Saturday, November 5, 2011

పెట్రోలు ధరలు మీ ఇష్టమా: హైకోర్టు

కేవలం ఏడాదిలో నలభై శాతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి ఇన్నాళ్లకు దీనిపై పెద్ద ఆటంకం ఎదురయింది. పెట్రోల్ ధరల పెంపును కేరళ హై కోర్టు తప్పు పట్టింది.  మీ ఇష్టాను సారం పెట్రోలు ధరలు పెంచుతూ పోతే కామన్ మాన్ ఏమయిపోవాలని ఆగ్రహం వ్యక్తంచేసింది. మాజీ ఎంపీ థామస్ వేసిన పిటిషనుపై కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎన్ రామచంద్రన్ నాయర్ విచారణ జరిపారు. తరచూ పెట్రోలు ధరలు పెంచడాన్ని తప్పు పడుతూ  ఐవోసీ, రిలయన్స్, చమురు సంస్థలు బ్యాలన్స్ సీట్లను సమర్పించాలని ఆదేశించారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని ఏకంగా కోర్టే చెప్పడం విశేషం. బైకులు, పెట్రోలుతో నడిచే చిన్న కార్ల యజమానులే ఈ ధరల వల్ల ఎక్కువ నష్టపోతున్నారని, పెద్దవాళ్లు – సంపన్నులు ఖరీదైన డీజిలు కార్లు కొనుక్కుంటారని పిటిషనరు పేర్కొన్నారు.
మరో వైపు పెట్రోల్ ధరల పెంపును ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్థించారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్‌లోని కేన్స్‌కు వెళ్లిన ఆయన అక్కడ విలేకర్లతో మాట్లాడారు. తప్పని పరిస్థితుల్లోనే పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఏడాదిలో 11 సార్లు పెట్రోలు ధరలు పెంచారని మమత  మండిపడింది. కేంద్ర ప్రభుత్వం ఎవర్ని సంప్రదించి పెట్రోలు ధరలు పెంచిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం తమ సలహాలను పాటించడం లేదని ఆరోపించారు. ప్రధాని విదేశీ పర్యటన నుంచి రాగానే యూపీఏ నుంచి వైదొలగే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

No comments:

Post a Comment

Thank you for your comment