ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం జగన్మోహనరెడ్డి కోఠిలోని సిబిఐ
కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జగన్‌ను విచారిస్తున్నారని తెలుసుకొని భారీగా పార్టీ కార్యకర్తలు, జగన్
అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. సిబిఐ కార్యాలయం ముందు వీరు పెద్ద ఎత్తున
గుమికూడి రభస చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో
అభిమానులు సిబిఐ కార్యాలయ బోర్డును తొలగించారు. పలుసార్లు వారు లోనికి
చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కోఠి –
రాంకోఠి రహదారిని మూసి వేశారు. సిబిఐ కార్యాలయ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా
అడ్డుకున్నారు. కార్యకర్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక అభిమాని కోఠి
చౌరస్తాలోని హౌర్డింగ్ ఎక్కాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
No comments:
Post a Comment
Thank you for your comment