గ్రేటర్ నోయిడా
సంపన్నుల రాజధానిగా మారిన వేళ. తొలి ఇండియా గ్రాండ్ ఫిక్స్ అత్యంత
దిగ్విజయంగా ముగిసిన వేళ, అభిమానులతో కళకళలాడింది.క్రీడా దిగ్గజాలు, సినీ
తారలు, రాజకీయ నాయకులు, అశేష అభిమానులతో బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్‌పై
కళకళలాడింది. ఎఫ్1 డ్రైవర్లు తమ అద్వితీయ ప్రతిభతో అందర్నీ మైమరిపించిన
వేళ.
ఇవన్నీ ఇలా ఉంటే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రేసు ముగింపునకు సూచికగా చెకర్డ్ ఫ్లాగ్‌ను ఊపడం చిరస్మరణీయ అనుభూతి. నా జీవితంలో దీన్ని ఎప్పటికీ మరువలేను. ఆ జెండాను నా వద్దే ఉంచుకుంటా. ఈవెంట్‌ను జేపీ గ్రూప్ అద్భుతంగా నిర్వహించింది. మంచి వసతి సౌకర్యాలతో ట్రాక్‌ను ప్రపంచస్థాయిలో నిర్మించారు. ప్రేక్షకుల కోసం చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఈ రోజు అత్యంత మధురమైన జ్ఞాపకం అని అన్నారు.
ఇండియన్ గ్రాండ్‌ప్రిలో రెండు పాయింట్లు సాధించడం సంతృప్తిగా ఉందని సహారా ఫోర్స్ ఇండియా ఓనర్ విజయ్ మాల్యా అన్నారు. ఇదో గొప్ప రేసు అని, ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చిందని కొనియాడారు.
ఈ రేసు విక్షీంచేందుకు గాను బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ప్రీతిజింటా, దీపికా పదుకుణె, సిద్దార్ద మాల్యా, కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగునవారు హాజరయ్యిన విషయం తెలిసిందే. వీరితో పాటు క్రీడా విభాగానికి వస్తే ఇండియన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆఫ్ స్పిన్నర్ భజ్జీలు ఇండియన్ ఫార్ములా వన్ డ్రైవర్ చందోక్ కాసేపు ముచ్చటించి అభిమానులను ఉత్తేజపరిచారు.
ఎప్పుడూ ఒకే తరహా క్రీడలతో నూతనత్వమే లేకుండాపోయిన భారత క్రీడారంగంలో ఫార్ములావన్ కొత్త ఊపిరిలూదింది. ఎఫ్1 నిర్వహణలో మన సత్తాపై సందేహం వ్యక్తం చేసిన పాశ్చాత్య దేశాలకు తగిన జవాబునిచ్చింది. నిర్వహణ పరంగానే కాదు... ఆదరణలోనూ ఇండియన్ గ్రాండ్‌ప్రి విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది ప్రేక్షకులతో పాటు ప్రత్యక్షంగా దాదాపు లక్ష మంది ఈ రేసును తిలకించినట్టు సమాచారం.

No comments:
Post a Comment
Thank you for your comment