Friday, November 4, 2011

గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్‌

గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్‌లా పనిచేస్తున్నారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ తగ్గలేదు, బల నిరూపణ అవసరం లేదు అని ఢిల్లీలో గవర్నర్ మాట్లాడి, ఆ పదవి విలువను దిగజార్చారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కృషిచేస్తున్నట్లుగా నరసింహన్ మాటలున్నాయని ఆరోపించారు. గవర్నర్, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ప్రభుత్వ పక్షంగా పనిచేస్నున్నట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment