
ప్రస్తుతం 'తియాంజీ' చైనా సోషల్ నెట్‌వర్క్ బిజినెస్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు దొహాదపడుతుంది. 'తియాంజీ'లో ప్రస్తుతం 9 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ప్రఖ్యాత సోషల్ నెట్ వర్క్ 'లింక్డ్ ఇన్' త్వరలో జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ సందర్బంలో 'లింక్డ్ ఇన్' ప్రతినిధులు మాట్లాడుతూ ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో మార్కెట్స్ యొక్క అనుకూలతను బట్టి కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనున్నామని తెలిపారు.
ఆసియా దేశాలలో ఇప్పడిప్పుడే బిజినెస్ సోషల్ నెట్‌వర్క్స్ డెవలప్ అవుతుండడంతో, రానున్న రోజుల్లో ఆన్ లైన్ సోషల్ నెట్‌వర్క్స్‌కి మంచి అవకాశాలు ఉండనున్నాయని అన్నారు. జపాన్‌లో 'లింక్డ్ ఇన్'ని విడుదల చేసిన తర్వాత ఆసియాలో మరిన్ని దేశాలతో దీనిని కొనసాగిస్తామని 'లింక్డ్ ఇన్' ప్రతినిధులు తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment