2004
నుండి తెలంగాణ అంశాన్ని నానుస్తూ, ఇంకా ఊగిసలాట వైఖరి ప్రదర్శిస్తూ
స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, పైగా ఒకప్పుడు తిరస్కరించబడ్డ రెండవ
ఎస్‌ఆర్‌సిని తెర మీదికి తీసుకురావడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు
అద్దం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
తెలంగాణ సమస్యకు రెండవ పునర్విభజన కమిషన్ ఏర్పాటు పరిష్కారం కాదని, అలా
చేస్తే కందిరీగల తుట్టెను కదిలించడమే అవుతుందని హెచ్చరించారు. రెండవ
ఎస్‌ఆర్‌సిని ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ సమస్య రావణ కాష్టంలా తగలబడుతూనే
ఉంటుందని అన్నారు. ఈ నెల 13వ తేదీన అనారోగ్యాలు, పారిశుధ్య సమస్యలపై
రాష్ట్రవ్యాపితంగా తలపెట్టిన శ్రమదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని
కోరారు.
No comments:
Post a Comment
Thank you for your comment