Tuesday, November 1, 2011

బక్రీద్ తరువాత తెలంగాణ : చిదంబరం

బక్రీద్ పండుగ తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హొంమంత్రి పి. చిదంబరం ప్రకటించారు. తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని, ఇది పండుగల సీజనయినందున నిర్ణయం తీసుకోలేకపోయామని పార్టీ ఇన్‌చార్జి చెప్పినట్లు చిదంబరం వెల్లడించారు.
సైన్యం మొహరింపు ఒకటే కాశ్మీర్‌సమస్యకు పరిష్కారం కాదని, కాశ్మీర్ సమస్యపై 8 సూత్రాల ప్రణాళికను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ మాసపు నివేదికను చిదంబరం సమర్పించారు. మాలేగావ్ పేలుళ్ల నిందితులకు బెయిలు ఇవ్వడానికి ఎన్‌ఐఏ వ్యతిరేకంగా లేదని, మణిపూర్ సంక్షోబాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చిదంబరం తెలిపారు. ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్నామని చెప్పారు. అలాగే సాయుధ దళాల చట్టాలను సమీక్షిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment

Thank you for your comment