Wednesday, November 2, 2011

మళ్లీ ఉద్యోగానికి రాజీనామా

రాష్ట్ర పోలీసు శాఖలో డిఎస్‌పిగా పని చేస్తున్న నళిని తన ఉద్యోగానికి మరోసారి రాజీనామా చేసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన నళినిని తెలంగాణ రాజకీయ జేఏసి వారించడంతో  తిరిగి కొన్ని రోజుల తర్వాత తన ఉద్యోగం తనకు తిరిగి ఇప్పించాలని ధరఖాస్తు పెట్టుకోవడంతో  ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఉద్యోగం ఇచ్చింది.
గత కొంత కాలంగా తెలంగాణకు చెందిన నన్ను పై అధికారులు వేధిస్తున్నారని, కావాలని ప్రాధాన్యంలేని సిఐడిలో అప్రాధాన్య పోస్టులో వేశారని చెబుతూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి నళిని లేఖ రాశారు. తెలంగాణ రాకుంటే దానినే తన రాజీనామాగా భావించాలని సూచించారు. తాజాగా  మంగళవారం రాత్రి డిజిపిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం సిఐడిలో డిఎస్‌పిగా పని చేస్తున్నారు. గత మూడు నెలలుగా సెలవులో ఉన్నారు. అక్టోబర్ 10తో సెలవు ముగియడంతో మళ్లీ పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నళిని వరంగల్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత భర్త సహకారంతో ఉద్యోగం సంపాదించింది. భర్త ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment