
బంజారా హిల్స్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బంజారా హిల్స్ రొడ్ నెంబర్ 8లో ఉన్న 'మాస్ హైట్స్ బిల్డింగ్స్'లో గల ఫ్రాక్షన్స్ అండ్ ఫ్రేమ్స్ యానిమేషన్ కంపెనీలో గల ఆరుగురు ఉద్యోగులు మేనేజ్‌మెంట్ జీతాలు ఇవ్వడం లేదంటూ కేసు నమోదు చేశారని తెలిపారు. మూడు నెలల క్రితం ఎవి వెంకట రమణ అనే వ్యక్తి మూడు నెలల క్రితం యానిమేషన్ కంపెనీని నెలకొల్పడం జరిగిందని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు.
సిఈవోగా కొనసాగుతున్న వెంకట రమణ కంపెనీ స్దాపించిన మొదట్లో 70 మంది ఉద్యోగులను నియామకం చేసుకొని మంచి జీతాలను ఇస్తానని నమ్మపలికాడని అన్నారు. గత రెండు నెలలుగా మాకు జీతాలు ఇవ్వకపోగా, సీఈవోగా చెలామణి అవుతున్న వెంకట రమణ కూడా గత కొంతకాలంగా ఆఫీసుకి రావడం లేదని ఉద్యోగులు పోలీసులకి తమ గొడుని వెల్లబొసుకున్నారు.
దాంతో బంజారా హిల్స్ పోలుసులు వెంకట రమణపై కేసు నమోదు చేసి విచారణను కొనసాగించనున్నారు. ఇదే కంప్లైంట్‌లో ఉద్యోగులు వెల్లిడించిన సమాచారం ప్రకారం ఇటీవలే వెంకట రమణ హై టెక్ సిటీలో కొత్తగా మోర యానిమేషన్ స్టూడియోని ప్రారంభించినట్లు కూడా తెలిపారు. దాంతో పాత యానిమేషన్ కంపెనీలో ఉన్న పలువురు ప్రముఖులను కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment