తెలంగాణ కోసం రాజీనామా చేస్తం, పొడుస్తం, నరుకుతం అన్న శ్రీధర్‌బాబు
ఎక్కడికి పోయిండు అని టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో శవాలపై ప్రమాణం చేసిన శ్రీధర్‌బాబుకు మతి తప్పిందా
అని మండిపడ్డారు. మంత్రి పదవిలో కొనసాగే అర్హత శ్రీధర్‌బాబుకు లేదన్నారు.
రాజీనామా చేసిన తమని మాట్లాడానికి సిగ్గు, శరం ఉండాలని దుయ్యబట్టారు.
మంత్రుల, ఎమ్మెల్యేల రాజీనామాలకు అడ్డం ఫార్చూన్ కార్లు వచ్చాయా అని
అన్నారు. సీఎం ఇచ్చే కార్లకు అమ్ముడుపోయిన మీరు తెలంగాణ సాధిస్తారా అని
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన తమపై, రాజీనామా చేయని వారిపై
సీబీఐపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చావు డప్పులు కొట్టినా కూడా
మంత్రులు పదవులను పట్టుకొని వేలాడటం సమంజసం కాదన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment