ulian Assange at London Hi-court
అసాంజే కేసును అనుకున్నట్టుగానే అమెరికా మేనేజ్ చేయగలిగింది. వికీలీక్స్
వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు లండన్ హైకోర్టులో బెయిలు దక్కలేదు. గతంలో
ఈ వెబ్‌సైట్ కోసం కార్యకర్తలుగా పనిచేసిన ఇద్దరు మహిళల ఫి ర్యాదు మేరకు
స్వీడన్‌లో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. దీంతో
బ్రిటన్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. విచారణ నిమి త్తం తమకు
అప్పగించాలని స్వీడన్ పోలీసులు కో రారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసాంజ్ గతంలో
పిటీషను వేశారు. దాన్ని విచారించిన కోర్టు అసాంజేకు వ్యతిరేకంగా తీర్పు
వచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా జడ్జిలు జాన్ థామస్, డంకన్
ఔస్లీ కింది కోర్టు ఆదేశాలనే ఖరారు చేశారు. దీనిపై మళ్లీ మరో పైకోర్టును
ఆశ్రయిస్తామని అసాంజ్ న్యాయవాది జోన్ హర్టిగ్ తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment