తెలంగాణపై కేంద్రం ఆలస్యం చేస్తే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోమని ఎంపీ
గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం అనేది తథ్యమని
ఆయన అన్నారు. ఉద్యమాన్ని ఆపేది లేదని, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా
ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. త్వరలో సమావేశమై
భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం
లేకుండా తెలంగాణపై ప్రకటన చేస్తామని ఆజాద్ తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్
సీనియర్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విజయోత్సవాలు
జరుపుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత
కె.కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. భేటీలో
భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే
అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment
Thank you for your comment