తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వీడిన ముగ్గురు
ఎమ్మెల్యేలు మూర్ఖులంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్
రెడ్డి మండిపడ్డారు. సొంత బలం లేక, తిరిగి ఎన్నికల్లో గెలవలేమని భయంతోనే
వారు టీఆర్ఎస్ లో చేరానని ఆయన సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. మరికొంతమంది
టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని, టీఆర్ ఎస్ లో
చేరేవరకూ బాగానే ఉంటుందని, చేరిన తర్వాత వారి స్థానం గేటు బయటేనని
అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలది తొందరపాటు
చర్యేనని ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల రాజీనామాతో
ప్రభుత్వం మైనార్టీలో పడలేదని ఆయన సోమవారం ఇక్కడ అన్నారు. ప్రతిపక్షాలు
అవిశ్వాసం పెట్టుకోవచ్చని డీఎస్ సూచించారు.
తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేసీఆర్
వ్యూహం పన్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఆలోచనతోనే
రాజీనామాలు ఆమోదం పొందకుండానే ఆ పార్టీలో చేరారని ఆయన సోమవారం ఇక్కడ
అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment