క్రికెట్లో
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిక్సింగ్. అసలు ఫిక్సింగ్ అంటే
ఏమిటి. ఫిక్సింగ్ అంటే డబ్బులు తీసుకొని అవతలి వైపు ఉన్న టీమ్‌ని
గెలిపించడం లేదా మనం ఓడిపోవడం. అసలు ఆటగాళ్లు ఫిక్సింగ్ ఎందుకు చేస్తారని
అంటే అందుకు చాలానే కారణాలున్నాయి. కొంత మంది డబ్బుకొసం అని మరికొంత మంది
మాపై వచ్చిన ఒత్తిడి వల్ల అని కారణాలు చెబుతున్నారు.
ఐతే ఇటీవల తాజాగా పాకిస్థాన్ క్రికెటర్లు , టెస్టు మాజీ కెప్టన్ సల్మాన్‌భట్, పేసర్ ఆసిఫ్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడ్డారని ఇంగ్లాండ్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్‌ని మీరు ఫిక్సింగ్‌కి ఎందుకు పాల్పడ్డారని అంటే ఆయన చెప్పిన సమాధానం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, అతని అమాయకత్వానికి అద్దం పడుతుంది.
అందుకు కారణం మహ్మద్ అమీర్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డానికి కారణం 'తీవ్ర ఒత్తిడి' ని చెప్పడమే. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి విచారణ చేపట్టిన సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు ముందు అమీర్ మంగళవారం తన వాదనను వినిపించాడు. ఈ వాదనలో తాను ఫాక్సింగ్ పాల్పడిన విషయం నిజమేనని, అయితే తీవ్ర ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఈ దురగాతానికి ఒడిగట్టానని చెప్పాడు. ఇలా ఫిక్సింగ్‌కి పాల్పడి తాను తప్పు చేశానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫిక్సింగ్‌కి అంగీకరించాల్సి వచ్చిందన్నాడు. ఇలా కోర్టులో అమీర్ వాదన కేసును కొత్త మలుపు తిప్పింది. అతను నేరం అంగీకరించినప్పటికీ ఒత్తిడి అనే అంశం వెలుగులోకి తేవడంతో అమీర్‌కు సంబంధించి కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇది ఇలా ఉంటే 2000వ సంవత్సరంలో భారత క్రికెటర్లు ఫిక్సింగ్ పాల్పడిన విషయం తెలిసిందే. విశేషమేమిటంటే ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన వారిలో భారత మాజీ కెప్టెన్లు ఇద్దరు ఉండటం. ఒకరు భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించి జాతికి క్రికెట్ రుచిని చూపించిన వారైతే, మరొకరి మణికట్టు షాట్లతో విదేశీయులను సైతం ఔరా అనిపించిన వ్యక్తి. భారత్‌లో ఫిక్సింగ్ తెలియడానికి కారణం మాత్రం భారత ఓపెనర్, ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ ఆర్టికల్‌తోనే. ఢిల్లీకి చెందిన ఓ పత్రికకు 1997లో మనోజ్ రాసిన ఓ ఆర్టికల్ అప్పట్లో సంచలనం రేపింది.
1994లో భారత, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆటకు విరుద్ధంగా ప్రదర్శనను ఇస్తే 20 లక్షల రూపాయలను భారత జట్టుకు చెందిన ఓ సహచరుడు తనకు ఇవ్వజూపాడని మనోజ్ వ్యాసంలో రాశాడు. అయితే ఆ సహచరుడు ఎవరో కాదు భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌నని లేటుగా విషయాన్ని బహిర్గతం చేశాడు. ఐతే ఈ వార్త విన్న కపిల్ కళ్లనీళ్లపర్యంతమయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బుకీ ముఖేష్ గుప్తాకు అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేయటంలో కీలకపాత్ర పోషించింది మనోజేనని సిబిఐ దర్యాప్తులో తేలింది. ఇలా మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఇలా క్రికెట్లో మనకు తెలియకుండా ఫిక్సింగ్ ఎప్పటినుండో జరుగుతుందనేది వాస్తవం.

No comments:
Post a Comment
Thank you for your comment