
ఈ మాటలపై మనీష్ తివారి అసలు అజీమ్ ప్రేమ్‌జీ యుపిఎ గవర్నమెంట్‌పై ఏ ఏరియాని ఉద్దేశించి అన్నారో మాత్రం అర్దం కావడం లేదని తివారి స్ఫష్టం చేశారు. ఐతే అజీమ్ ప్రేమ్‌జీ మాత్రం ఇటీవల యుపిఎ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌ల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. స్కామ్‌ల పై యుపిఎ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొవడంలో అలసట వహిస్తుందని తెలిపారు. దేశీయ మూడవ అతి పెద్ద సాప్ట్ వేర్ దిగ్గజం చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు మనీష్ తివారి కూడా కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకొవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందుకు కారణం జాతీయంగా, అంతర్జాతీయంగా వాటి ప్రభావం దేశం మీద చూపించడమే కాకుండా, సోషల్‌గా, ఎకనామికల్‌గా ప్రభావం చూపుతుందని అన్నారు. అన్నా హాజార్ ఉద్యమ నేపద్యంలో ఇన్పోసిస్ నారాయణ మూర్తి కూడా యుపిఎ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి చూస్తుంటే దేశంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీ ప్రముఖులు నెమ్మదిగా యుపిఎ గవర్నమెంట్‌కి దూరమవుతున్నారని తెలుస్తుంది.
No comments:
Post a Comment
Thank you for your comment