నెల్లూరు జిల్లాలో హంటా వైరస్ కలకలం రేపుతోంది. పొదలకూరు మండలం
బ్రాహ్మణపల్లిలో 13 ఏళ్ల బాలుడికి హంటా వైరస్ సోకినట్లు అనుమానం రావటంతో
అతడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. రాష్ట్రానికి
హంటా వైరస్ ముప్పుగా పరిణమిస్తోంది.
ఇటీవల తమిళనాడు, ముంబైలో వెలుగులోకి వచ్చిన హంటా వైరస్ తాజాగా మన
రాష్టాన్ని బెంబేలెత్తిస్తోంది. గత కొంతకాలంగా హంటా వ్యాధితో బాధపడుతూ
యశోద ఆస్పత్రిలో చేరిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన భగవంతరావు అనే
వ్యక్తి మృతి చెందాడరు. ఇదే మండలానికి చెందిన నర్సవ్వకు హంటా లక్షణాలు
ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఎలుకలు కరవడం, అవి తిన్న ఆహార పదార్థాలు
తినడం వల్ల ఈ హంటా వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
Tags: హంటా వైరస్
No comments:
Post a Comment
Thank you for your comment