Thursday, November 3, 2011

ఫిక్సింగ్ చేయకుంటే చంపేస్తాం, బెదిరింపులు: మోడి

Lalit Modi'లలిత్ మోడి' ఇండియన్ క్రికెట్ చరిత్రలో 'ఐపిఎల్'కి సువర్ణ అద్యయనం పలికిన వ్యక్తి. అదే ఐపిఎల్ ద్వారా ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి. ప్రస్తుతం క్రికెట్లో ఎక్కువ మంది చర్చించుకుంటున్న భూతం ఫిక్సింగ్. అందుకు కారణం ఇటీవలే లండన్ కొర్టు పాకిస్దానీ ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు పాల్పడ్డారంటూ వారిపై తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో చాలా మంది ఫిక్సింగ్ ఆరోపణలు ఎప్పటి నుండి మొదలయ్యాయి అంటూ మరోసారి వాటి స్మృతులను నెమర వేసుకుంటుండగా, లలిత్ మోడి కూడా తన జ్ఞాపకాలను మీడియాతో నెమర వేసుకున్నారు.

ఈ సందర్బంలో మాజీ ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ను తిరస్కరించినందుకు అండర్‌వరల్డ్ మాఫియా తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడాలని మాఫియా నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను కాదన్నందుకు బుకీలు, మాఫియా వాళ్లు నన్ను చంపాలని చూశారని మోడి ఓ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. మొదటిసారి 2009లో తన ఇంట్లో ఉన్నప్పుడు, దక్షిణాఫ్రికాలో మరోసారి, థాయ్‌లాండ్‌లో మూడోసారి తనపై హత్యాయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ ఘటనలపై అప్పుడు సెంట్రల్‌ ఏజెన్సీస్‌కు తెలిపానన్నాడు.

‘పాకిస్థాన్ నుంచి కూడా నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత వారం కూడా అలాంటి ఫోన్ కాలే వచ్చింది. దీనిపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసుకు ఫిర్యాదు చేశాను’ అని మోడి చెప్పారు. తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ముంబై పోలీసులతో పాటు, సెంట్రల్ ఏజెన్సీలకూ తెలుసని, వాళ్లు తగిన భద్రత ఏర్పాట్లు చేశారని మోడి వివరించారు. మంగళవారం లండన్ కోర్టు పాకిస్థాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్ దోషులని తీర్పిచ్చిన మరుసటి రోజే మోడి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

No comments:

Post a Comment

Thank you for your comment