
ఇండియాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 'ఇండియన్ రేసింగ్ లీగ్' అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి మరో పేరు 'ఐ1 సూపర్ సిరిస్' కూడా పెట్టారు. ఈ ఐ1 సూపర్ సిరిస్ జనవరి నెలలో ట్రాక్స్ పైకి ఎక్కి ఫిబ్రవరి 26వ తేదీ నాటికి ముగియనుంది. ఇందులో మొత్తం ఎనిమిది సిటీలకు సంబంధించిన టీమ్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ముంబై, కొల్‌కత్తా, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ఛండీఘడ్, హైదరాబాద్, పూణె. 16 మంది ఓ గ్రిడ్‌గా ఏర్పడతారు.
Read: In English
ఇండియన్
రేసింగ్ లీగ్ అనేది మొదట మచ్దార్ మోటార్ స్పోర్ట్స్ వారికి చెందినది కాగా,
ఆ తర్వాత క్రికెట్ దేవడు సచిన్ టెండూల్కర్, సంజన రెడ్డి ఇద్దరూ కలపి
అందులో 26శాతం వాటాని కొనుగొలు చేయడం జరిగింది. 15 సంవత్సరాలకు గాను
ఫ్రాంచైజీ ఖరీదు $20m. మొదట్లో పెట్టుబడి దారులు $5m చెల్లించాల్సి ఉండగా
మిగిలిన డబ్బు ఓనర్ షిప్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. షారుఖ్ ఖాన్, జూహిచావ్లా, జై మెహాతా భాగస్వామ్యంతో ముంబై ఫ్రాంచైజీని దక్కించుకొగా, దాబుర్స్ మోహిత్ బర్మన్ ఢిల్లీ ప్రాంజైనీ దక్కించుకోగా, మలేషియా బిజినెస్ టైకూన్, యుకె ఫండ్ మేనేజర్ ఎస్ జి శ్రీనివాసన్ భాగస్వామ్యంతో చెన్నై ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. హైదరాబాద్ ప్రాంచైజీ విషయానికి వస్తే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఎన్ ప్రసాద్ ఇద్దరూ కలసి ఓకె చేశారు. ఛండీ ఘర్ ఫ్రాంచైజీని యువరాజ్ సింగ్, అతని స్నేహితుడుతో కలసి తీసుకున్నారు. కోల్‌కత్తా ప్రాంచైజీ మాత్రం సౌరభ్ గంగూలీ తీసుకొనున్నట్లు సమాచారం. ఇక బెంగుళూరు, పూణెకి సంబంధించిన ప్రాంచైజీ ఓనర్ షిప్ సంబంధించిన విషయాలు ఇంకా బయటకు రాలేదు.
No comments:
Post a Comment
Thank you for your comment