Wednesday, November 2, 2011

ధోనికి దక్కిన అరుదైన గౌరవం, లెఫ్టినెంట్ కల్నల్ హోదా

Mahendra Singh Dhoniభారత క్రికెట్ చరిత్రలో అతనిది ఓ ప్రత్యేకమైన స్టయిల్. ఎప్పుడూ కూల్‌గా ఉంటూ కూల్ కూల్ విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనికి, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాలకు భారత ఆర్మీ 'గౌరవ లెఫ్టినెంట్ కల్నల్' హోదా కల్పించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ఇద్దరికి కల్నల్ ర్యాంకుల్ని ప్రదానం చేశారు.

అంతర్జాతీయ క్రీడల్లో భారత కీర్తి ప్రతిష్టల్ని పెంచిన ఆటగాళ్లకు ఈ గౌరవ హోదానిచ్చి సత్కరించినట్లు ఆయన తెలిపారు. కల్నల్ హోదా పొందిన తర్వాత ధోని, బింద్రా ఆర్మీ దుస్తుల్లో మీడియా ముందుకొచ్చారు. దక్షిణబ్లాక్‌లో వారు విధులను నిర్వర్తించనున్నారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. సామర్థం. అంకితభావం, కష్టించే పనిచేసే తత్వం , ఏకాగ్రత వీరిద్దరిలో మెండుగా ఉన్నాయని ఉన్నారు.

ధోనితో పాటు ఈ అవార్డుని దక్కించుకున్న బింద్రా గురించి ఒక సైనిక దళపతికి ఉండే లక్షణాలన్నీ బింద్రాలో ఉన్నయాని అన్నారు. అందుకే అతనికి ఈ గౌరవం దక్కిం దని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇకపోతే టీమిం డియా కెప్టెన్‌ ధోని నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న గొప్ప వ్యక్తిత్వం కలవారన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నెగ్గుకురావటంలో అతనికి అతనే సాటి అని కొనియాడారు.

వీళ్లిద్దరితో పాటు 17 ఏళ్లుగా భారత సైనికులకు సేవలందిస్తున్న డాక్టర్ దీపక్‌రావుకు గౌరవ మేజర్ ర్యాంకును ఇచ్చారు. తాజాగా వీరి చేరికతో ఆర్మీ గౌరవ హోదా పొందిన జాబితా 17 మందికి చేరింది. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment