రవిబాబు,
ఉషా కిరణ్ మూవీస్, శేఖర్ చంద్ర.. మళ్లీ ‘నచ్చావులే’ టీమ్ తెరపైకి వచ్చింది
‘నువ్విలా..’ అంటూ. ఆకట్టుకునే పోస్టర్లు, కొత్త తరహా పబ్లిసిటీ, ఫీల్
గుడ్ మ్యూజిక్ తో మళ్లీ నచ్చావులే మ్యాజిక్ ను రిపీట్ చేసేలా కనిపించిన
‘నువ్విలా..’ ఆశించిన స్థాయిలో లేదు కానీ నిరాశ పరిచేది మాత్రం కాదు.
పిజ్జా కార్నర్లో పనిచేసే ముగ్గురు స్నేహితులు, వారి జీవితాల్లోకి
ప్రవేశించే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. ఎప్పుడూ కన్ఫ్యూజన్లో
ఉండే ఆనంద్ (అజయ్) తన ఎదురింట్లో కొత్తగా చేరిన అమ్మాయి అర్చన (యామి)ని
ప్రేమిస్తాడు. ఐతే అప్పటికే ఓ క్రికెటర్ ప్రేమలో పడిన ఆమె అతని కారణంగా
గర్భవతి కూడా అవుతుంది. కానీ విష్ణు చనిపోవడంతో ఆమె బాధ్యతను ఆనంద్
తీసుకుంటాడు. ఇక రాజు (ప్రసాద్)కు మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో చేరాలన్నది
లక్ష్యం. ఇతనికి రమ్య (రమ్య)కు అస్సలు పడదు. కానీ అనుకోని పరిస్థితుల్లో
ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మోడల్ కావాలనుకునే మహేష్ (హివేష్)ది
మరో కథ. ఇతను మాధవి (సరయు)ను ప్రేమిస్తాడు. కానీ ఓ గొడవతో ఇద్దరూ
విడిపోతారు. ఇతని కథలోకి గే పాత్ర చేరడం మరో మలుపు. ఇలా మూడు జంటల జీవితాలు
ఎటు పయనించాయి? చివరికేమైంది అన్నది మిగిలిన కథ.
కథ వింటేనే బట్టే ఇది స్ట్రిక్ట్లీ ఫర్ యూత్ సినిమా అని అర్థమైపోతుంది.
స్ర్రీన్ ప్లే, మాటలు, నటీనటుల ప్రదర్శన మీదే నడిచిన నువ్విలాలో బలమైన కథ
లేదు. ఫస్టాఫ్ వేగంగా సాగి.. మంచి అనుభూతినిస్తుంది కానీ.. గే పాత్ర
ప్రవేశంతో సినిమా గాడి తప్పింది. ఆ పాత్రను రెండు మూడు సన్నివేశాలకు
పరిమితం చేయకుండా పొడిగించడం ఇబ్బందిగా మారింది. ద్వితీయార్ధం రొటీన్ గా
సాగడం.. క్లయిమాక్స్ కూడా సాధారణంగా ఉండటంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి
సంతృప్తి దక్కదు. హీరోల స్థాయిలో తన పేరు చూసి సినిమాకు వచ్చే అభిమానుల్ని
సంపాదించుకున్న రవిబాబు.. ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకత ఏదో ఒకటి
చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలోనూ తన శైలిని చూచించాడతను.
నచ్చావులే స్థాయి సినిమా తీయలేదు కానీ.. మనసారాలా డిసప్పాయింట్ చేయలేదు.
నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టకోవడంలో, స్క్రీన్ ప్లేను వేగంగా
నడిపించడంలో, సిచ్యువేషనల్ కామెడీని పండించడంలో, కొన్ని పంచ్ డైలాగులు
రాయడంలో అతను సఫలీకృతుడయ్యాడు. మరోసారి నచ్చావులేకు చేసిన మ్యాజిక్ నే
రవిబాబు పునరావృతం చేశాడు. చాలా పరిమితమైన లొకేషన్లలో, పరిమితమైన బడ్జెట్లో
మంచి క్వాలిటీతో మూవీ తీసి పెట్టాడు. ఈ విషయంలో కెమెరామెన్ సుధాకర్
రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ అతనికి బాగా ఉపయోగపడ్డారు. చాలా సాధరణమైన
లొకేషన్స్ లోనే మంచి డెకరేషన్, కలర్ ఫుల్ థీమ్స్ వాడి లాంగ్ షాట్ల జోలికి
పోకుండా సినిమాకి రిచ్ లుక్ తెచ్చారు. నచ్చావులే లాగే నువ్విలా షూటింగ్
కూడా మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తయింది. శేఖర్ చంద్ర సంగీతం ఓకే.
ఐతే పాటలు నచ్చావులే స్థాయిలో లేవు. టైటిల్ సాంగ్ కు మాత్రం మంచి మార్కులు
పడతాయి. ఈ పాట సాహిత్యం కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు
తగ్గట్లు సాగింది. సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లస్ పాయింటే.
‘చిత్రం’ సినిమాతో ‘కుటుంబ సమేతంగా చూసే చిత్రాల’ దారి నుంచి పక్కకు
వచ్చిన ఉషాకిరణ్ మూవీస్ దృష్టంతా ఇప్పుడు యూత్ మీదే. ఈ సినిమా కూడా
ముఖ్యంగా యూత్ నే టార్గెట్ చేసింది. నచ్చావులే పెద్దల్ని కూడా ఆకట్టుకుంది
కానీ.. నువ్విలా మాత్రం అలా లేదు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే
అవకాశాల్లేవు. ముఖ్యంగా ‘గే’ పాత్రకు, ఆ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం
యువతకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక కుటుంబ ప్రేక్షకుల సంగతేం కాను.
ప్రధాన పాత్రల్లో చేసిన ఆరుగురూ మంచి నటన కనబరిచారు. వారెవరన్న పట్టింపు
అక్కర్లేదు. క్యారెక్టర్లే కనిపిస్తాయి తెరమీద. అందర్లోకి ప్రసాద్ ఎక్కడు
ఆకట్టుకున్నాడు. ‘డైరీ మిల్క్’ యాడ్ తో (రెండు రూపాయలకు రెండు లడ్డూలు)
పాపులరైన ఈ కుర్రాడు చక్కగా నటించాడు. అతని నత్తి కామెడీ ఆకట్టుకుంటుంది.
No comments:
Post a Comment
Thank you for your comment