తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సైబరాబాద్ పోలీసులు మంగళవారం
చీటింగ్ నేరంపై సెక్షన్ 420 కింద కేసును నమోదు చేశారు. తెలంగాణ విషయంలో
చంద్రబాబు చీటింగ్ చేశారని ఫిర్యాదు చేస్తూ ఇటీవల జనార్దన్‌గౌడ్ అనే
న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేక
పోవడంతో ఆయన మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను చేసిన
ఫిర్యాదుపై ఎవరూ స్పందించడం లేదంటూ జనార్దన్‌గౌడ్ పిల్ దాఖలు చేశారు.
పిల్‌పై స్పందించిన కోర్టు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ అధికారులను
ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాగా పక్షం రోజుల క్రితం జనార్దన్‌గౌడ్ తెలంగాణకు తాను అనుకూలంగా
ఉన్నానని మొదట చెప్పిన చంద్రబాబు కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు ప్రక్రియను
ప్రారంభించామని చెప్పిన తర్వాత మాట మార్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ
ప్రజలను చీటింగ్ చేశారని ఆరోపిస్తూ జనార్దన్‌గౌడ్ ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు
చేయాలని చైతన్యపురి పోలీసులను అప్పుడే ఆదేశించింది. అయినప్పటికీ పోలీసులు
స్పందించలేదు. దీంతో జనార్దన్‌గౌడ్ మరోసారి కోర్టు దృష్టికి విషయాన్ని
తీసుకు రావడంతో పోలీసులు కేసును నమోదు చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment