Thursday, November 3, 2011

డర్టీ పిక్చర్ ను విడుదల చేయొద్దు

దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా డర్టీ పిక్చర్. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, ఫోటోలు బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ‘ది డర్టీ పిక్చర్’ చిత్రాన్ని అసభ్యకర దృశ్యాలతో చిత్రీకరించారని, దానిని రిలీజ్ చేయకుండా ఆపు చేయాలని స్మిత సోదరుడు హైకోర్టు న్యాయవాది ద్వారా ఆ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపారు. తన అక్క జీవిత చరిత్రని నిర్మాతలు తమను సంప్రదించకుండా తీశారని స్మిత సోదరుడు నాగవరప్రసాద్ అన్నారు. ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషించారు. ఆమె “డర్టీ పిక్చర్‌”  హిట్టయి తనకు బాలీవుడ్‌లో మరింత పాపులారిటీ రావాలని ఆశిస్తున్నారు.  దాని కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి డర్టీ పిక్చర్‌లోని ఓ పాటకు డ్యాన్స్‌ చేయడం విశేషం.

No comments:

Post a Comment

Thank you for your comment