందితాదాస్‌,  సిఎఫ్‌ఎస్‌ఐ సంచాలకుడు సుషోవన్‌ బెనర్జీ, ఎఫ్‌డిసి చైర్మన్‌ అజయ్‌మిశ్ర, సమాచార శాఖ కమీషనర్‌ బి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

రజనీకి ‘షారుక్’ బిఎమ్‌డబ్ల్యూ

‘రా.వన్’ చిత్రంలో నటించిన వారికి షారుక్ ఖాన్ ఖరీదైన బహుమతులు అందిస్తున్నాడు. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా అనుభవ్ సిన్హా తెరకెక్కించిన చిత్రం ‘రా.వన్’  చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పనిచేసిన వారి కోసం షారుక్‌ఖాన్ అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లని బహుమతిగా అందిస్తున్నాడట.
ఇప్పటికే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హాకు, అలాగే విలన్‌గా నటించిన అర్జున్ రాంపాల్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లని బహుమతిగా అందజేసిన షారుక్ ‘రా.వన్’లో చిట్టీగా అతిథి పాత్ర పోషించిన రజనీకాంత్‌కు కూడా బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్‌ని ప్రత్యేక బహుమతిగా అందించబోతున్నాడట. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ ‘ ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీ తేరుకున్న తర్వాత తొలిసారిగా నేను నటించిన ‘రా.వన్’ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా వుంది. నా కెరీర్‌లో ‘రా.వన్’ ను ప్రత్యేకమైన చిత్రంగా భావిస్తున్నాను’ అని తెలిపారు.

‘చాకలి ఐలమ్మ’ ప్రారంభం

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవిత కథ ఆధారంగా ‘చాకలి ఐలమ్మ’ పేరుతోనే ఓ చిత్రం రూపొందనుంది.  ప్రీతీనిగమ్ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో మొదలయింది. మిరియాల రవీందర్ దర్శకత్వంలో కె.నాగమణి, గుర్రపు విజయ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ముహూర్తపు దృశ్యానికి చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం కెమెరా స్విచాన్ చేయగా, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ క్లాప్ ఇచ్చారు.
‘‘తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంటున్న వారందరికీ ఈ సినిమా ఓ కనువిప్పు లాంటిది’’ అని దర్శకుడు మిరియాల రవీందర్ అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరోచిత పోరాట పటిమను కనబరిచిన ఐలమ్మ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని రామచంద్రం చెప్పారు. ఐలమ్మ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రీతీనిగమ్ చెప్పారు.
ఈ నెల 26 నుంచి వరంగల్‌లో తొలి షెడ్యూల్ చేస్తామని, ఖమ్మం, మణుగూర్ తదితర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ తెలిపారు. రాఖీ, బండారి మువ్వ, రమేష్, బయ్యారం వీరన్న, హరిలక్ష్మి, యేరీ లక్ష్మీదేవి, దేవదానం యేసోట్ నరేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కర, కెమెరా: కోట తిరుపతిరెడ్డి, చీఫ్ కో-డెరైక్టర్: మువ్వ.

అల్లరి నరేష్‌ ‘సంఘర్షణ’

అల్లరి నరేష్‌ తమిళంలో నటించిన చిరం తెలుగులో ‘సంఘర్షణ’ పేరుతో అను వాదమవుతోంది. ఇందులో నరేష్‌తో పాటుగా శశి కుమార్‌, కలర్స్‌ స్వాతి, నివేద నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీరంజిత్‌ మూవీస్‌, టింబూ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా హక్కులు పొందాయి. పి.సముద్రఖని దర్శకుడు. ఆదివారం హైద రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్‌, నివేద, సముద్రఖని, అమ్మిరాజు, దామోదర ప్రసాద్‌, టింబర్‌ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ తమిళంలో, తెలుగులో శంభోశివశంభో చిత్రం చేశారు. ఇప్పుడీ చిత్రాన్ని కష్టపడి తీశాను. శంభో శివ శంభో  సినిమా సమయంలో అల్లరి నరేష్‌ పరిచయం అయ్యారు. అప్పటి నుండి అతనితో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. తమిళంలో తీస్తున్న ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరగానే నరేష్‌ అంగీకరించారు. తమిళంలో పోరాలి పేరుతో నిర్మించాను. అందరూ కష్టపడి నటించారు అని పేర్కొన్నారు.
అల్లరి నరేష్‌ మాట్లాడుతూ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది ఈ చిత్ర ఉద్దేశం. ప్రధమార్థం వినోదభరితంగా, ద్వితీయార్థంలో సామాజికాంశాల గురించి చూపిచడం జరిగిందని తెలిపారు.

ఒబామాకు బంపర్ అఫర్

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు బంపర్ అఫర్ తగిలింది. ఒబామాకు ‘క్రొకడైల్‌ అటాక్‌ ఇన్సురెన్స్‌ పాలసీ’ని ఒక కంపెనీ అందజేయనుంది. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మొసళ్లు అధ్యక్షునిపై దాడి చేస్తే 50,870 అమెరికా డాలర్లను నష్టపరిహారంగా చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఈ అద్భుతమైన పాలసీని ఒబామా లాంటి ప్రముఖులకు ఇచ్చేందుకు ఆతృతగా వేచిచూస్తున్నామని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ హార్డింగ్‌ అన్నారు. ఈ మొసళ్ల బీమా 20ఏళ్ల పాటు ఉంటుందని ఆయన తెలిపారు
ఆస్ట్రేలియాలో అటవీ ప్రాంతం, మొసళ్లు ఎక్కువగా ఉండే డార్విన్‌ పట్టణం, రాజధాని కాన్‌బెర్రా ప్రాంతాలలో ఒబామా రెండు రోజుల పాటు పర్యటిస్తారు. అందుకే ఒబామాకు కంపెనీ పాలసీని అందించేందుకు రెడీ అవుతోంది.

విభజిస్తే రాయల తెలంగాణ : ఒవైసీ

‘‘రాష్ట్ర విభజనపై పూటకో మాట వినపడుతోంది. ఒక వేళ చీల్చాల్సి వస్తే రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఇవ్వండి. లేదంటే మౌనంగా ఉండండి. హైదరాబాద్‌పైనా ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను కాపాడుకుంటాం. రాజధానిలో జీవిస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో ఎంఐఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ముస్లిం విద్యార్థినులు విద్యాసంస్థలకు బురఖాలతో వెళితే అవమానించడం మంచి పద్ధతి కాదని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓ పాలసీ లేదన్నారు. మజ్లిస్‌కు మాత్రమే నిర్దిష్ట పాలసీ ఉందన్నారు. ఎవరు అధికారం చెలాయించాలన్నా ముస్లిం భాగస్వామ్యం తప్పనిసరన్నారు. ఎన్నికల కోసమే ముస్లింలను వాడుకుంటున్నారని, 2014లో తమ సత్తా ఏంటో చూపుతామన్నారు.

యూపీ యువకులు బిచ్చగాళ్లు : రాహుల్‌ గాంధీ

‘‘ఉత్తరాదికి చెందిన గ్రామీణ యువకులు, ముఖ్యంగా యుపి, బీహార్‌లకు చెందినవారు ఎంతకాలం ఉపాధి కోసం మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు బిచ్చగాళ్లలా వలస పోవాలని’’ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సోమవారం ఉత్తరప్రదేశ్ లోని ఫూల్పూర్‌ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతో అవమానకరం అని ప్రతిపక్ష బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్ ఖండించారు. ఉపాధిని వెతుక్కొంటూ వలస పోతున్నవారిని బిచ్చగాళ్లని అభివర్ణించినందుకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికాగోష్ఠిలో డిమాండ్‌ చేశారు.
ఉపాధిని వెతుక్కొంటూ యుపియ, బీహార్‌ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతుండడానికి కారణమెవరు?, ఈ రెండు రాష్ట్రాలనూ దాదాపు యాభై ఏళ్లకు పైగా కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలే పాలించాయి, యుపి, బీహార్‌లు ఇంకా వెనుకబడి ఉండడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణం అని జవదేకర్ ఆరోపించారు. బీహార్‌లో గత ఏడేళ్ల ఎన్డీయఏ ప్రభుత్వ పాలనలో ఉపాధి అవకాశాలను బాగా మెరుగుపరిచిన కారణంగా ప్రస్తుతం ఈ వలసలు తగ్గాయని బిజెపి నాయకుడు తెలిపారు.

శ్రీలక్ష్మి రాజీనామా ?

Add caption
గనుల లీజుల్లో అక్రమాలకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డికి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. చెన్నైలోని తన సోదరుని నివాసంలో అనారోగ్యంతో ఉన్న శ్రీలక్ష్మి ఈ మేరకు రాజీనామా లేఖను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రాకు మంగళవారం సీల్డ్‌ కవర్‌ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.
మరోవైపు గనుల లీజుల వ్యవహారంలో విచారణకు హాజరుకావలసిందిగా సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ శ్రీలక్ష్మిని ఆదేశించారు. ఈ నెల 29 వరకు సెలవుకు దరఖాస్తు చేసుకున్న శ్రీలక్ష్మి చెన్నైలో ఉన్న సమాచారం అందుకున్న సిబిఐ పోలీసు బృందం మంగళవారం సాయంత్రం అక్కడికి బయలుదేరి వెళ్ళినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిబిఐ అధికారులు తన కోసం చెన్నై వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న శ్రీలక్ష్మి ఈలోపే ఓ ప్రత్యేక ప్రతినిధి ద్వారా తన రాజీనామా లేఖను పంపించారని సమాచారం.
కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ బాధ్యతల నుండి ప్రభుత్వం మంగళవారమే తప్పించింది.  ఓబుళాపురం మైనింగ్‌ వ్యవహారంలో శ్రీలక్ష్మిని ముద్దా యిగా పేర్కొంటూ సిబిఐ ఇప్పటికే ప్రకటించింది. ఓ వైపు రాజీనామా లేఖను హైదరాబాద్‌కు పంపడం, మరోవైపు శ్రీలక్ష్మి కోసం సిబిఐ బృందం చెన్నై బయలుదేరి వెళ్ళడంతో మైనింగ్‌ విచారణ ఆసక్తికరంగా మారింది.

ఉద్యమాన్ని ఆపలేరు : గద్దర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా ఉద్య మాలు జరుగుతుంటే పోలీస్‌ బలగా లను దింపి అక్రమ అరెస్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరని తెలంగాణ ప్రజాప్రంట్‌ చైర్మెన్‌ గద్దర్‌ అన్నారు. 9వ జాతీయ రహదారి దిగ్బంధం కేసులో అరెస్ట్‌ అయి జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులు చెరుకు సుధాకర్‌ను నల్లగొండ ఆయన ఆసు పత్రిలో పరామర్శించారు.
ముఖ్యమంత్రి, కలెక్టర్‌ స్పం దించి తెలంగాణ వాదులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. తుపాకులతో ఉద్యమాన్ని ఆపలేరని, తెలంగాణ ఉద్యమం న్యాయమై నది, మహౌన్నతమైనదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే జాతీయ రహదా రులపై గుడిసెలు వేస్తామని  హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఢిల్లీలో కుట్రపూరితమైన చర్చలు చేపడుతున్నారని ఆరోపించారు.

పాస్ పోర్టు తీసుకుని కోనేరుకు బెయిలు

దుబాయ్ ప్రసాద్ కు బెయిలు దొరికింది. అయితే, అది కేవలం తాత్కాలికమే. అది కూడా అయ్యప్పదర్శనం కోసం ప్రత్యేక వినతిపై మంజూరు చేసిన బెయిలు. ఎమ్మార్ ప్రాఫర్టీస్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఈయనకు సోమవారం కోర్టు సీబీఐ నుంచి తప్పిస్తూ రిమాండు విధించింది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న కోనేరు కోర్టుకు విన్నవించుకోవడం ఎస్కార్టుతో బెయిలు మంజూరు చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా అతని పాస్ పోర్టు ను కోర్టుకు స్వాధీనం చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది.  దీంతో ఈనెల 17 నుంచి 22 వరకు శబరిమలై వెళ్లేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం కోనేరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

Monday, November 14, 2011

Huwaei Technical Questions 13-11-2011

1) Write a Java Program for Pascal Traingale and print therir each line sum in same line?

2)Write a java program for prime numbers in Fibonacci series?


3) Write a java program for reverse of an array?

4)Write a java Program for delete one element in Doubly Linked List program?

5) Write a java program for sub string?

6)What is  data structure? explain one of the following with example?

a)Quick Sort
b)Merge sort
c)heep Sort
d)bubble sort





7)Write a java program for merging of two arrays?

8)Define Square matrix? Write a java program for sum of diagnoses in square matrix?

9)Write a java program for Searching an element in an array?