ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మహా కవి
ఎవరో అన్నట్టే తెలంగాణ బిడ్డలు ఎక్కడన్నా జన్మభూమి కాంక్షను మాత్రం
స్పష్టంగా వెలిబుచ్చతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ సందర్భంగా
తెలంగాణలో పలు చోట్ల ర్యాలీలు తీస్తే విదేవీ తెలంగాణ ఎన్నారైలు కూడా తమ
పంథాలో నిరసన తెలిపారు. నవంబర్ 1ని లండన్‌లో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్
విద్రోహ దినంగా పాటించారు. పార్టీ సెల్ కార్యాలయం ముందు నల్ల జెండా
ఎగురవేసి నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమానికి లండన్‌లోని తెలంగాణ
ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణ జరిగిన అన్యాయాలను ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్
అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
వివరించారు. టీఆర్‌ఎస్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీడీపీ చేసిన
ఆరోపణలను అనిల్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు సంబంధం లేని పొట్టి
శ్రీరాములు జీవిత చరిత్రను మన పాఠ్యపుస్తకాల్లో పెట్టి తెలంగాణ చరిత్రను
మరిచారని మరో ఎన్‌ఆర్‌ఎస్ టీఆర్‌ఎస్ నేత నాగేందర్ చిందం అన్నారు.
ఇప్పటికైనా ఆంధ్రా పాలకులు కళ్లు తెరిచి తెలంగాణ అమరవీరుల చరిత్రను
పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. నవంబర్ 1ని
విద్రోహదినంగా పాటిస్తూ నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులను అక్రమంగా
అరెస్టు చేయడాన్ని , ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల పాశవిక చర్యలను
ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ తీవ్రంగా ఖండించింది.
No comments:
Post a Comment
Thank you for your comment