గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పడుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు
నాయుడు అన్నారు. అనంతపురం నుంచి రైతు పోరు బాట మొదలుపెట్టిన బాబు గురువారం
కడపలో పర్యటించారు. శుక్రవారం ఆయన పర్యటన కర్నూలు జిల్లాలో జరగనుంది. కడప
పాదయాత్రలో ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తనది త్రిబుల్
బెడ్ రూమ్ అయితే, జగన్ మోహన్ రెడ్డికి 60 గదుల బెడ్రూమ్ ఉందన్నారు.
అలాంటిదే బెంగుళూరులోనూ ఉందన్నారు. ఎంతసేపు ఆరోపణలు చేసిన వారిపై ఎదురుదాడి
చేయడమే తప్ప తన నిజాయితీ ఎప్పుడూ నిరూపించుకోలేదని, అసలు
నిరూపించుకోవడానికి ఆయన వద్ద నిజాయితే లేదన్నారు. అవినీతి మార్గంలో
ప్రజాధనాన్ని కొల్లగొట్టి జగన్ జల్సా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
30 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నవారిని ఎక్కడైనా చూశారా అని ఆయన
ప్రశ్నించారు.
ఇంకో ఆయన జగన్ కు స్నేహితుడు, వ్యాపార భాగస్వామి. ఆయన చదివింది ఏడో
తరగతే కానీ ఆస్తులు మాత్రం విదేశీ పారిశ్రామిక వేత్తలతో కూడా పోటీపడేంత
ఉన్నాయన్నారు. మిడిసి పడిన గాలికి పట్టిన గతే వైఎస్ జగన్‌కు కూడా త్వరలో
పడుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినవారిపై తమ పార్టీ పోరాటం
చేస్తుందని, దోషులను ప్రజల ముందు నిలబెట్టేవరకూ విశ్రమించదని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వానికి కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతోందనీ, రైతుల
గోడును పట్టించుకునే పరిస్థితే లేదన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment