Saturday, November 5, 2011

కొన్నిగంటల్లో దేవినేని ఉమ అరెస్టు

రచ్చబండలో చేసిన రచ్చపై కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రెడ్డిగూడెంలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పార్థసారధిని అడ్డుకున్న కేసులో ఉమతో పాటు మరో పదిమంది కార్యకర్తలపై పోలీసులు 341,352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  దేవినేని ఉమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం ఉదయం గొల్లపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. మంత్రి పార్థసారధికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమను అరెస్ట్ చేస్తే రహదారులు దిగ్బంధం చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హెచ్చరించారు. పోలీసులు భారీగా మోహరించటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. విజయవాడ నగరంలో కూడా పలు చోట్ల భద్రత ఏర్పాటుచేశారు.
Read More >>

బ్లాక్ మనీ వీఐపీలు వీరే

ఎమ్మార్ లో కేవలం ఇరవై శాతం ధర అధికారికంగా చూపించి  మిగతా ఎనభై శాతం బ్లాక్ మనీతో అక్కడ విల్లాలు కొన్న ప్రముఖులకు చమటలు పడుతున్నాయి. మామూలుగా అయితే వీరికి ఈ కేసుల నుంచి పైరవీలు చేసి బయటపడటం పెద్ద కష్టమేం కాదు. కానీ కేసు సీబీఐ చేతుల్లో ఉండటమే వారి భయానికి కారణం. ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసి తక్కువకే కొనుగోలు చేసినట్టు చూపించన నేపథ్యంలో కనిపించని డబ్బు చాలా మంది తమ బ్లాక్ మనీ నుంచే తెచ్చినట్లు సీబీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ అనుమానిస్తున్నాయి. విచారణలో అదే కనుక తేలితే సీబీఐ కేసులో ఇరుక్కోవడంతో పాటు ఇతర శాఖలకు మూడొందల శాతం పెనాల్టీ పడుతుంది. ఒకవేళ కట్టింది బ్లాక్ మనీ అయితే జైలు శిక్ష కూడా పడుతుంది. ఇవన్నీ విల్లాల వీఐపీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఎమ్మార్‌లో విల్లాలు కొన్నది వీళ్లే
ధర్మపురి శ్రీనివాస్ (పీసీసీ మాజీ అధ్యక్షుడు),
కోటగిరి సునీత (కేవీపీ రామచంద్రరావు సతీమణి),
జె.గీతారెడ్డి (రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి),
వైఎస్ విద్యారెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి బంధువు),
డాక్టర్ సోమరాజు (కేర్ ఆస్పత్రి అధినేత),
నారా బ్రహ్మణి (చంద్రబాబు కోడలు),
గల్లా పద్మావతి (మంత్రి గల్లా అరుణ కోడలు),
ఘట్టమనేని మంజుల (సినీ నటుడు కృష్ణ కుమార్తె),
ఘట్టమనేని మహేశ్ బాబు (సినీ హీరో),
నమ్రతా శిరోద్కర్ (మహేశ్ బాబు భార్య),
డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి (మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి సోదరుడు),
చలసాని స్వప్నాదత్ (సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె),
అంబటి మురళీకృష్ణ (అంబటి రాంబాబు సోదరుడు),
వాకిన చాముండేశ్వరీనాథ్ (మాజీ క్రికెటర్),
రేష్మీ సింగ్ (సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.పి.సింగ్ భార్య).
ఈ జాబితాలో ఎక్కువగా కాంగ్రెస్ అనుకూలురు ఉండటం వల్ల సీబీఐ విల్లాల కొనుగోలు అంశాన్ని దాటవేసి ఎమ్మార్ తప్పులనే  ఎత్తిచూపేలా సెంట్రల్ కాంగ్రెస్ పావులు కదిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే… మీడియా నుంచి బయటపడటానికి వీరందరికీ జరిమానాతో బయటపడే మార్గాలను వెదుకుతోంది.
Read More >>

పేలిన “బిజినెస్ మాన్” డైలాగులు

మహేష్ బాబు తో పూరీ జగన్నాథ్ ‘ది బిజినెస్ మేన్’ పేరిట ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దూకుడుతో హిట్ కొట్టిన మహేష్ బిజినెస్ మాన్ గా మంచి బిజినెస్ చేయాలని తహతహలాడుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్నిడైలాగులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని. డైలాగులను మహేష్ తన మాడ్యులేషన్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. దీని డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా పూర్తి చేశారు.
విసిటింగ్ కార్డ్ ఇవ్వడానికి నేను చేసేది ఏమైనా కార్పొరేట్ జాబ్ రా…కావాలంటే చెప్పు రెండు బుల్లెట్స్ నీ బాడీలోకి ఇస్తా..ఉంచుకో !
ముందు మనీ గురించి మాట్లాడుతా, తర్వాత డీల్ గురించి మాట్లాడుతా !
నాతో డీల్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాదురా చూసుకోవాల్సింది..చేతిలో గన్ ఉందో లేదో చూసుకోవాలి… 
యుద్దం చేయడానికి భయపడేవాడే ధర్మం గురించి మాట్లాడతాడు
Read More >>

డీఎస్పీ నళిని ఉద్యోగం పోయింది

తెలంగాణ కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని డీజీపీ దినేష్‌రెడ్డి సస్పెండ్ చేశారు. విధుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి  క్రమశిక్షణ తప్పినందుకే సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో తెలంగాణ కోసం ఆమె తన పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా సీమాంధ్ర అధికారుల వేధింపులు తాళలేకనే రాజీనామా చేశానని ఆమె గురువారం చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఉద్యోగం చేస్తానని కూడా తెలిపారు.
Read More >>

జగనే ఓ అపద్ధం: బాబు

సీబీఐ విచారణ అనంతరం చంద్రబాబును విచారించాలి అన్న జగన్ పై కర్నూలు పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  వైయస్ జగన్ అబద్ధాలకోరు అని, సిబిఐకి తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కానిస్టేబుల్ కొడుకు అయిన గాలి జనార్దన్ రెడ్డి, జగను అంత నిజాయితీ పరులైతే రాజ భవనాలను తలదన్నే ప్యాలెస్ లు ఎలా కడతారని ప్రశ్నించారు. ఒకరేమో అప్పుల్లో ఉన్నవారు, మరొకరేమో ఏడో తరగతి చదివిన వాడు… వారిద్దరికీ ఇప్పుడు భారతదేశంలోనే ఖరీదైన ఇళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.  పార్టీలకు అతీతంగా గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కటై ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు.  జగనే ఓ అపద్ధం అయితే, ఆయన మాటలు అపద్ధాలు కాకుండా పోతాయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read More >>

పెట్రోలు ధరలు మీ ఇష్టమా: హైకోర్టు

కేవలం ఏడాదిలో నలభై శాతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి ఇన్నాళ్లకు దీనిపై పెద్ద ఆటంకం ఎదురయింది. పెట్రోల్ ధరల పెంపును కేరళ హై కోర్టు తప్పు పట్టింది.  మీ ఇష్టాను సారం పెట్రోలు ధరలు పెంచుతూ పోతే కామన్ మాన్ ఏమయిపోవాలని ఆగ్రహం వ్యక్తంచేసింది. మాజీ ఎంపీ థామస్ వేసిన పిటిషనుపై కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎన్ రామచంద్రన్ నాయర్ విచారణ జరిపారు. తరచూ పెట్రోలు ధరలు పెంచడాన్ని తప్పు పడుతూ  ఐవోసీ, రిలయన్స్, చమురు సంస్థలు బ్యాలన్స్ సీట్లను సమర్పించాలని ఆదేశించారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని ఏకంగా కోర్టే చెప్పడం విశేషం. బైకులు, పెట్రోలుతో నడిచే చిన్న కార్ల యజమానులే ఈ ధరల వల్ల ఎక్కువ నష్టపోతున్నారని, పెద్దవాళ్లు – సంపన్నులు ఖరీదైన డీజిలు కార్లు కొనుక్కుంటారని పిటిషనరు పేర్కొన్నారు.
మరో వైపు పెట్రోల్ ధరల పెంపును ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్థించారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్‌లోని కేన్స్‌కు వెళ్లిన ఆయన అక్కడ విలేకర్లతో మాట్లాడారు. తప్పని పరిస్థితుల్లోనే పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఏడాదిలో 11 సార్లు పెట్రోలు ధరలు పెంచారని మమత  మండిపడింది. కేంద్ర ప్రభుత్వం ఎవర్ని సంప్రదించి పెట్రోలు ధరలు పెంచిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం తమ సలహాలను పాటించడం లేదని ఆరోపించారు. ప్రధాని విదేశీ పర్యటన నుంచి రాగానే యూపీఏ నుంచి వైదొలగే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read More >>

శబరిమలకు ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ హరిహరపుత్రుడు అయ్యప్ప సేవలో తరిస్తోంది. కేరళలోని శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు చార్జీల్లో రాయితీ కూడా ఇచ్చింది. ఏడాదికేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివెళ్లే భక్తజనులు పెరగడంతో వారికి సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ కృషిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా 1700 బస్సులను నడపాలని నిశ్చయించింది. ఈ బస్సులు నేరుగా శబరిమలకు వెళ్లకుండా భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల మీదుగా ప్రయాణిస్తాయి.  ప్యాకేజీలు వ్యక్తిగత, గ్రూపు విభాగాల్లో దొరుకుతున్నాయి.  బస్సు మొత్తం బుక్ చేస్తే ఇద్దరు వంట మనుషులు, గురుస్వామి ఇద్దరు మణికంఠ (బాలభక్తులు)లకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తారు.
వివరాలకు : 801 999 9999, 040-3366699 నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ లింక్ : http://apsrtconline.in/
Read More >>

జగన్ జర్నలిజం పాఠాలు

జగన్ కు ఎవరు నేర్పారో గాని, ఎప్పుడు తనమీద ఆరోపణలు వచ్చినా… ఒక్కసారి కూడా ఖండించరు. వెంటనే తన ప్రత్యర్తులు చేసిన అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. “నేనే కాదు, వాళ్లు కూడా చేశారు, కావాలంటే ఇదిగో ఆధారాలు” అన్నట్టే ఉంటుంది ఆయన వాలకం. రాజకీయంలో ఈ పద్ధతికి వైఎస్ పునాదులు వేస్తే, జగన్ పెంచి పోషించారు. తాజాగా తన వాలకాన్ని ఆయన మరోసారి చూపించారు. సీబీఐ ఆయనను విచారించిన వెంటనే “తాను తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది” అనాల్సిన యువనేత… ఇదిగోండి చంద్రబాబు కూడా అక్రమాలు చేశారు. ఆయన్నూ మీరు విచారించాలి అంటూ సీబీఐకి విన్నివించి వచ్చారు. ఇదెక్కడి విచిత్రమో ఆయనే చెప్పాలి మరి.
సీబీఐ సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని అన్నారు. 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు. అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు.
“ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొంతకాలం కిందట వారితో జత కలిసిన టీవీ9 వీరందరికీ నేను చెప్పేది ఒక్కటే. పాత్రికేయ నీతిని పాటించండి. మీరు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముందో బయటకు చెప్పండి” అన్నారు.
Read More >>

మొగుడు సినిమా రివ్యూ

కృష్ణవంశీ ఏం చేస్తాడు.. కొత్తగా ఆలోచిస్తాడు. తాను నమ్మింది తీస్తాడు. కాంప్రమైజ్ కాడు. లవ్-కిడ్నాప్ నేపథ్యంలో ఒక గులాబి, కుటుంబ బంధాల కలబోతతో ఒక నిన్నే పెళ్లాడతా, తీవ్రవాదం బ్యాక్ డ్రాప్ లో ఒక సింధూరం.. ఇలా ఆరంభంలో అతని సినిమాలు వేటికవే డిఫరెంట్. కానీ ఈ క్రియేటివ్ డైరెక్టర్ సృజనాత్మకత మురారి దగ్గరే ఆగిపోయింది. ఆ సినిమాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ బంధాల్ని చక్కగా చూపించి.. ఆంధ్ర ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన కృష్ణవంశీ తర్వాత ఆ ‘బంధా’ల్లోనే చిక్కుకుపోయాడు. చందమామ, శశిరేఖా పరిణయం.. తాజాగా మొగుడు.. అన్నింట్లోనూ ఒకటే పాయింట్. ఒక పెళ్లి, రెండు కుటుంబాలు, ఇద్దరి మధ్యా గొడవలు.. ఏడుపులు.. ఎమోషన్లు.. చివరికి కథ సుఖాంతం. ఇదీ కథ. అంతేనా కృష్ణవంశీ అంటే?
వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి పైకొచ్చిన తన తండ్రి ఆంజనేయ ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) గురించి రాంప్రసాద్ అలియాస్ బుజ్జి (గోపీచంద్) ఉపోద్ఘాతంతో మొదలవుతుంది కథ. రాష్ట్రపతి చేత కృషి పండిట్ అవార్డునందుకున్న ఆంజనేయప్రసాద్ కు ముగ్గరు కూతుళ్లు, ఒక కొడుకు. ముగ్గురమ్మాయిల్నీ బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేస్తాడు ఆంజనేయప్రసాద్. అల్లుళ్లు కూడా అతనితో పాటే ఉంటారు. కొడుకు బుజ్జి కూడా బాగా చదువుకుని మెర్సిడెజ్ బెంజ్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంటాడు. ఇక కొడుక్కి పెళ్లి చేయడమొక్కటే ఆంజనేయ ప్రసాద్ కి ఉన్న బాధ్యత. కానీ బుజ్జికి పెళ్లంటే ఇష్టం ఉండదు. తండ్రి బలవంతంతో ఒప్పుకుంటాడు. చూసిన సంబంధాలు నచ్చవు. అనుకోకుండా రాజేశ్వరి (తాప్సి)ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె కూడా ఇతణ్ని ప్రేమిస్తుంది. రాజేశ్వరి తల్లి చాముండేశ్వరి (రోజా) రాజకీయ నాయకురాలు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి జరిగిపోతుంది. కానీ అప్పగింతల సమయంలో చిన్న మాటా మాటా వచ్చి ఇరు కుటంబాలకు గొడవ జరుగుతుంది. అది కాస్తా పెద్దదై ఒకళ్లపై ఒకళ్లు చేయి చేసుకుంటారు. అంతే.. రాజేశ్వరి తాళి తీసి మొహాన కొడుతుంది. ఇదీ ప్రథమార్ధం. ఇక ద్వితీయార్ధంలో జరిగే కథేంటో సులభంగా ఊహించేయచ్చు. మళ్లీ ఈ జంట ఎలా ఒక్కటయింది. రెండు కుటుంబాలు ఎలా కలిశాయి? అన్నదే మిగతా కథాంశం.
ఇంటర్వెల్ కు ముందొచ్చే సన్నివేశం సినిమాకు ఆయువు పట్టని కృష్ణవంశీ నమ్మాడు. నిజమే.. ప్రేక్షకుడు అత్యంత ఆసక్తి సినిమాపై దృష్టిపెట్టింది అక్కడే. కానీ ఆ ఒక్క పాయింట్ ను నమ్మకుని.. అటూ ఇటూ అర్థం లేని, రొటీన్ సన్నివేశాలతో నింపేస్తే. అందులోనూ ఆ పని కృష్ణవంశీ చేస్తే. వరుసగా ఫ్లాపులొస్తున్నా.. క్రియేటివిటీకి గుడ్ బై చెప్పేసి చాలా కాలమైనా ఇప్పటికీ కృష్ణవంశీ పేరు చూసి సినిమాలకొచ్చే జనాలున్నారు. కానీ వారిని తీవ్రంగా నిరాశ పరిచింది మొగుడు. కుటుంబంలోని వారంతా ఈడుకొచ్చిన కుర్రాడికి పెళ్లి చేయాలని చూడటం.. అతనేమో వద్దు వద్దనడం.. ఆనక ఓ అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకోవడం.. ఎవర్ని చూసినా ఆ అమ్మాయే అనుకోవడం.. తర్వాత ఓ డ్రీమ్ సాంగేసుకోవడం.. హీరోయిన్ ను కూడా లవ్ లో పడేయడం.. తర్వాత పెళ్లి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ప్రథమార్ధమంతా ఈ సన్నివేశాలకే సరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథ దార్లోకి వచ్చిందిలే.. ఇంకేం జరుగుతుందో చూద్దామని సెకండాఫ్ లోకి వెళ్తే.. ఏముంది.. మళ్లీ పాత కథే. హీరో, హీరోయిన్ ఫారిన్ వెళ్తారు. అక్కడ సెకండ్ హీరోయిన్ ఎంట్రీ. జలసీతో హీరోయిన్ కు, హీరోకు గొడవ. తర్వాత ఇద్దరూ ఒకటైపోతారు. ఆపై క్లైమాక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండిస్తాడని కృష్ణవంశీకి పేరు. కానీ అతకని సన్నివేశాలతో ఈ సినిమాలో ఎమోషన్స్ పండలేదు. చాలా సన్నివేశాల్లో నటీనటులు ఓవర్ గా రియాక్టవుతున్నట్లు, ఓవరాక్షన్ చేస్తున్నట్లు అనిపించిందంటే.. అందుకు సన్నివేశాల్లో బలం లేకపోవడమే కారణం.

ట్రైలర్స్, పోస్టర్స్ చూసి ‘మొగుడు’లో తాప్సి ప్రధాన ఆకర్షణ అవుతుందనుకుంటే.. పెద్ద మైనస్ అయి కూర్చుంది. ఆమెతో డబ్బింగ్ చెప్పించడం దర్శకుడు చేసిన పెద్ద తప్పు. మిస్టర్ పర్ఫెక్ట్ లో అయితే ఆమె మోడర్న్ గర్ల్ కాబట్టి, ఫారిన్లో ఉంటుంది కాబట్టి వంకర టింకర తెలుగు మాట్లాడితే ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ, శాస్త్రీయ నృత్యం నేర్చుకునే తెలుగింటి అమ్మాయి తెలుగును పరమ ఘోరంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోవాలి? అసలు తెలుగంటే, తెలుగింటి సంప్రదాయాలంటే మక్కువ చూసే కృష్ణవంశీకి తాప్సితో డబ్బింగ్ చెప్పించాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో. యాక్షన్ కి, ఆమె చెబుతున్న డైలాగులకి లంకె కుదరక.. ఎమోషన్స్ పండక.. ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా అన్న ఇబ్బందిలో పడిపోయాడు ప్రేక్షకుడు. తాప్సికి వేసిన మేకప్ కూడా చాలా సందర్భాల్లో బాగాలేదు. క్లాసికల్ డ్యాన్స్ చేసే అమ్మాయి పబ్బుల్లో పడి తాగడం, నడుంపై టాటూ వేయించుకోవడమేంటో? ఇక గోపీచంద్ కూడా పెద్దగా చేసిందేం లేదు. ఎమోషనల్ సీన్స్ లో అతని నటన బాగుంది కానీ.. వాయిస్ మైనస్ గా మారింది. ఎక్స్ పోజింగ్ లో శ్రద్ధాదాస్ తో పోటీపడ్డాడు గోపీచంద్. రెండు పాటల్లో అతనికి చొక్కానే ఉండదు. రాజేంద్రప్రసాద్ బాగా చేశాడు. కానీ సీరియస్ సన్నివేశాల్లో అతను సడెన్ గా అమాయకంగా మారిపోతుంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందర్లోకి రోజా నటన బాగుంది. బాబు శంకర్ సంగీతం ఓకే. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రాధాకృష్ణన్ శైలిలో సాగాయి అతని పాటలు.
అసలైన మొగుడు ఎలా ఉండాలో చూపిస్తాం అన్నాడు కృష్ణవంశీ. కానీ ఈ సినిమాలో ఆ పాయింటే లేదు. ఉన్నదంతా రెండు కుటుంబాల గొడవలే.
రేటింగ్- 1.5/5
Read More >>

Friday, November 4, 2011

వెనుక గేటు నుంచి జగన్

ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం సీబీఐ నుంచి నోటీసులందుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కార్యాలయానికి వెనుక గేటు నుండి లోనికి వెళ్లారు. శుక్రవారం సిబిఐ ముందు హాజరు కావడానికి ఆయన తన ఇంటి వద్ద నుండి ఉదయం పది గంటల ప్రాంతంలో బయలు దేరారు. సుమారు పదిన్నర గంటలకు సిబిఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన వెనుక గేటు నుండి లోపలకు వెళ్లారు. జగన్ వాహనంతో వెనుక వచ్చిన వాహనాలను లోపలకు అనుమతించలేదు.
Read More >>

జగన్ అభిమానులపై లాఠీ ఛార్జి

ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం జగన్మోహనరెడ్డి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్‌ను విచారిస్తున్నారని తెలుసుకొని భారీగా పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. సిబిఐ కార్యాలయం ముందు వీరు పెద్ద ఎత్తున గుమికూడి రభస చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో అభిమానులు సిబిఐ కార్యాలయ బోర్డును తొలగించారు. పలుసార్లు వారు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కోఠి – రాంకోఠి రహదారిని మూసి వేశారు. సిబిఐ కార్యాలయ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక అభిమాని కోఠి చౌరస్తాలోని హౌర్డింగ్ ఎక్కాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read More >>

రామలింగరాజుకు బెయిల్

జైలు నుంచి బయటకు రావాలన్న రామలింగరాజు ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ లకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికీ రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ, ట్రయిల్ కోర్టు విచారణకు సహకరించాలని సూచించింది. రెండున్నరేళ్లకు పైగా రామలింగరాజు జైల్లోనే ఉన్నారు.
Read More >>

పాపం చిరు అభిమానులు

చిరంజీవి అభిమానులకు శుక్రవారం తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు చిరంజీవి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు విమానాశ్రయంలోకి అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎంతకూ లోపలకు అనుమతించక పోవడంతో వారు విమానాశ్రయం ముందు ఆందోళనకు దిగారు.
Read More >>

అన్నా మౌనదీక్ష విరమణ

అన్నా హజారే మౌన 19 రోజుల మౌనదీక్షను విరమించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన దీక్ష విరమణ జరిగింది. అక్టోబర్ 16 నుంచి పందొమ్మిది రోజులు పాటు అన్నా హజారే మౌనదీక్ష చేపట్టారు. భారత్ మాతాకీ జై అంటూ మౌనం వీడారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనలోక్ పాల్ బిల్లు అమలయ్యేవరకూ పోరాడతానని స్పష్టం చేశారు. తన మౌనదీక్ష ఎవరికీ వ్యతిరేకం కాదని…అవినీతిని సమూలంగా నిర్మూలించటమే తమ ధ్యేయమని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లు మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని హజారే అన్నారు.
Read More >>

‘నువ్విలా’ రివ్యూ

 
రవిబాబు, ఉషా కిరణ్ మూవీస్, శేఖర్ చంద్ర.. మళ్లీ ‘నచ్చావులే’ టీమ్ తెరపైకి వచ్చింది ‘నువ్విలా..’ అంటూ.  ఆకట్టుకునే పోస్టర్లు, కొత్త తరహా పబ్లిసిటీ, ఫీల్ గుడ్ మ్యూజిక్ తో మళ్లీ నచ్చావులే మ్యాజిక్ ను రిపీట్ చేసేలా కనిపించిన ‘నువ్విలా..’ ఆశించిన స్థాయిలో లేదు కానీ నిరాశ పరిచేది మాత్రం కాదు.
పిజ్జా కార్నర్లో పనిచేసే ముగ్గురు స్నేహితులు, వారి జీవితాల్లోకి ప్రవేశించే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది.  ఎప్పుడూ కన్ఫ్యూజన్లో ఉండే ఆనంద్ (అజయ్) తన ఎదురింట్లో కొత్తగా చేరిన అమ్మాయి అర్చన (యామి)ని ప్రేమిస్తాడు. ఐతే అప్పటికే ఓ క్రికెటర్ ప్రేమలో పడిన ఆమె అతని కారణంగా గర్భవతి కూడా అవుతుంది. కానీ విష్ణు చనిపోవడంతో ఆమె బాధ్యతను ఆనంద్ తీసుకుంటాడు. ఇక రాజు (ప్రసాద్)కు మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో చేరాలన్నది లక్ష్యం. ఇతనికి రమ్య (రమ్య)కు అస్సలు పడదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మోడల్ కావాలనుకునే మహేష్ (హివేష్)ది మరో కథ. ఇతను మాధవి (సరయు)ను ప్రేమిస్తాడు. కానీ ఓ గొడవతో ఇద్దరూ విడిపోతారు. ఇతని కథలోకి గే పాత్ర చేరడం మరో మలుపు. ఇలా మూడు జంటల జీవితాలు ఎటు పయనించాయి? చివరికేమైంది అన్నది మిగిలిన కథ.
కథ వింటేనే బట్టే ఇది స్ట్రిక్ట్లీ ఫర్ యూత్ సినిమా అని అర్థమైపోతుంది.  స్ర్రీన్ ప్లే, మాటలు, నటీనటుల ప్రదర్శన మీదే నడిచిన నువ్విలాలో బలమైన కథ లేదు. ఫస్టాఫ్ వేగంగా సాగి.. మంచి అనుభూతినిస్తుంది కానీ.. గే పాత్ర ప్రవేశంతో సినిమా గాడి తప్పింది. ఆ పాత్రను రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేయకుండా పొడిగించడం ఇబ్బందిగా మారింది. ద్వితీయార్ధం రొటీన్ గా సాగడం.. క్లయిమాక్స్ కూడా సాధారణంగా ఉండటంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తి దక్కదు. హీరోల స్థాయిలో తన పేరు చూసి సినిమాకు వచ్చే అభిమానుల్ని సంపాదించుకున్న రవిబాబు.. ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకత ఏదో ఒకటి చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలోనూ తన శైలిని చూచించాడతను. నచ్చావులే స్థాయి సినిమా తీయలేదు కానీ.. మనసారాలా డిసప్పాయింట్ చేయలేదు. నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టకోవడంలో, స్క్రీన్ ప్లేను వేగంగా నడిపించడంలో, సిచ్యువేషనల్ కామెడీని పండించడంలో, కొన్ని పంచ్ డైలాగులు రాయడంలో అతను సఫలీకృతుడయ్యాడు. మరోసారి నచ్చావులేకు చేసిన మ్యాజిక్ నే రవిబాబు పునరావృతం చేశాడు. చాలా పరిమితమైన లొకేషన్లలో, పరిమితమైన బడ్జెట్లో మంచి క్వాలిటీతో మూవీ తీసి పెట్టాడు. ఈ విషయంలో కెమెరామెన్ సుధాకర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ అతనికి బాగా ఉపయోగపడ్డారు. చాలా సాధరణమైన లొకేషన్స్ లోనే మంచి డెకరేషన్, కలర్ ఫుల్ థీమ్స్ వాడి  లాంగ్ షాట్ల జోలికి పోకుండా సినిమాకి రిచ్ లుక్ తెచ్చారు. నచ్చావులే లాగే నువ్విలా షూటింగ్ కూడా మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తయింది. శేఖర్ చంద్ర సంగీతం ఓకే. ఐతే పాటలు నచ్చావులే స్థాయిలో లేవు. టైటిల్ సాంగ్ కు మాత్రం మంచి మార్కులు పడతాయి. ఈ పాట సాహిత్యం కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు తగ్గట్లు సాగింది. సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లస్ పాయింటే.
‘చిత్రం’ సినిమాతో ‘కుటుంబ సమేతంగా చూసే చిత్రాల’ దారి నుంచి పక్కకు వచ్చిన ఉషాకిరణ్ మూవీస్ దృష్టంతా ఇప్పుడు యూత్ మీదే. ఈ సినిమా కూడా ముఖ్యంగా యూత్ నే టార్గెట్ చేసింది.  నచ్చావులే పెద్దల్ని కూడా ఆకట్టుకుంది కానీ.. నువ్విలా మాత్రం అలా లేదు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అవకాశాల్లేవు. ముఖ్యంగా ‘గే’ పాత్రకు, ఆ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం యువతకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక కుటుంబ ప్రేక్షకుల సంగతేం కాను.  ప్రధాన పాత్రల్లో చేసిన ఆరుగురూ మంచి నటన కనబరిచారు. వారెవరన్న పట్టింపు అక్కర్లేదు. క్యారెక్టర్లే కనిపిస్తాయి తెరమీద. అందర్లోకి ప్రసాద్ ఎక్కడు ఆకట్టుకున్నాడు. ‘డైరీ మిల్క్’ యాడ్ తో (రెండు రూపాయలకు రెండు లడ్డూలు) పాపులరైన ఈ కుర్రాడు చక్కగా నటించాడు. అతని నత్తి కామెడీ ఆకట్టుకుంటుంది.
Read More >>

షార్లెట్‌లో దసరా, దీపావళి వేడుకలు

దసరా, దీపావళి వేడుకలను అమెరికాలోని షార్లెట్‌లో తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్(టీఏజీసీఏ) ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న జరిగిన ఈ సంబరాల్లో సుమారు 800 కి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 130 మంది బాల, యువ కళాకారులు పలు ప్రదర్శనలలో పాల్గొన్నారు.  TAGCA  సహాయ అద్యక్షులు శ్రీమతి పెళ్లూరు మణి గారు, కార్యవర్గం సభ్యులు శ్రీమతి సునీత అనుగు గారు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సుమారుగా నలభై  మంది చిన్నారులు పాడిన భక్తిగీతంతోమొదలయ్యింది.
టీఏజీసీఏ అధ్యక్షులు పురుషోత్తమ చౌదరి గారు మాట్లాడుతూ తగ్కా ను ముందుకు తీసికెళ్ళడంలో కార్యవర్గ సభ్య్లులు, స్వచ్ఛ౦ద సేవకులు కీలక పాత్ర వహించారన్నారు.  తగ్కా ఈ సంవత్సరము సంక్రాంతి, బ్లడ్ డ్రైవ్, ఉగాది వేడుకలు, వనభోజనాలు, సంగీత విభావరి, మరియు దసరా సంబరాలు ఇలా ఆరు వైవిధ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించిందన్నారు. ఐదు సంవత్సరముల క్రితం పద్దెనిమిది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ఈ నాడు ఐదు వందల మంది సభ్యులున్నారని ఆయన హర్షం వ్యక్తం చేసారు.
జనరల్ సెక్రటరీ శశి కాంత్ సుంకర గారు వందన సమర్పణ చేశారు. కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు,కొరియోగ్రాఫర్ లకు, పేరు పేరునా ధన్యవాదములు తెలియచేశారు. వారు పిల్లలను తెలుగు నేర్చుకోవలసినదిగా ప్రోత్సహించారు.
అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించించాయి.అను పన్నెం రూపకల్పన చేసిన “శివ భక్తులు” ప్రేక్షకుల విశేషాదరణ పో౦దింది.స్వీయ నృత్య దర్సకత్వంలో చిన్నారులు రూపకల్పన చేసిన “ఎ న్ ర్ స్వర్ణ మాల’ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.రాణి పర్వతనేని నృత్య దర్శకత్వం వహించిన “డాన్సు మెడ్లీ” ప్రేక్షకాదరణ పొందింది.శ్రీమతి పల్లవి మదబూషి గారు రూపకల్పన చేసిన అయిగిరినందిని పలువురి ప్రశంస లందుకుంది.జ్యోతిర్మయి కొత్త గారు రచించిన  “అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం” నాటిక సందేశాత్మకంగా ఉంది.
టీఏజీసీఏ సభ్యులు సుంకర శశికాంత్, మణి పెళ్లూరు, సురేష్ చలసాని, జ్యోతిర్మయి కొత్త, రమణ అన్నె, మహేందర్ మాధవరం, సంజీవరెడ్డి పప్పిరెడ్డి, సచీంద్ర ఆవులపాటి, సునీత అనుగు, శ్రీనివాస్ అమర, నాగభూషణం నల్ల, శ్రీధర్ మంజిగాని  తదితరులు వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు.
Read More >>

సీన్ రివర్స్ !

గులాబీ జట్టులోకి మరో ఐదుగురు?  
నవంబరు 5 ముహూర్తం !
గులాబి జట్టులోకి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వెళ్లనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే టిఆర్ఎస్‌లోకి చేరనున్నారు. రెండు రోజుల్లో వీరు టిఆర్ఎస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు సమాచారం.
మామ ప్లాన్ వేస్తే, అల్లుడు అమలు చేస్తారు… మామ స్కెచ్ గీస్తే అల్లుడు  రూపం ఇస్తాడు…వాళ్లే కేసీఆర్, హరీహ్‌రావు. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట వైఎస్ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరుకున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గతంలో వైఎస్ మంత్రమే…. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి రెండో సారి  అధికారంలోకి  వచ్చిన తరువాత ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించారు.. అటు టిడిపి, ఇటు టిఆర్‌యస్‌లకు చెందిన చాలా మంది నాయకులు వైయస్ పంచన చేరారు. ఒక దశలో టిఆర్‌యస్‌కు చెందిన ముఖ్య నేత వైయస్‌తో మంతనాలు జరపడం అప్పట్లో కలకలం సృష్టించింది . అంతకు ముందే 2006లో టిఆర్‌యస్‌ను చీల్చడానికి వైయస్‌ వేసిన ఎత్తులు కొంత వరకు సఫలం అయ్యాయి.  అప్పుడు టిఆర్‌యస్‌కు ఉన్న 26 మంది ఎంఎల్ఏలలోపదిమంది బైటకి వచ్చి కేసిఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసారు. 2009లో రెండో సారి సాదారణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ టిఆర్‌యస్, టిడిపి నాయకులను పార్టీలోకి లాగడానికి ఆకర్ష్‌ ను అమలు చేసారు. వైయస్ ఆకర్ష్‌లో స్కెచ్ రాజశేఖరరెడ్డి గీస్తే, కెవిపి అమలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ రీవర్స్ అయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయంగా పట్టు సాధించిన టిఆర్‌యస్  అప్పటి వైయస్ సూత్రాన్ని అమలు చేస్తోంది. అప్పుడు వైయస్ ఆర్ కేవిపి పోషించిన పాత్రలను ఇప్పుడు టిఆర్‌యస్ అధినేత కెసిఆర్, ఆ‍యన మేనల్లుడు హరీష్ రావులు పోషిస్తున్నారు.అప్పట్లో ఆకర్ష్ కి  టిఆర్‌యస్ మనుగడ ప్రశ్నార్థకం అయితే ఇప్పుడు ఆపరేషన్‌ గులాబీకి  తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని సవాల్ చేసే విధంగా  తయారయ్యింది.
కేసీఆర్ కసరత్తు….
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కేసీఆర్ పెద్ద కసరత్తే చేస్తున్నారు.  తెలంగాణ వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉందీ… ఏఏ ఎమ్మెల్యేలు సెంటిమెంట్‌ను తప్పించుకోలేకపోతున్నారు… పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారో అనే విషయాలు ఎప్పటికప్పుడు కెసిఆర్ ఆరా తీస్తున్నారు. వారిని పార్టీలోకి తీసుకవచ్చే బాధ్యతను హరీష్ రావు నిర్వహిస్తున్నాడన్నది బహిరంగంగా కనిపిస్తున్న దృశ్యం. ఈ మధ్యే టిడిపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ యంపి జితేందర్ రెడ్డిలు హరీష్‌రావుతో ప్రాథమిక చర్చలు జరిపిన తరువాతే, కెసిఆర్‌తో కలసి చర్చించి నిర్ణయం ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టిడిపి నేత గంప గోవర్థన్‌ను స్థానిక నేత పోచారంతో కలసి ఒప్పించింది కూడా హరీష్ రావే. 
టిడిపి నుంచి బయటకు వచ్చి స్వతంత్ర్యంగా ఉన్న జోగురామయ్యను సైతం టిఆర్‌యస్‌లోకి లాగింది హరీష్‌ రావే… నాగం జనార్థనరెడ్డితో కలసి పార్టీని వీడిన రామన్న, నాగంతో కలసి ఇమడలేకపోతున్నాడనే విషయం గ్రహించిన హరీష్ రావు, తమ పార్టీ యల్పీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌తో కలసి రామన్నను టిఆర్‌యస్‌ చేర్చడానికి కృషి చేశారు. తాజగా జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలను గులాబీ వనంలోకి లాక్కురావడానికి హరీష్ రావు ఐదు నెలల పాటూ శ్రమించినట్టు సమాచారం. చివరి రోజుకు కూడా తెల్లవారుఝాము నుంచీ ఆ ముగ్గురూ పార్టీకి, పదవికీ రాజీనామా చేసి, కెసిఆర్ ఇంటికి వచ్చే వరకూ హరీష్ రావు వారిని వారి వెంటే ఉన్నారు. అయితే ఈ మామా అళ్లుళ్ల ఆపరేషన్ గులాబీ ఇంకా ఉందని కెసిఆర్ ప్రకటనలోనే తెలుస్తోంది. తెలంగాణలో మరో పార్టీ జెండాను  లేకుండా చేస్తామని గులాబీ బాస్ ధీమాగా  చెబుతున్న మాటలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
ఇంకెందరు?
నవంబర్ 5 తరువాత టిడిపి, కాంగ్రెస్‌లకు సంబంధించిన ఐదుగురు ప్రజాప్రతినిధుల మెడలో గులాబీ కండువా వేయడానికి రంగం సిద్ధం చేశారు ఈ మామా అళ్లళ్లు… వీరిలో ఇద్దరు కాంగ్రెస్ యంపీలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హరీష్ రావు ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. హరీష్ రావు ప్రతీ ఒక్కరినీ వ్యక్తిగతంగా కలసి, మాట్లాడుతూ, అవసరమైతే హరీష్‌ రావే స్వయంగా ఫోన్‌లైన్ కలిపి కెసిఆర్‌తో మాట్లాడిస్తూ ఆయా నేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఆకర్ష్ పథకానికి బాధిత పార్టీగా ఉండి విలవిల్లాడిన టిఆర్‌యస్ ఇప్పుడు కాంగ్రెస్‌పై రివెంజ్ తీర్చుకుంటున్నట్టు కనబడుతోంది… అంతే కాదు పనిలో పనిగా టిడిపి అధినేతకు కూడా చెమటలు పట్టిస్తోంది.
Read More >>

ఎమ్మార్ తొలి బలిపశువు కోనేరు ప్రసాద్

ఎమ్మార్‌ అవకతవకల కేసులో కోనేరు ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. రేపు ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. విలాసవంతమైన విల్లాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆదారాలు స్పష్టంగా దొరకడంతో సీబీఐ కీలక చర్యలకు ఉపక్రమించింది.
హైకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 17న ఎమ్మార్‌ వ్యవహారంపై సీబీఐ కేసునమోదుచేసింది. తప్పుడు లెక్కలతో ఏపీఐఐసీని మోసం చేసిన స్త్టెలిష్‌హోం రికార్డుల్లో గజం రూ.5వేలు ధర నమోదుచేసి గజం రూ.25 వేల నుంచి రూ.50వేలకు విక్రయించింది. ఈ వ్యవహారంలో స్త్టెలిష్‌హోం ప్రతినిధులు రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మార్‌ కుంభకోణంలో కోనేరు ప్రసాద్‌, రంగారావులు కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది.
ఆధారాలున్నాయి
ఎమ్మార్‌ కేసులో కోనేరు ప్రసాద్‌ అవకతవకలకు పాల్పడినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకే కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సెక్షన్‌ 160 కింద ఓఎంసీ కేసులో జగన్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
కేవలం పరిచయం అంతే…
స్టైలిష్ హోంకు చెందిన   కోనేరు ప్రసాద్ ఓ వ్యాపారవేత్తగా మాత్రమే  టీడీపీ అధినేత చంద్రబాబుకు  పరిచయం తప్ప  అంతకు మించి ఏ సంబంధం లేదని ఆ పార్టీ   ఎమ్మెల్యే   పయ్యావుల కేశవ్పేర్కొన్నారు. కోనేరు ప్రసాద్ కు లబ్ధి చేకూరేలా చంద్రబాబు ఎలాంటి  అనుమతులు ఇవ్వలేదని, తమ హయాంలో  ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఇచ్చిన అనుమతులన్నీ పాదదర్శకంగా జరిగాయని ఆయన తెలిపారు.  ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ తో ఒప్పందం చేసుకున్న స్టైలిష్ హోమ్స్ సంస్థను ఏర్పాటు చేయించింది రాజశేఖరరెడ్డేనని కేశవ్ అన్నారు.
ఇదిలా ఉండగా కోనేరు ప్రసాద్ ఇంతకీ ఎవరికి సన్నిహితం అంటే చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉంటే, ఆ తర్వాత రాజశేఖరరెడ్డితో కూడా సత్సంబంధాలు కొనసాగించారన్నది సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.

this is the profile of koneru prasad available on indiamart

Koneru prasad
Prasad Koneru is the Founder-Chairman and Chief Mentor of The Trimex Group, that has global business operations across three business lines – mining, processing and trading and is currently is guiding the group into new verticals & businesses. With wide ranging experience across several industry sectors spanning industrial raw minerals, real estate development, trading, shipping and logistics, Prasad spearheads a group of companies engaged in laterally integrated activities. Prasad Koneru is currently the Managing Director of Rakindo Developers pvt Ltd . (50 – 50 JV between Trimex Group and Rakeen pvt Ltd; UAE (PJSC)) Company promoted by Government of Ras Al Khaimah.
He sincerely believes that all those who work in his Group companies across the globe form his large family. Koneru is a deeply religious man, with a kind heart that reaches the poor and needy aptly seen by his various philanthropic activities through the Koneru Prasad Foundation free clinics and schools in Andhra Pradesh

Vision
Koneru’s global business vision and deep sense of understanding of major opportunities in various verticals, has driven the Group to foray in to Real Estate & Infrastructure. His vision of a Green healthy living has seen the birth of a revolutionary entity in RAKINDO – a real estate JV with the Government of Ras Al Khaimah, which would primarily focus on the construction and development of large self-contained , Integrated Townships with world-class standards and amenities in various parts of India. The turnover is expected to cross USD Five billion in the next 5 years.

Prasad Koneru
Founder-Chairman and Chief Mentor
Madhu Koneru
Executive Vice Chairman
Pradeep Koneru
Executive Director
Read More >>

మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్

సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ మాట తప్పలేదు. పదవీ విరమణకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.9 లక్షలనూ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం చెల్లించారు. నిరసన వ్యక్తం చేసేందుకే తాను ఆ డబ్బును చెల్లిస్తున్నానని, ఇందులో తన తప్పు ఉన్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు.
రూ.9, 27, 787 విలువతో కూడిన చెక్‌ను ఓ లేఖకు జతచేసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పంపారు. వడ్డీలేకుండా తనకు రుణమిచ్చిన మెగసేసే అవార్డు గ్రహీత హరీష్‌ హండే మరో అయిదుగురిని ఎటువంటి వేధింపులకూ గురిచేయవద్దని ఆయన ప్రధానిని కోరారు. అన్నా బృందంపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించేందుకే కేజ్రీవాల్‌ ఈ చెల్లింపులు చేసినట్లు అర్థమవుతోంది.
”మీకు రూ.9.27 లక్షలకు చెక్కు పంపుతున్నాను. దీనర్థం నా తప్పును అంగీకరించినట్లు కాదు. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. అందువల్ల తప్పు జరిగినట్లుగా అంగీకరించడం లేదు” అని కేజ్రీవాల్‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన అప్పు చెల్లించేందుకు చాలా మంది ముందుకు వచ్చినా… వారి నుంచి డబ్బు తీసుకోలేదని, అలా చేసినట్లయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఉపయోగించుకున్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Read More >>

‘ఈనాడు’కు శంకర్రావు జై

విచిత్రమైన ఆరోపణలు, సరికొత్త వ్యాఖ్యానాలతో నిత్యం వార్తల్లో ఉండే శంకర్రావు గురువారం మళ్లీ మీడియాను ఆకట్టుకున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవటంలో ఈనాడు సంస్థను ఆదర్శంగా తీసుకుని ఇతర సంస్థలు ముందుకు రావాలని ఆయన అందరికీ సూచించారు.
కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2009 సంవత్సరంలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగటంతో ముంపునకు గురైన బాధితులను ఈనాడు సంస్థ ఆదుకొన్న తీరు అభినందనీయమన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలో వరదనీటిలో మగ్గాలు కొట్టుకుపోయి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ఈనాడు సంస్థ మరమగ్గాలను అందజేసి వారి జీవనోపాధిని పునరుద్ధరించిందన్నారు.
Read More >>

సిగ్గు లేని ప్రభుత్వం

ఇది భారతదేశం కాదు. ధరల భారతం. దేశంలో అతి వేగంగా పెరుగుతున్నది జనాభా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. దానికంటే వేగంగా పెరుగుతున్నవి సామాన్యుడు వాడే వస్తువులు. సగటున ఇండియాలో ప్రతి వారం ఏదో ఒక వస్తువు ధర పెరుగుతూ పోతోంది. గత మూడేళ్లలో ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వాలను ఎవరు మాత్రం ఏం చేయగలరు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ద్రవ్యోల్బణం 12.21 శాతానికి చేరుకుంది. అక్టోబరు 22 నాటికి ద్రవ్యోల్బణం 12.21 శాతమని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. పప్పులు, పండ్లు, పాలు… తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అంతకు ముందు వారంలో ద్రవ్యోల్బణం 11.43 శాతంగా ఉండటం గమనార్హం. ఆహారధరలు పెరగడంపై ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ మొసలి కన్నీరు కార్చారు. పైగా పండగల సీజన్‌కావడంతో ధరలు పెరిగినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
మరోసారి పెట్రోలు వాత !
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి ‘పెట్రో’ బాంబు పేల్చాయి. పెట్రోలు ధర లీటర్‌కు రూ.1.82 మేర పెరిగింది. ఈ పెంచిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం కావడంతో డాలరు విలువ పెరిగి చమురు ధరలకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందట. అందుకని చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచాయట. ఎవరిని నమ్మించడానికి ఈ కల్లిబొల్లి మాటలు?
Read More >>

మంత్రుల జీతాలు పెరగనున్నాయ్

త్వరలో రాష్ట్రమంత్రుల వేతనాలను పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రల మంత్రుల వేతనాలను పరిశీలించి ఆ తరువాత ఒక అభిప్రాయానికి వస్తామని ఆయన తెలిపారు.  ఆ తర్వాత అధికారులతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆరునెలల క్రితమే రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను పెంచిన విషయం తెలిసిందే కదా.
Read More >>

బ్రహ్మి వైఎస్ జగన్ అయితే!

బ్రహ్మి వెండితెరపై నవ్వుల కులదైవం. ఆయన తెరపై కనిపిస్తే పండుగ. హీరో లేకుండా, హీరోయిన్ లేకుండా సినిమా ఆడుతుందేమో కానీ బ్రహ్మి లేకుండా సినిమా ఆడని పరిస్థితి ఇప్పుడు తెలుగు సినిమాది. అసమానమైన ఆయన నటనకు, హావభావాలకు మురిసిపోని వారు, నవ్వుకోని వారు చాలా చాలా అరుదు. ఏ సినిమా హిట్టో, ఏ సినిమా ఫట్టో తెలియని విచిత్ర పరిస్థితికి చేరిన తెలుగు సినీ ప్రేక్షకులు బ్రహ్మిని ఉంటే కనీస ధైర్యంతో సినిమాకు వెళ్లగలుగుతున్నారు.
కానీ, ఇప్పుడు వెండితెర అవసరం లేకుండానే ఆయన అందరినీ నవ్విస్తున్నారు. ఫేస్ బుక్ మార్క్ జుకెర్ బర్గ్ దే కావచ్చు. అందులో రాజ్యమేలుతుంది మాత్రం మన బ్రహ్మి. ఆయన పేరిట అక్కౌంట్లు వెలిశాయి. కాంటెంపరరీగా విడుదలయ్యే అన్ని సినిమాల పోస్టర్లను మార్ఫింగ్ చేసి ఆయన మొహంతో నింపేశారు. దీంతో నెటిజన్లకు పొట్ట చెక్కలవుతోంది. అయితే, మార్ఫింగ్ సినిమా దాటిపోయింది. ఇప్పుడు రాజకీయాలకు పాకింది. వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి లా బ్రహ్మిని చూసుకుని పండగ చేసుకోండి మరి.
Read More >>

నాది 3 బెడ్రూమే, జగన్ ది 60 బెడ్ రూమ్

గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పడుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం నుంచి రైతు పోరు బాట మొదలుపెట్టిన బాబు గురువారం కడపలో పర్యటించారు. శుక్రవారం ఆయన పర్యటన కర్నూలు జిల్లాలో జరగనుంది. కడప పాదయాత్రలో ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తనది త్రిబుల్ బెడ్ రూమ్ అయితే,  జగన్ మోహన్ రెడ్డికి 60 గదుల బెడ్రూమ్ ఉందన్నారు. అలాంటిదే బెంగుళూరులోనూ ఉందన్నారు. ఎంతసేపు ఆరోపణలు చేసిన వారిపై ఎదురుదాడి చేయడమే తప్ప తన నిజాయితీ ఎప్పుడూ నిరూపించుకోలేదని, అసలు నిరూపించుకోవడానికి ఆయన వద్ద నిజాయితే లేదన్నారు.   అవినీతి మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టి జగన్ జల్సా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 30 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నవారిని ఎక్కడైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు.
ఇంకో ఆయన జగన్ కు స్నేహితుడు, వ్యాపార భాగస్వామి. ఆయన చదివింది ఏడో తరగతే కానీ ఆస్తులు మాత్రం విదేశీ పారిశ్రామిక వేత్తలతో కూడా పోటీపడేంత ఉన్నాయన్నారు. మిడిసి పడిన గాలికి పట్టిన గతే  వైఎస్ జగన్‌కు కూడా త్వరలో  పడుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినవారిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, దోషులను ప్రజల ముందు నిలబెట్టేవరకూ విశ్రమించదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతోందనీ, రైతుల గోడును పట్టించుకునే పరిస్థితే లేదన్నారు.
Read More >>

మన మానవుల అభివృద్ధి స్థానం 134

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం  రూపొందించిన మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో భారత్‌ స్థాయి దిగజారిపోయింది.  బుధవారం విడుదలైన  ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక-2011లో ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలలో ఇండియా 134వ స్థానంలో నిలిచింది. దేశంలో మనిషి సగటు జీవనకాలం గత 20 ఏళ్లలో గణనీయం గా పెరిగి 65.4 ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఇంత తక్కువ ర్యాంకు రావడమే విచిత్రం. ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం, జ్ఞానసముపార్జనకున్న అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అనే ప్రాథమిక అంశాలు హెచ్‌డీఐకి కొలమానం. కాగా 2011లో భారత్ హెచ్‌డీఐ విలువను 0.547గా నివేదిక పేర్కొంది. దీంతో భారత్ మానవాభివృద్ధిలో ‘మీడియం కేటగిరీ’ దేశాల జాబితాలో చేరింది. పొరుగు దేశాలైన పాక్, బంగ్లాదేశ్‌లు 145(0.504), 146 (0.500) స్థానాలతో ‘లో’ కేటగిరీలో నిలిచాయి. గత నివేదికలో భారత్ 169 దేశాలకుగాను 119వ స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా లింగ వివక్ష సూచిలో భారత్ 129వ స్థానంలో నిలిచింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లెక్కకు మిక్కిలిగా భూములు కొనుగోలు చేస్తున్న అగ్ర దేశాల జాబితాలో మన దేశం కూడా చేరింది. ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్.. నివేదిక పూర్తిగా తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచాభివృద్ధిలో అస్థిరతకు ప్రధాన కారణం అమెరికాయేనన్నారు.
Read More >>

అసాంజే కేసు మేనేజ్ చేశారు

 
ulian Assange at London Hi-court 
అసాంజే కేసును అనుకున్నట్టుగానే అమెరికా మేనేజ్ చేయగలిగింది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు లండన్ హైకోర్టులో బెయిలు దక్కలేదు. గతంలో ఈ వెబ్‌సైట్ కోసం కార్యకర్తలుగా పనిచేసిన ఇద్దరు మహిళల ఫి ర్యాదు మేరకు స్వీడన్‌లో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రిటన్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. విచారణ నిమి త్తం తమకు అప్పగించాలని స్వీడన్ పోలీసులు కో రారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసాంజ్ గతంలో పిటీషను వేశారు. దాన్ని విచారించిన కోర్టు అసాంజేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా జడ్జిలు జాన్ థామస్, డంకన్ ఔస్లీ కింది కోర్టు ఆదేశాలనే ఖరారు చేశారు. దీనిపై మళ్లీ మరో పైకోర్టును ఆశ్రయిస్తామని అసాంజ్ న్యాయవాది జోన్ హర్టిగ్ తెలిపారు.
Read More >>

పొన్నాలకు అమెరికా అవార్డు

మన ఐటీ మంత్రికి అమెరికా పురస్కారం లభించింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిష్టాత్మక ఓక్లహామా స్టేట్ యూనివర్శిటీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం లభించింది. లక్ష్మయ్య ఆ యూనివర్శిటీ  స్టూడెంటే. ఆ యూనివర్శిటీ సత్కరించిన జాబితాలో ఈయన తొంభైవారు కావడం విశేషం. లక్ష్మయ్య ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. అనంతరం స్వదేశానికి వచ్చి పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారు.

అధికార పదవులు

  • ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి
  • 2009 – కొంతకాలం క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ మరియు మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2004-2009 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ మరియు మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2002 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పద్దుల సంఘ సభ్యుడు మరియు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సంఘ సభ్యుడు
  • 1999 – జనగాం నియోజకవర్గం నుండి శాసనసభకి ఎన్నిక
  • 1991 మరియు 1992 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యుడు
Read More >>

హంటా వైరస్ కలకలం


Read More >>

ప్రభుత్వ మెజార్టీపై హైకోర్టులో వాదనలు

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి వేసిన పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు ప్రారంభం అయ్యాయి. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయిన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిని నిర్వహించే చట్టబద్ద అధికారం లేదని పేర్కొంటూ వేణుగోపాలాచారి నిన్న కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కిరణ్‌కుమార్‌డ్డి కొనసాగేందుకు శాసనసభలో మెజార్టీ లేనందున, కోర్టు జోక్యం చేసుకొని ఆయనను సీఎం పదవి నుండి తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అధికార పార్టీ మెజార్టీపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు వ్యక్తిగత ప్రయోజనాలతో నోరు మెదపటం లేదని వేణుగోపాలాచారి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read More >>

వాళ్లది తొందరపాటు : డీఎస్

అతి త్వరలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం తొందరపాటు చర్యేనని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని, అధిష్టానం రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దాలని సీరియస్ గా ఆలోచిస్తోందని త్వరలోనే అనిశ్చితి తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డీఎస్ బుధవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. త్యాగం అంటే రాజీనామా చేసి మళ్లీ గెలవటమా అని డీఎస్ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల తన  చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.
Read More >>

నటుడికంటే సినిమా గొప్పది

ఆర్టిస్టుల కంటే సినిమా గొప్పదని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రచారంలో తాను సృజనాత్మకంగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నువ్విలా సినిమా యువతను తప్పక ఆకట్టుకుంటందన్నారు. సందేశాలు ఏవీ లేకుండానే రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునే విధంగా చిత్రం ఉంటుందన్నారు.
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా నువ్విలా చిత్రం రూపొందుతోంది. దీనికి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
Read More >>

తెలంగాణ కోసం మరో దీక్ష

తెలంగాణకోసం నిజమాబాద్‌కు చెందిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ దగ్గర దీక్ష ప్రారంభమైయింది. ఈ దీక్షకు పలువురు కాంగ్రేస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ,ఉద్యోగ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని సంఘీబావం తెలిపారు.
మరోవైపు మాజీ మంత్రి కోమట్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రెండో రోజూ అనూహ్య స్పందన వస్తోంది. జిల్లా నలుమూలలనుంచి దీక్షా శిబిరానికి జనం భారీ సంఖ్యలో తరలి వచ్చి కోమట్డ్డిరెడ్డి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.  తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ది చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Read More >>

గన్‌మెన్‌లను తీసుకోండి : ఇంటలిజెన్స్

గన్‌మెన్‌ల ఉపసంహరణ అంశాన్ని పునరాలోచించుకోవలిసిందిగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రమవుతున్న తరుణంలో గన్‌మెన్‌లను వెంట ఉంచుకోవల్సిందిగా అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు విడివిడిగా లేఖలు రాసింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు నిఘా వర్గాలు లేఖ రాశాయి. గన్‌మెన్‌లు లేకుండా తిరగొద్దని ఆయనకు సూచించారు. వెనక్కి పంపించిన గన్‌మెన్‌లను తిరిగి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేటీఆర్‌ను కోరాయి.
సకల జనుల సమ్మె సమయంలో అక్రమ అరెస్టులు, పోలీసు అధికారుల సంఘం నేత చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరంతా గన్ మెన్ లను వద్దని తిప్పిపంపారు. వారి భద్రత నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం తిరిగి తీసుకోమని కోరుతున్నారు.
Read More >>

18 వ రాష్ట్రానికి అభ్యంతరం ఎందుకు : కేకే

1956 తర్వాత 17 రాష్ట్రాలు ఇచ్చారని, అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని, 18వ రాష్ట్రం అయిన తెలంగాణ విషయంలో జాప్యం  ఎందుకు జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ కేకే ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే వరకూ తాను ఏపదవిలో ఉండనని కేకే అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ ఎంపీ కేకే సంఘీభావం తెలిపారు.
Read More >>

బాబు వేశాలు జనం నమ్మరు : బొత్స

అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేయటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రజలు విశ్వసించరని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబునాయుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేపట్టారని,  వైఎస్ రాజశేఖరరెడ్డిలా పాదయాత్ర చేసి బాబు అధికారంలోకి రావాలనుకోవటం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని బొత్స ఎద్దేవా చేశారు.
రైతుల ఆత్మహత్యలకు తానే బాధ్యుడినని చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాకే పాదయాత్ర చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో భూకేటాయింపుల విషయంలో మంత్రివర్గం మొత్తం బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. అయితే తెర వెనక జరిగిన భూ కేటాయింపుల అక్రమాలతో మంత్రులకు సంబంధం లేదని అన్నారు.
Read More >>

గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్‌

గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్‌లా పనిచేస్తున్నారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ తగ్గలేదు, బల నిరూపణ అవసరం లేదు అని ఢిల్లీలో గవర్నర్ మాట్లాడి, ఆ పదవి విలువను దిగజార్చారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కృషిచేస్తున్నట్లుగా నరసింహన్ మాటలున్నాయని ఆరోపించారు. గవర్నర్, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ప్రభుత్వ పక్షంగా పనిచేస్నున్నట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Read More >>

Thursday, November 3, 2011

ఉద్యోగులకు జీతాలివ్వకుండా మోసం చేసిన సిఈవో

Hyderabadహైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా నష్ట పోయేది మాత్రం సమాన్య మద్య తరగతి కుటుంబ ఉద్యోగులు మాత్రమే. హైదరాబాద్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన ఓ యానిమేషన్ కంపెనీ భాగోతం ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే బంజారా హిల్స్‌లో ఉన్న ఓ యానిమేషన్ కంపెనీ నిర్వాహాకులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంతో వారు కంపెనీ యాజమాన్యంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

బంజారా హిల్స్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బంజారా హిల్స్ రొడ్ నెంబర్ 8లో ఉన్న 'మాస్ హైట్స్ బిల్డింగ్స్'లో గల ఫ్రాక్షన్స్ అండ్ ఫ్రేమ్స్ యానిమేషన్ కంపెనీలో గల ఆరుగురు ఉద్యోగులు మేనేజ్‌మెంట్ జీతాలు ఇవ్వడం లేదంటూ కేసు నమోదు చేశారని తెలిపారు. మూడు నెలల క్రితం ఎవి వెంకట రమణ అనే వ్యక్తి మూడు నెలల క్రితం యానిమేషన్ కంపెనీని నెలకొల్పడం జరిగిందని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు.

సిఈవోగా కొనసాగుతున్న వెంకట రమణ కంపెనీ స్దాపించిన మొదట్లో 70 మంది ఉద్యోగులను నియామకం చేసుకొని మంచి జీతాలను ఇస్తానని నమ్మపలికాడని అన్నారు. గత రెండు నెలలుగా మాకు జీతాలు ఇవ్వకపోగా, సీఈవోగా చెలామణి అవుతున్న వెంకట రమణ కూడా గత కొంతకాలంగా ఆఫీసుకి రావడం లేదని ఉద్యోగులు పోలీసులకి తమ గొడుని వెల్లబొసుకున్నారు.

దాంతో బంజారా హిల్స్ పోలుసులు వెంకట రమణపై కేసు నమోదు చేసి విచారణను కొనసాగించనున్నారు. ఇదే కంప్లైంట్‌లో ఉద్యోగులు వెల్లిడించిన సమాచారం ప్రకారం ఇటీవలే వెంకట రమణ హై టెక్ సిటీలో కొత్తగా మోర యానిమేషన్ స్టూడియోని ప్రారంభించినట్లు కూడా తెలిపారు. దాంతో పాత యానిమేషన్ కంపెనీలో ఉన్న పలువురు ప్రముఖులను కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు.
Read More >>

ఫిక్సింగ్ చేయకుంటే చంపేస్తాం, బెదిరింపులు: మోడి

Lalit Modi'లలిత్ మోడి' ఇండియన్ క్రికెట్ చరిత్రలో 'ఐపిఎల్'కి సువర్ణ అద్యయనం పలికిన వ్యక్తి. అదే ఐపిఎల్ ద్వారా ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి. ప్రస్తుతం క్రికెట్లో ఎక్కువ మంది చర్చించుకుంటున్న భూతం ఫిక్సింగ్. అందుకు కారణం ఇటీవలే లండన్ కొర్టు పాకిస్దానీ ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు పాల్పడ్డారంటూ వారిపై తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో చాలా మంది ఫిక్సింగ్ ఆరోపణలు ఎప్పటి నుండి మొదలయ్యాయి అంటూ మరోసారి వాటి స్మృతులను నెమర వేసుకుంటుండగా, లలిత్ మోడి కూడా తన జ్ఞాపకాలను మీడియాతో నెమర వేసుకున్నారు.

ఈ సందర్బంలో మాజీ ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ను తిరస్కరించినందుకు అండర్‌వరల్డ్ మాఫియా తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడాలని మాఫియా నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను కాదన్నందుకు బుకీలు, మాఫియా వాళ్లు నన్ను చంపాలని చూశారని మోడి ఓ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. మొదటిసారి 2009లో తన ఇంట్లో ఉన్నప్పుడు, దక్షిణాఫ్రికాలో మరోసారి, థాయ్‌లాండ్‌లో మూడోసారి తనపై హత్యాయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ ఘటనలపై అప్పుడు సెంట్రల్‌ ఏజెన్సీస్‌కు తెలిపానన్నాడు.

‘పాకిస్థాన్ నుంచి కూడా నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత వారం కూడా అలాంటి ఫోన్ కాలే వచ్చింది. దీనిపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసుకు ఫిర్యాదు చేశాను’ అని మోడి చెప్పారు. తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ముంబై పోలీసులతో పాటు, సెంట్రల్ ఏజెన్సీలకూ తెలుసని, వాళ్లు తగిన భద్రత ఏర్పాట్లు చేశారని మోడి వివరించారు. మంగళవారం లండన్ కోర్టు పాకిస్థాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్ దోషులని తీర్పిచ్చిన మరుసటి రోజే మోడి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read More >>

'ఐ1 సూపర్ సిరీస్' రేసింగ్‌లో సచిన్ పెట్టుబడి సమాచారం..!

Sachin Tendulkarముంబై: నిన్న వన్ ఇండియా తెలుగు న్యూస్‌లో సచిన్ టెండూల్కర్ ఓనర్‌గా త్వరలో 'ఐ1 సూపర్ సిరిస్' అనే 'ఇండియన్ రేసింగ్ లీగ్' అనే ఆర్టికల్‌ని పాఠకులకు తెలియజేయడం జరిగింది. మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ చెందిన ఈ లీగ్‌లో క్రికెట్ దేవడు సచిన్ టెండూల్కర్, సంజన రెడ్డి ఇద్దరూ కలపి అందులో 26శాతం వాటాని కొనుగొలు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.

కానీ ఈ ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు స్వల్ప వాటా మాత్రమే ఉందని ప్రమోటర్స్ మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ బుధవారం అధికారకంగా వెల్లడించింది. అంతేకాదండోయ్ 'ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్‌' సచిన్ వాటాపై వార్తలను మొదట మచ్‌దర్ మెటార్‌స్పోర్ట్స్ సీఈఓ ఎం.దర్శన్ మొదట తోసిపుచ్చడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా దీనికి సంబంధించిన వివరాలను బయటక వెల్లడించారు.

భారత్‌లో మోటో రేసింగ్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో మచ్‌దర్ కంపెనీ ఐ1 సూపర్ సిరీస్‌కు గత ఆగస్టులో రూపకల్పన చేసింది. దీని ప్రకారం ఈ సిరీస్‌లో 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ నుంచి 2 కార్లు రేసులో పాల్గొంటాయి. డిసెంబర్ 18 నుంచి 25 ఫిబ్రవరి 2012 వరకు ఢిల్లీ, చెన్నైతో పాటు ఏడు ఆసియా నగరాల్లో ఈ రేసులు జరగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ విలువ 2 మిలియన్ డాలర్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్ స్పోర్ట్స్ సమాఖ్య డీ1, మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన అనుమతులను తీసుకునేందుకు మచ్‌దర్ గ్రూప్ ప్రయత్నిస్తోంది.

15 సంవత్సరాలకు గాను ఫ్రాంచైజీ ఖరీదు $20m. మొదట్లో పెట్టుబడి దారులు $5m చెల్లించాల్సి ఉండగా మిగిలిన డబ్బు ఓనర్ షిప్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. షారుఖ్ ఖాన్, జూహిచావ్లా, జై మెహాతా భాగస్వామ్యంతో ముంబై ఫ్రాంచైజీని దక్కించుకొగా, దాబుర్స్ మోహిత్ బర్మన్ ఢిల్లీ ప్రాంజైనీ దక్కించుకోగా, మలేషియా బిజినెస్ టైకూన్, యుకె ఫండ్ మేనేజర్ ఎస్ జి శ్రీనివాసన్ భాగస్వామ్యంతో చెన్నై ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. హైదరాబాద్ ప్రాంచైజీ విషయానికి వస్తే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఎన్ ప్రసాద్ ఇద్దరూ కలసి ఓకె చేశారు. ఛండీ ఘర్ ఫ్రాంచైజీని యువరాజ్ సింగ్, అతని స్నేహితుడుతో కలసి తీసుకున్నారు. కోల్‌కత్తా ప్రాంచైజీ మాత్రం సౌరభ్ గంగూలీ తీసుకొనున్నట్లు సమాచారం.
Read More >>

సచిన్ ఇండియన్ లీగ్ రేసులో బడా బాబులు

Sachin Tendulkarముంబై: గ్రేటర్ నోయిడాలో బుద్దా అంతర్జాతీయ స్డేడియంలో ఇటీవల ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ పెద్ద సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇండియాలో ఉన్న బిజినెస్ మెన్స్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దేవుడు లాంటి ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. దీని తర్వాత ఇండియాలో మరో రేసింగ్ లీగ్ జరుగుతుంది. ఐతే దీనికి ఓనర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కాగా ఇండియాలో జరగనున్న ఈ రేసింగ్ లీగ్ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ నుండి షారుఖ్, అక్కినేని నాగార్జునతో పాటు, దాబూర్ ప్యామిలీ చెందిన మోహిత్ బుర్మన్ లాంటి ప్రముఖులు పెట్టుబడి పెట్టారని సమాచారం.

ఇండియాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 'ఇండియన్ రేసింగ్ లీగ్' అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి మరో పేరు 'ఐ1 సూపర్ సిరిస్' కూడా పెట్టారు. ఈ ఐ1 సూపర్ సిరిస్ జనవరి నెలలో ట్రాక్స్ పైకి ఎక్కి ఫిబ్రవరి 26వ తేదీ నాటికి ముగియనుంది. ఇందులో మొత్తం ఎనిమిది సిటీలకు సంబంధించిన టీమ్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ముంబై, కొల్‌కత్తా, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ఛండీఘడ్, హైదరాబాద్, పూణె. 16 మంది ఓ గ్రిడ్‌గా ఏర్పడతారు.
  Read:  In English 
ఇండియన్ రేసింగ్ లీగ్ అనేది మొదట మచ్దార్ మోటార్ స్పోర్ట్స్ వారికి చెందినది కాగా, ఆ తర్వాత క్రికెట్ దేవడు సచిన్ టెండూల్కర్, సంజన రెడ్డి ఇద్దరూ కలపి అందులో 26శాతం వాటాని కొనుగొలు చేయడం జరిగింది. 15 సంవత్సరాలకు గాను ఫ్రాంచైజీ ఖరీదు $20m. మొదట్లో పెట్టుబడి దారులు $5m చెల్లించాల్సి ఉండగా మిగిలిన డబ్బు ఓనర్ షిప్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

షారుఖ్ ఖాన్, జూహిచావ్లా, జై మెహాతా భాగస్వామ్యంతో ముంబై ఫ్రాంచైజీని దక్కించుకొగా, దాబుర్స్ మోహిత్ బర్మన్ ఢిల్లీ ప్రాంజైనీ దక్కించుకోగా, మలేషియా బిజినెస్ టైకూన్, యుకె ఫండ్ మేనేజర్ ఎస్ జి శ్రీనివాసన్ భాగస్వామ్యంతో చెన్నై ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. హైదరాబాద్ ప్రాంచైజీ విషయానికి వస్తే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఎన్ ప్రసాద్ ఇద్దరూ కలసి ఓకె చేశారు. ఛండీ ఘర్ ఫ్రాంచైజీని యువరాజ్ సింగ్, అతని స్నేహితుడుతో కలసి తీసుకున్నారు. కోల్‌కత్తా ప్రాంచైజీ మాత్రం సౌరభ్ గంగూలీ తీసుకొనున్నట్లు సమాచారం. ఇక బెంగుళూరు, పూణెకి సంబంధించిన ప్రాంచైజీ ఓనర్ షిప్ సంబంధించిన విషయాలు ఇంకా బయటకు రాలేదు.
Read More >>

బెదిరింపులు, ఒత్తిడి వల్లే ఫిక్సింగ్ చేశా: మహ్మద్‌ అమీర్‌

Mohammad Amir
క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిక్సింగ్. అసలు ఫిక్సింగ్ అంటే ఏమిటి. ఫిక్సింగ్ అంటే డబ్బులు తీసుకొని అవతలి వైపు ఉన్న టీమ్‌ని గెలిపించడం లేదా మనం ఓడిపోవడం. అసలు ఆటగాళ్లు ఫిక్సింగ్ ఎందుకు చేస్తారని అంటే అందుకు చాలానే కారణాలున్నాయి. కొంత మంది డబ్బుకొసం అని మరికొంత మంది మాపై వచ్చిన ఒత్తిడి వల్ల అని కారణాలు చెబుతున్నారు.

ఐతే ఇటీవల తాజాగా పాకిస్థాన్‌ క్రికెటర్లు , టెస్టు మాజీ కెప్టన్‌ సల్మాన్‌భట్‌, పేసర్‌ ఆసిఫ్‌లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరానికి పాల్పడ్డారని ఇంగ్లాండ్‌లోని సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అమీర్‌‌ని మీరు ఫిక్సింగ్‌కి ఎందుకు పాల్పడ్డారని అంటే ఆయన చెప్పిన సమాధానం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, అతని అమాయకత్వానికి అద్దం పడుతుంది.

అందుకు కారణం మహ్మద్‌ అమీర్‌‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డానికి కారణం 'తీవ్ర ఒత్తిడి' ని చెప్పడమే. స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి విచారణ చేపట్టిన సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టు ముందు అమీర్‌ మంగళవారం తన వాదనను వినిపించాడు. ఈ వాదనలో తాను ఫాక్సింగ్‌ పాల్పడిన విషయం నిజమేనని, అయితే తీవ్ర ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఈ దురగాతానికి ఒడిగట్టానని చెప్పాడు. ఇలా ఫిక్సింగ్‌కి పాల్పడి తాను తప్పు చేశానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫిక్సింగ్‌కి అంగీకరించాల్సి వచ్చిందన్నాడు. ఇలా కోర్టులో అమీర్‌ వాదన కేసును కొత్త మలుపు తిప్పింది. అతను నేరం అంగీకరించినప్పటికీ ఒత్తిడి అనే అంశం వెలుగులోకి తేవడంతో అమీర్‌కు సంబంధించి కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇది ఇలా ఉంటే 2000వ సంవత్సరంలో భారత క్రికెటర్లు ఫిక్సింగ్‌ పాల్పడిన విషయం తెలిసిందే. విశేషమేమిటంటే ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన వారిలో భారత మాజీ కెప్టెన్లు ఇద్దరు ఉండటం. ఒకరు భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించి జాతికి క్రికెట్‌ రుచిని చూపించిన వారైతే, మరొకరి మణికట్టు షాట్లతో విదేశీయులను సైతం ఔరా అనిపించిన వ్యక్తి. భారత్‌లో ఫిక్సింగ్‌ తెలియడానికి కారణం మాత్రం భారత ఓపెనర్‌, ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ ఆర్టికల్‌తోనే. ఢిల్లీకి చెందిన ఓ పత్రికకు 1997లో మనోజ్‌ రాసిన ఓ ఆర్టికల్‌ అప్పట్లో సంచలనం రేపింది.

1994లో భారత, పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఆటకు విరుద్ధంగా ప్రదర్శనను ఇస్తే 20 లక్షల రూపాయలను భారత జట్టుకు చెందిన ఓ సహచరుడు తనకు ఇవ్వజూపాడని మనోజ్‌ వ్యాసంలో రాశాడు. అయితే ఆ సహచరుడు ఎవరో కాదు భారత మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌నని లేటుగా విషయాన్ని బహిర్గతం చేశాడు. ఐతే ఈ వార్త విన్న కపిల్‌ కళ్లనీళ్లపర్యంతమయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బుకీ ముఖేష్‌ గుప్తాకు అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేయటంలో కీలకపాత్ర పోషించింది మనోజేనని సిబిఐ దర్యాప్తులో తేలింది. ఇలా మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఇలా క్రికెట్లో మనకు తెలియకుండా ఫిక్సింగ్ ఎప్పటినుండో జరుగుతుందనేది వాస్తవం.
Read More >>

గన్‌మెన్‌లను తీసుకోండి : ఇంటలిజెన్స్

గన్‌మెన్‌ల ఉపసంహరణ అంశాన్ని పునరాలోచించుకోవలిసిందిగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రమవుతున్న తరుణంలో గన్‌మెన్‌లను వెంట ఉంచుకోవల్సిందిగా అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు విడివిడిగా లేఖలు రాసింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు నిఘా వర్గాలు లేఖ రాశాయి. గన్‌మెన్‌లు లేకుండా తిరగొద్దని ఆయనకు సూచించారు. వెనక్కి పంపించిన గన్‌మెన్‌లను తిరిగి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేటీఆర్‌ను కోరాయి.
సకల జనుల సమ్మె సమయంలో అక్రమ అరెస్టులు, పోలీసు అధికారుల సంఘం నేత చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరంతా గన్ మెన్ లను వద్దని తిప్పిపంపారు. వారి భద్రత నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం తిరిగి తీసుకోమని కోరుతున్నారు.
Read More >>

తెలంగాణ కోసం మరో దీక్ష

తెలంగాణకోసం నిజమాబాద్‌కు చెందిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ దగ్గర దీక్ష ప్రారంభమైయింది. ఈ దీక్షకు పలువురు కాంగ్రేస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ,ఉద్యోగ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని సంఘీబావం తెలిపారు.
మరోవైపు మాజీ మంత్రి కోమట్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రెండో రోజూ అనూహ్య స్పందన వస్తోంది. జిల్లా నలుమూలలనుంచి దీక్షా శిబిరానికి జనం భారీ సంఖ్యలో తరలి వచ్చి కోమట్డ్డిరెడ్డి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.  తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ది చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Read More >>

నటుడికంటే సినిమా గొప్పది Published on November 2, 2011 · No Comments


ఆర్టిస్టుల కంటే సినిమా గొప్పదని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రచారంలో తాను సృజనాత్మకంగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నువ్విలా సినిమా యువతను తప్పక ఆకట్టుకుంటందన్నారు. సందేశాలు ఏవీ లేకుండానే రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునే విధంగా చిత్రం ఉంటుందన్నారు.
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా నువ్విలా చిత్రం రూపొందుతోంది. దీనికి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
Read More >>