కోట్లలో
వచ్చే అయ్యప్ప భక్తులను ఒక పద్ధతి ప్రకారం క్యూలో పంపించి స్వామి దర్శనం
చేయించడానికి ఎలక్ట్రానిక క్యూ విధానాన్ని పాటించాలని ట్రావన్ కోర్
దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల
క్యూలో భారీగా తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా మృతి చెందిన విషయం
తెలిసిందే. కొత్త విధానం ప్రకారం భక్తులు ఆన్‌లైన్‌లో తమ దర్శన సమయాన్ని
బుక చేసుకోవచ్చు. భక్తుల తమ సమయం వచ్చే వరకు క్యూలోకి రారు కనుక
తొక్కిసలాటకు, తోపులాటకు అవకాశాలు బాగా తగ్గుతాయి. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్
చేసుకున్న వారు తమకు కేటాయించిన సమయానికి వచ్చి గుర్తింపు కార్డును
చూపించి క్యూలైన్‌లోకి ప్రవేశించవచ్చు.
సాధారణ రోజులలో పోలీసు వెబ్‌సైట్ ద్వారా దర్శనం సమయాన్ని బుక్
చేసుకోవచ్చు. సీజన్‌లో మాత్రం దేవస్థానమే ఈ బాధ్యతలను నిర్వహిస్తుంది.
శబరిమల భద్రతా వ్యవహారాలు చూస్తున్న ఎడిజిపి చంద్రశేఖరన్ మీడియాతో
మాట్లాడుతూ నవంబర్1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని
చెప్పారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పోలీసు కంప్యూటర్ సెల్
తయారుచేసింది. ప్రస్తత విధానం ప్రకారం భక్తజనసందోహం ఎంత ఉన్నా సంబంధం
లేకుండా వృద్ధులు, పిల్లలు సైతం 12-14 గంటల పాటు క్యూలో నిలబడి
ఎదురుచూడాల్సి వచ్చేది. నీలిమల, అపాచిమేడు కొండలను ఎక్కి సేద తీరకుండానే
క్యూలో చేరాల్సివచ్చేది. భక్తులకు ఈ శ్రమ తప్పి కాస్త సేదతీరే అవకాశం ఈ
ఎలక్ట్రానిక క్యూ విధానం వల్ల కలుగుతుందని చంద్రశేఖరన్ అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment