అట్లాంట విభాగపు అమెరికన్ తెలుగు అసోసియేషన్, పన్నెండవ ఆటా కన్వెన్షన్
సంయుక్తంగా నిర్వహించిన అట్లాంట ‘ఆటా రోజు’ వేడుకలు నవంబర్ 5, 2011
సాయంత్రం సాయి మురళి రెస్టారెంట్లో కనుల విందుగా జరిగాయి. సుదూరాల నుంచి
వచ్చిన అతిథులకు కరుణ్ ఎసిరెడ్డి (కన్వీనర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్)
ఘనమైన స్వాగతం పలికారు. ఈ వేడుకలు కరుణాకర్ ఏసిరెడ్డి, డా. జగన్ మోహన్ రావు
(కో ఆర్డినేటర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్ 2012 ), విక్రం సూదిని మరియు
ప్రశీల్ గూకంటి (అట్లాంట ఆటా కోఆర్డినేటర్) పర్యవేక్షణలో జరిగాయి. దాదాపు
500లకు పైగా తెలుగువారు తమ కుటుంభ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.
ప్రతి సంవత్సరం ఈ ఆటా రోజు జరుపుకోడం ఆటా ఆనవాయితీ అయినా ఈ సంవత్సరం
వేడుకల్లో దాతలను సత్కరించారు.
అట్లాంటా ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు $350,000 విరాళాలు హామీ రూపకంగా
సేకరించారు. అందులో ఎక్కువ మొత్తంలో ($25,000) విరాళాలు ప్రకటించిన మహా
దాతలు SP రెడ్డి (eGenious Consulting), మురళి సజ్జ & ప్రమోద్
సజ్జ (Paramount Consulting), మురళి రెడ్డి & దేవేందర్ రెడ్డి
(Charter Global). రాబోయే సంవత్సరంలో జరగబోయే పన్నెండవ ఆటా కన్వెన్షన్
నిర్వహణకై కావాల్సిన ఆర్థిక వనరులను అందజేయడంలో చేయూత నిచ్చిన దాతలకు పేరు
పేరున కృతఙ్ఞతలు అందజేస్తూ కరుణ్ ఎసిరెడ్డి, దాతలు ఇంకా ముందుకు రావాలని
రాబోయే పన్నెండవ ఆటా కన్వెన్షన్ కనివినని రీతిలో జరుపుకోడానికి ఆర్థిక
సహాయం అందజేయాలని కోరారు. డా. శ్రీని గంగసాని, చేర్ పర్సన్ ఫండ్ రేజింగ్
కమేటి, మనోహర్ కాసేట్టి (Co Chair Fundraising Committee) మరియు శేషగిరి
రావు మండవ (Chair, Corporate Committee) అందరి నుండి హామీలు పొందడం
గమనార్హం.
విందు, వినోదాలు ఘనంగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని సత్య
కర్నాటి (Cultural Committee) మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఎక్కడ
తెలుగువారి వేడుకలు జరిగిన అట్లాంటాలో తన DJ తో పాటుగా మధురమైన
సంగీతాన్ని అందించే రాం దుర్వాసుల ఇంకా సీనీ సంగీత దర్శకులు రఘు కుంచె
మరియు సీనీ గాయకురాలు విజయ లక్ష్మిలతో పాటుగా స్థానిక కళాకారులు తమ గాన
మాధూర్యాన్ని అందించి ప్రేక్షకుల్ని రసోల్లాసంలో ముంచెత్తారు.
No comments:
Post a Comment
Thank you for your comment