Wednesday, November 2, 2011

నాకా సినిమాతో సంబంధం లేదు

‘నేను హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నానని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం నేను ఏ చిత్రం లోనూ హీరోగా నటించడం లేదు. అలాంటిది నాకు తెలీకుండా తీవ్రవాద చిత్రంలో చేస్తున్నట్లు వస్తున్న వార్తలు విస్మయానికి గురిచేశాయి. అలాంటిది ఏదైనా చిత్రంలో చేస్తే ముందే మీడియాకు చెబుతాను’ అని నటుడు, హీరో అజయ్ అన్నారు. ప్రస్తుతం నాకు హీరోగా నటించే  ఉద్దేశం కూడా లేదు అని అన్నారు.
ప్రస్తుతం నేను గబ్బర్‌సింగ్, రాజన్న, ఇష్క్, బెజవాడ, నందీశ్వరుడు, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో ప్రతినాయకుడిగా, కేరక్టర్ నటుడుగా చేస్తున్నానని, తాను హీరోగా చిత్రం చేస్తున్నట్లు వచ్చిన సినిమాతో తనకు సంబంధలేదని అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment