సీబీఐ విచారణ అనంతరం చంద్రబాబును విచారించాలి అన్న జగన్ పై కర్నూలు
పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఘాటుగా
స్పందించారు. వైయస్ జగన్ అబద్ధాలకోరు అని, సిబిఐకి తనపై తప్పుడు సమాచారం
ఇచ్చారని విమర్శించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన
ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ కొడుకు అయిన గాలి జనార్దన్ రెడ్డి, జగను అంత నిజాయితీ పరులైతే
రాజ భవనాలను తలదన్నే ప్యాలెస్ లు ఎలా కడతారని ప్రశ్నించారు. ఒకరేమో
అప్పుల్లో ఉన్నవారు, మరొకరేమో ఏడో తరగతి చదివిన వాడు… వారిద్దరికీ ఇప్పుడు
భారతదేశంలోనే ఖరీదైన ఇళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా
గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కటై ప్రజాధనాన్ని
దోచుకున్నారని ఆయన ఆరోపించారు. జగనే ఓ అపద్ధం అయితే, ఆయన మాటలు అపద్ధాలు
కాకుండా పోతాయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment
Thank you for your comment