జార్ఖండ్
మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను సోమవారం జైలు సిబ్బంది చితకబాదారు. నాణ్యమైన
ఆహారం పెట్టాలంటూ జైలు సిబ్బందితో గొడవ పడ్డందుకు ఆయనను తీవ్రంగా
కొట్టినట్లు తెలిసింది. ఆయనతో పాటే జైల్లో ఉన్న మాజీ మంత్రులకు దేహశుద్ధి
చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మధుకోడా, ఆయన కేబినెట్‌లో పనిచేసిన
మాజీ మంత్రులు ఇక్కడి బిస్రా ముందా కారాగారంలో ఉంటున్నారు. జైల్లో సరైన
నాణ్యతగల ఆహారం పెట్టడం లేదంటూ వారు గత కొద్ది రోజులుగా ఆందోళన
చేస్తున్నారు. ఇదే విషయమై సోమవారం కూడా మధుకోడా, ఆయన సహచరులు జైలు
సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో
మధుకోడాతో పాటు ఆయన సన్నిహితుడు బినోద్ సిన్హాను భద్రత సిబ్బంది దేహశుద్ధి
చేశారు.కోడా వెంట ఉన్న మాజీ మంత్రులు ఏనొస్ ఎక్కా, హరి నారాయణరాయ్, భాను ప్రతాప్ సాహిలకు చిన్నపాటి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కోడాను స్థానిక రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మాజీ మంత్రులను కూడా ఆస్పవూతికి తరలించారు. కాగా, జైల్లో ఖైదీలకు పెట్టే ఆహార నాణ్యతను ప్రశ్నించినందుకే జైలు సిబ్బంది తనపై దాడి చేశారని మధుకోడా ఆరోపించారు. సహచర ఖైదీలే ఆయనపై దాడి చేశారని, ఇందులో జైలు సిబ్బంది ప్రమేయం లేదని డిప్యూటీ కమిషనర్ కేకే సోహాన్ తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment