Wednesday, November 2, 2011

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని టార్గెట్ చేసిన ఉబుంటు

Ubuntu plans move into mobileమనిషికి గుండె ఎంత ముఖ్యమో మొబైల్ ఫోన్‌కి 'ఆపరేటింగ్ సిస్టమ్' అంత ముఖ్యం. విండోస్, ఆండ్రాయిడ్, లైనక్స్ లాంటి వాటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అంటారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఓ సామెత ఉంది. 'తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు'. ఇప్పడు ఈ సామెత ఎందుకు చెప్పానంటే సాధారణంగా మార్కెట్లో ఒకానొక టైమ్‌లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బాగా పాపులర్ అవుతుంది. ఆలా కొన్నాళ్లు అది చెలరేగి పోతుంది.

తర్వాత కొంత కాలానికి మరో ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లోకి దానికి పోటీగా విడుదలవుతుంది. సరిగ్గా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో హాల్ చల్ చేస్తుంటే దానిని కట్టడి చేయడానికి గాను కొత్తగా మార్కెట్లోకి మరో కొత్త లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ 'ఉబుంటు'ని మొబైల్స్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కెనానికల్ సృష్టికర్త (ఉబుంటు వెనుక ఉన్న ఆర్గనైజేషన్) ఇటీవలే తెలిపింది.

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ వర్సన్‌ని డెస్క్‌టాప్ కంప్యూటర్స్ కోసం త్వరలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కంపెనీ మొబైల్ ఫోన్స్, టాబ్లెట్ డివైజెస్, స్మార్ట్ టివిల కొసం ప్రత్యేకంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేపట్టనుందని తెలిపారు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మార్కెట్లో కొంత మంది కస్టమర్స్‌కి అవగాహాన ఉండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

ఇప్పటికే చిప్ సెట్ తయారీదారులు ARMతో ఈ విషయంపై చర్చించడం జరిగింది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్‌కి ఈ ఉబుంటు గట్టి పోటీనిస్తుందని అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment