తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
ప్రారంభించారు. పేదలకోసమే రచ్చబండ కార్యక్రమాన్ని దివంగత సీఎం వైఎస్
రాజశేఖరరెడ్డి ఆనాడు ప్రారంభించారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా
చేరడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రెండో దశ రచ్చబండలో 50
లక్షల మందికి రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇస్తామని తెలిపారు.విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ రెండో దశ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పేదలకు రూపాయికి కిలో బియ్యాన్ని పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాజెక్టుల గురించి పట్టించుకోని టీడీపీ నేడు రైతులపై కపట ప్రేమ చూపిస్తుందన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment