అదిగో
పులి అంటే ఇదిగో తోక అనే ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ గురించి మొట్టమొదటి
సారి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అద్భతంగా స్పందించింది. త్వరలో ఐశ్వర్యారాయ్
డెలివరీ కానుండటంతో దానికి సంబంధించిన ఎటువంటి కథనాలను ప్రసారం చేయరాదని,
కాన్పు తర్వాత కూడా అమితాబ్ కుటుంబం ఇస్తే తప్ప ఏ వార్త ప్రసారం చేయరాదని
తీర్మానించింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రసవానికి సంబంధించిన వార్తల
ప్రసారంపై స్వయంగా మీడియా ఆంక్షల్ని విధించుకోవడంపై అమితాబ్ చాలా సంతోషం,
సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నా మనసు తాకిన నిర్ణయమని, మీడియా వారికి
కృతజ్ఞతలు తెలిపారు.
ఐశ్వర్యకు కాన్పు- సంబంధిత వార్తలు, వ్యవహరించాల్సిన తీరు అనే అంశంపై
తాజాగా బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్న విషయం
తెలిసిందే. ఆ తీర్మానంలో సంబంధిత కథనాలు కూడా నియంత్రించడం విశేషం. ఐశ్వర్య
పెళ్లికి మీడియా చేసిన హడావుడి, అవమానాల నేపథ్యంలో అసోషియేషన్ ఈ నిర్ణయం
తీసుకుంటున్న తెలుస్తోంది. మొత్తం పది పాయింట్లతో కూడిన ఓ జాబితాను
బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ జారీ చేసింది. అందులో ఎలాంటి సమాచారం
ఇవ్వకూడదు, ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఏ మార్గదర్శకాలు పాటించాలి అన్నది
స్పస్టంగా పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ హంగామా ఉండకూడదని కూడా
చెప్పింది. ఆస్పత్రి వెలుపల, పరిసరాల్లో బ్రాడ్‌కాస్టింగ్ వ్యాన్లను
ఉంచరాదని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ చాలా విస్పష్టంగా పేర్కొంది.
No comments:
Post a Comment
Thank you for your comment