రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ముథోల్ ఎమ్మెల్యే
వేణుగోపాలచారి వేసిన పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు ప్రారంభం
అయ్యాయి. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయిన నేపథ్యంలో
కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిని నిర్వహించే చట్టబద్ద అధికారం లేదని
పేర్కొంటూ వేణుగోపాలాచారి నిన్న కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కిరణ్‌కుమార్‌డ్డి కొనసాగేందుకు శాసనసభలో
మెజార్టీ లేనందున, కోర్టు జోక్యం చేసుకొని ఆయనను సీఎం పదవి నుండి
తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అధికార పార్టీ మెజార్టీపై
ప్రశ్నించాల్సిన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు వ్యక్తిగత ప్రయోజనాలతో
నోరు మెదపటం లేదని వేణుగోపాలాచారి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment