Wednesday, November 2, 2011

సంక్రాంతికి ‘బాడీగార్డ్‌’

వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బాడీగార్డ్‌’. త్రిష కథానాయిక. గోపిచంద్‌ మలినేని దర్శకుడు. శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌-బెల్లంకొండ గణేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్‌లో ఆడియో, జనవరి 12న సినిమా విడుదల చేస్తున్నాం. థమన్‌ అద్భుత బాణీలిచ్చారు. వెంకీ కెరీర్‌లోనూ ఓ విభిన్న చిత్రమిది. మా బేనర్‌లో తనకి రెండో సినిమా. తప్పక విజయం సాధిస్తుంది’ అన్నారు.
సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, సంగీతం: థమన్‌, కెమెరా: శ్యాం.కె.నాయుడు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడటింగ్‌: గౌతంరాజు, డాన్స్‌: రాజు సుందరం, బృంద, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ప్రసాద్‌ మైనేని, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు, కథనం-దర్శకత్వం: గోపిచంద్‌ మలినేని.

No comments:

Post a Comment

Thank you for your comment