Tuesday, November 1, 2011

షారుఖ్ కూతురుకి లేడీ గాగా బహుమతి


బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూతురు సుహానాకు ప్రఖ్యాత పాప్ సింగర్ లేడి గాగా తన కళ్లజోడును గిఫ్టుగా ఇచ్చింది. ప్రస్తుతం లేడి గాగా ఇండియా టూర్ లో ఉన్నారు.  గాగాను షారుఖ్ ఆదివారం తన కూతురితో పాటు కలుసుకున్నారు. ఆ సందర్భంగా కూతురు సుహానాకు లేడి గాగా తన కళ్ల జోడును ప్రెజంట్ చేశారట. ఆమెను కలిసిన విషయాన్ని షారుక్ ట్విటర్ లో పెట్టాడు. “లేడి గాగాను కలుసుకోవడం గొప్ప అనుభూతిని మిగిల్చింది, అందంతోపాటు నిజాయితీ కలిగిన వనిత ఆమె” అని షారుఖ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment