Saturday, November 5, 2011

బ్లాక్ మనీ వీఐపీలు వీరే

ఎమ్మార్ లో కేవలం ఇరవై శాతం ధర అధికారికంగా చూపించి  మిగతా ఎనభై శాతం బ్లాక్ మనీతో అక్కడ విల్లాలు కొన్న ప్రముఖులకు చమటలు పడుతున్నాయి. మామూలుగా అయితే వీరికి ఈ కేసుల నుంచి పైరవీలు చేసి బయటపడటం పెద్ద కష్టమేం కాదు. కానీ కేసు సీబీఐ చేతుల్లో ఉండటమే వారి భయానికి కారణం. ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసి తక్కువకే కొనుగోలు చేసినట్టు చూపించన నేపథ్యంలో కనిపించని డబ్బు చాలా మంది తమ బ్లాక్ మనీ నుంచే తెచ్చినట్లు సీబీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ అనుమానిస్తున్నాయి. విచారణలో అదే కనుక తేలితే సీబీఐ కేసులో ఇరుక్కోవడంతో పాటు ఇతర శాఖలకు మూడొందల శాతం పెనాల్టీ పడుతుంది. ఒకవేళ కట్టింది బ్లాక్ మనీ అయితే జైలు శిక్ష కూడా పడుతుంది. ఇవన్నీ విల్లాల వీఐపీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఎమ్మార్‌లో విల్లాలు కొన్నది వీళ్లే
ధర్మపురి శ్రీనివాస్ (పీసీసీ మాజీ అధ్యక్షుడు),
కోటగిరి సునీత (కేవీపీ రామచంద్రరావు సతీమణి),
జె.గీతారెడ్డి (రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి),
వైఎస్ విద్యారెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి బంధువు),
డాక్టర్ సోమరాజు (కేర్ ఆస్పత్రి అధినేత),
నారా బ్రహ్మణి (చంద్రబాబు కోడలు),
గల్లా పద్మావతి (మంత్రి గల్లా అరుణ కోడలు),
ఘట్టమనేని మంజుల (సినీ నటుడు కృష్ణ కుమార్తె),
ఘట్టమనేని మహేశ్ బాబు (సినీ హీరో),
నమ్రతా శిరోద్కర్ (మహేశ్ బాబు భార్య),
డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి (మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి సోదరుడు),
చలసాని స్వప్నాదత్ (సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె),
అంబటి మురళీకృష్ణ (అంబటి రాంబాబు సోదరుడు),
వాకిన చాముండేశ్వరీనాథ్ (మాజీ క్రికెటర్),
రేష్మీ సింగ్ (సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.పి.సింగ్ భార్య).
ఈ జాబితాలో ఎక్కువగా కాంగ్రెస్ అనుకూలురు ఉండటం వల్ల సీబీఐ విల్లాల కొనుగోలు అంశాన్ని దాటవేసి ఎమ్మార్ తప్పులనే  ఎత్తిచూపేలా సెంట్రల్ కాంగ్రెస్ పావులు కదిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే… మీడియా నుంచి బయటపడటానికి వీరందరికీ జరిమానాతో బయటపడే మార్గాలను వెదుకుతోంది.

No comments:

Post a Comment

Thank you for your comment