Friday, November 4, 2011

మన మానవుల అభివృద్ధి స్థానం 134

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం  రూపొందించిన మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో భారత్‌ స్థాయి దిగజారిపోయింది.  బుధవారం విడుదలైన  ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక-2011లో ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలలో ఇండియా 134వ స్థానంలో నిలిచింది. దేశంలో మనిషి సగటు జీవనకాలం గత 20 ఏళ్లలో గణనీయం గా పెరిగి 65.4 ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఇంత తక్కువ ర్యాంకు రావడమే విచిత్రం. ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం, జ్ఞానసముపార్జనకున్న అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అనే ప్రాథమిక అంశాలు హెచ్‌డీఐకి కొలమానం. కాగా 2011లో భారత్ హెచ్‌డీఐ విలువను 0.547గా నివేదిక పేర్కొంది. దీంతో భారత్ మానవాభివృద్ధిలో ‘మీడియం కేటగిరీ’ దేశాల జాబితాలో చేరింది. పొరుగు దేశాలైన పాక్, బంగ్లాదేశ్‌లు 145(0.504), 146 (0.500) స్థానాలతో ‘లో’ కేటగిరీలో నిలిచాయి. గత నివేదికలో భారత్ 169 దేశాలకుగాను 119వ స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా లింగ వివక్ష సూచిలో భారత్ 129వ స్థానంలో నిలిచింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లెక్కకు మిక్కిలిగా భూములు కొనుగోలు చేస్తున్న అగ్ర దేశాల జాబితాలో మన దేశం కూడా చేరింది. ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్.. నివేదిక పూర్తిగా తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచాభివృద్ధిలో అస్థిరతకు ప్రధాన కారణం అమెరికాయేనన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment