Sunday, October 30, 2011

క్రికెట్ దేవుడు సచిన్ కెప్టెన్సీపై లెలె విమర్శలు

Sachin Tendulkar
ముంబై: సీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె తన తన ఆత్మకథ ‘ఐ వజ్ దేర్-మెమరీస్ ఆఫ్ ఎ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్’లో రోజుకో కొత్త విషయాలను బయట పెడుతున్నారు. నిన్న అజహారుద్దీన్, సిద్దూల మద్య జరిగిన విషయాలను తెలియజేయగా, ఈరోజు ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. వివరాల్లోకి వెళితే బ్యాట్స్‌మన్‌గా సచిన్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే భారత కెప్టెన్‌గా మాత్రం అతను విజయవంతం కాలేకపోయాడని, పాత ఘటనల గురించి లెలె ముఖ్యంగా సచిన్ కెప్టెన్సీ వైఫల్యాలపై రాశాడు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతీ ఒక్కరి సలహాలు పాటించడానికి సచిన్ ప్రయత్నించడం వల్లనే అతను కెప్టెన్‌గా రాణించలేకపోయాడని అన్నాడు.

ప్రధానంగా రెండు సంఘటనలను లెలె ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. ముంబైకే చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నీలేశ్ కులకర్ణి ఏ స్థాయిలో వికెట్లు తీశాడో తెలీకుండానే ఒకరి సలహా విని దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు కోసం సెలక్షన్ కమిటీ ముందు అతని పేరు ప్రతిపాదించాడు. అయితే కమిటీ చైర్మన్ కిషన్ రుంగ్తా... కులకర్ణి అసలు రంజీ మ్యాచ్‌లే ఆడలేదని, ముంబై జట్టులో స్థానం కోల్పోయాడని సచిన్‌కు గుర్తు చేయాల్సి వచ్చింది.

'1999-2000 సం||లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, వన్డే సీరిస్‌ను భారత్‌లో ఆడాల్సి ఉంది. ముంబయిలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మూడు రోజుల్లోనే విజయం సాధించింది. ఆ పరాజయంతో భారత జట్టుపై విమర్శల జడివాన కురిసింది. మరీ ముఖ్యంగా సచిన్‌ కెప్టెన్సీపై. ఊహించని సంఘటనతో సచిన్‌ ఆధైర్యపడ్డాడు. నిరాశచెందాడు. భారత్‌కు భారీ ఓటమి తప్పదని సచిన్‌కు రెండో రోజే అర్ధమైంది. ఆ రోజు సాయంత్రం నాకు సచిన్‌ నుంచి ఒక ఉత్తరం అందింది. నేను షాక్‌ తిన్నాను. అది సచిన్‌ కెప్టెన్సీకి రాజీనామా లేఖ! నేను నిర్ఘంతపోయాను. సిరీస్ మధ్యలో ఇలా చేయవద్దంటూ లెలెతో సహా పలువురు నచ్చజెప్పినా అతను ఒప్పుకోలేదు. చివరకు వారందరూ సచిన్ భార్య అంజలిని ఆశ్రయించారు. దాంతో ఆ సిరీస్ ముగిసే వరకూ సచిన్ కొనసాగాడని లెలె తన ఆత్మకధలో ప్రస్తావించారు.

No comments:

Post a Comment

Thank you for your comment