హిందీ, తెలు గు చిత్రరంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్న సినీ దిగ్గజం నేలరాలింది.
హిందీ చిత్ర రంగంలో ‘ముజ్రిం కౌన్’తో దర్శకుడు, నిర్మాత, నటుడిగా
వెండితెరపై ఒక వెలుగు వెలిగిన కలకొండ కృష్ణాడ్డి (83) మంగళవారం
కరీంనగర్‌లో కన్నుమూశారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆయన నలభై రోజుల నుంచి
తీవ్ర అనారోగ్యానికి గురై నగరంలోని తన కుమారుడు కె.శ్రీనాథ్‌రెడ్డి ఇంట్లో
మృతిచెందారు.
కరీంనగర్ మండలం కొత్తపల్లి (హవేలి)లో సాధారణ రైతు కుటుంబంలో
పుట్టినప్పటికీ కళారంగంపై మక్కువతో ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి
ఇరవై రెండేళ్ల వయస్సులో 1959లో బొంబాయి వెళ్లారు. తొలుత పుష్పాంజలి
చిత్రంలో, తరువాత రెండేళ్లు శిక్షణ పొంది 1962లో బాబర్-దో-దోస్త్,
చిత్రలేఖ, అమన్‌గుప్త తదితర చిత్రాల్లో నటించారు. 1965లో కరీంనగర్‌లోని
ఆస్తులను తాక ట్టు పెట్టినిర్మాత, దర్శకుడిగా, నటుడిగా, విలన్‌గా పాత్రలు
పోషించి ‘ముజ్రీం కౌన్’ అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగుతో కృష్ణ హీరోగా ‘నా ఇల్లే నా స్వర్గం’ నిర్మిం చి సంచలనం
సృష్టించారు. ప్రముఖ నటి దివ్యభారతికి తొలి తెలుగు చిత్రం ఇదే.
‘శేష్‌నాగ్’, ‘నయాసావన్’ వంటి ప్రజాదరణ పొంది న హిందీ చిత్రాలతో పద్మాలయ
సంస్థ ద్వారా కెకె.రెడ్డి బొంబాయిలో వ్యాపా రం చేశారు. 1992లో అశేష
ప్రజాదరణ పొంది, విజయఢంకా మోగించిన ‘తొలిముద్దు’ సినిమాను నిర్మించింది
ఈయనే. 40 ఏళ్ల సినీజీవిత అనుభవంతో తన సోదరుడు రుషేందర్‌రెడ్డిని దక్షిణభారత
దేశం నుం చి హిందీ చిత్రాల దర్శకుడిగా తయారు చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment