గన్‌మెన్‌ల ఉపసంహరణ అంశాన్ని పునరాలోచించుకోవలిసిందిగా తెలంగాణ ఎంపీలు,
ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు లేఖ రాశారు. మావోయిస్టు
కార్యకలాపాలు తీవ్రమవుతున్న తరుణంలో గన్‌మెన్‌లను వెంట ఉంచుకోవల్సిందిగా
అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు
విడివిడిగా లేఖలు రాసింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు నిఘా వర్గాలు లేఖ రాశాయి. గన్‌మెన్‌లు
లేకుండా తిరగొద్దని ఆయనకు సూచించారు. వెనక్కి పంపించిన గన్‌మెన్‌లను తిరిగి
తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేటీఆర్‌ను కోరాయి.
సకల జనుల సమ్మె సమయంలో అక్రమ అరెస్టులు, పోలీసు అధికారుల సంఘం నేత
చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరంతా గన్ మెన్ లను వద్దని
తిప్పిపంపారు. వారి భద్రత నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం తిరిగి తీసుకోమని
కోరుతున్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment