లండన్:
స్పాట్ ఫిక్సింగు కేసులో ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను కోర్టు దోషిగా
నిర్ధారించింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్
రెండు నేరాల్లో దోషిగా నిలిచాడు. అవినీతి చెల్లింపుల అంగీకారం కుట్ర,
మోసానికి కుట్ర కేసుల్లో కోర్టు భట్‌ను దోషిగా నిర్ధారించింది. అతని జట్టు
సహచరుడు, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్‌ను స్పాట్ ఫిక్సింగ్ విచారణలో
మోసానికి కుట్ర కేసులో సౌత్‌వర్క్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది.
నాలుగు అభియోగాల్లో మూడు అభియోగాలపై నిర్ణయం వెలువడింది. సల్మాన్ భట్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిరుడు లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండు, పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచులో వారిద్దరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మోసానికి కుట్ర చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో నిందితులు ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్, ఏజెంట్ మజర్ మజీద్ తాము తప్పు చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment
Thank you for your comment