Sunday, October 30, 2011

టీఆర్ఎస్ ఆకర్ష, ఆకర్ష ..!

తెరాసలోకి  రామగుండం ఎమ్మెల్యే 
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచారు. శాసనసభలో కాంగ్రెస్‌  పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సింగరేణి కార్మికుల ఆకాంక్ష మేరకే ఉద్యమ పార్టీ తెరాస చేరుతున్నట్లు ఆయన తన జంపింగ్ ను సమర్థించుకున్నారు.
ఎమ్మెల్యే డా.రాజయ్య బెర్త్ కనఫర్మ్ 
మరో వైపు వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డా.రాజయ్య కూడా ఇదే బాట పట్టారు. ఆయన చేరిక ఖరారైందని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరామారావు తెలిపారు. ఇన్నాళ్లు గాసిప్ లా ప్రచారం అవుతున్న ఈ వార్తను టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది.  ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో  కేసీఆర్‌ సమక్షంలో ఎమ్మెల్యే డా.రాజయ్య చేరతారని అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment