Wednesday, November 2, 2011

నా కలల ప్రాజెక్టు, నిజమైన వేళ: యువరాజ్ సింగ్

Yuvraj Singh
ఆల్‌రౌండర్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యా ట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు పరిచయాలు అక్కర లేదు. 2011 వరల్డ్ కప్‌లో ఎక్కవ మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డులు గెలుపొందిన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొనిరావడంలో తనదైన పాత్రను పోషించిన వ్యక్తి. సోమవారం నాడు ఆరావళి ప్రాంతంలో ‘ యువరాజ్‌ సింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ’ పేరుతో ఔత్సాహిక క్రికెటర్ల కోసం అకాడమీని ప్రారంభించిన సందర్బంలో తన మనసులొని మాటలను ఇలా పంచుకున్నారు.

ఎన్నో ఏళ్లుగా అకాడమీని స్థాపించాలని కలలు కంటున్న నాకు ఇన్నాళ్లుకు కోరిక నేరవేరిందని అన్నాడు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ సౌకర్యం కలిగి ఉన్న అకాడమీలో శిక్షణ ఇప్పించేందుకు ప్రముఖ కోచ్‌లను నియమిస్తానని అన్నాడు. ప్రస్తుతం యువరాజ్‌ సింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ పేరుతో పాత్‌వే స్కూల్స్‌ నోయిడా, బలైవాస్‌లో శిక్షణ కేంద్రాలున్నాయని తెలిపాడు. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో యువరాజ్‌ స్థా పించిన అకాడమీలో ఉన్న సౌకర్యాలు ఇంతకుముందు ఉన్న ఏ అకాడమీలో నూ అందుబాటులో లేవు. బౌలింగ్‌ మిషన్లు, స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌ కలిగిఉన్న ఈ అకాడమీ విద్యార్థులతో పాటు బయటవారు ఉపయోగించేందుకు అమలులోకి తెస్తున్నానన్నారు. పాత్‌వేస్‌ స్కూల్స్‌ సహకారంతో నాకల నిజమైందని తెలిపాడు.

వీటితో పాటు టెస్టు కెరీర్‌పై మరింత దృష్టి పెట్టేందుకు ఇది సరైన సమయం. ఈ ఫార్మాట్‌లో మంచి బ్యాట్స్‌మన్‌గా అందరూ నన్ను గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను. మైదానంలో ఉన్న ప్రతీసారి అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తా. దురదృష్టవశాత్తూ గాయాల బారిన పడుతున్నా. విండీస్, ఆసీస్‌లతో జరిగే టెస్టుల్లో భారీ స్కోర్లు చేసి నా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటా’ అని యువీ స్పష్టం చేశాడు. క్రికెటర్‌గా తన అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉందని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాలతో తన ఆటలో మరింత పరిణతి ఏర్పడినట్టు చెప్పాడు. గాయాల కారణంగా చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని అన్నాడు.

No comments:

Post a Comment

Thank you for your comment