ముంబై: నిన్న వన్
ఇండియా తెలుగు న్యూస్‌లో సచిన్ టెండూల్కర్ ఓనర్‌గా త్వరలో 'ఐ1 సూపర్
సిరిస్' అనే 'ఇండియన్ రేసింగ్ లీగ్' అనే ఆర్టికల్‌ని పాఠకులకు తెలియజేయడం
జరిగింది. మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ చెందిన ఈ లీగ్‌లో క్రికెట్ దేవడు
సచిన్ టెండూల్కర్, సంజన రెడ్డి ఇద్దరూ కలపి అందులో 26శాతం వాటాని కొనుగొలు
చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.
కానీ ఈ ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు స్వల్ప వాటా మాత్రమే ఉందని ప్రమోటర్స్ మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ బుధవారం అధికారకంగా వెల్లడించింది. అంతేకాదండోయ్ 'ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్' సచిన్ వాటాపై వార్తలను మొదట మచ్‌దర్ మెటార్‌స్పోర్ట్స్ సీఈఓ ఎం.దర్శన్ మొదట తోసిపుచ్చడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా దీనికి సంబంధించిన వివరాలను బయటక వెల్లడించారు.
భారత్‌లో
మోటో రేసింగ్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో మచ్‌దర్ కంపెనీ ఐ1 సూపర్
సిరీస్‌కు గత ఆగస్టులో రూపకల్పన చేసింది. దీని ప్రకారం ఈ సిరీస్‌లో 8
ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ నుంచి 2 కార్లు రేసులో పాల్గొంటాయి.
డిసెంబర్ 18 నుంచి 25 ఫిబ్రవరి 2012 వరకు ఢిల్లీ, చెన్నైతో పాటు ఏడు ఆసియా
నగరాల్లో ఈ రేసులు జరగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ విలువ 2
మిలియన్ డాలర్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్ స్పోర్ట్స్ సమాఖ్య డీ1, మోటార్
స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన అనుమతులను తీసుకునేందుకు
మచ్‌దర్ గ్రూప్ ప్రయత్నిస్తోంది.
15 సంవత్సరాలకు గాను ఫ్రాంచైజీ ఖరీదు $20m. మొదట్లో పెట్టుబడి దారులు $5m చెల్లించాల్సి ఉండగా మిగిలిన డబ్బు ఓనర్ షిప్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. షారుఖ్ ఖాన్, జూహిచావ్లా, జై మెహాతా భాగస్వామ్యంతో ముంబై ఫ్రాంచైజీని దక్కించుకొగా, దాబుర్స్ మోహిత్ బర్మన్ ఢిల్లీ ప్రాంజైనీ దక్కించుకోగా, మలేషియా బిజినెస్ టైకూన్, యుకె ఫండ్ మేనేజర్ ఎస్ జి శ్రీనివాసన్ భాగస్వామ్యంతో చెన్నై ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. హైదరాబాద్ ప్రాంచైజీ విషయానికి వస్తే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఎన్ ప్రసాద్ ఇద్దరూ కలసి ఓకె చేశారు. ఛండీ ఘర్ ఫ్రాంచైజీని యువరాజ్ సింగ్, అతని స్నేహితుడుతో కలసి తీసుకున్నారు. కోల్‌కత్తా ప్రాంచైజీ మాత్రం సౌరభ్ గంగూలీ తీసుకొనున్నట్లు సమాచారం.
కానీ ఈ ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు స్వల్ప వాటా మాత్రమే ఉందని ప్రమోటర్స్ మచ్‌దర్ మోటార్ స్పోర్ట్స్ బుధవారం అధికారకంగా వెల్లడించింది. అంతేకాదండోయ్ 'ఐ1 సూపర్ సిరీస్ రేసింగ్ చాంపియన్‌షిప్' సచిన్ వాటాపై వార్తలను మొదట మచ్‌దర్ మెటార్‌స్పోర్ట్స్ సీఈఓ ఎం.దర్శన్ మొదట తోసిపుచ్చడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా దీనికి సంబంధించిన వివరాలను బయటక వెల్లడించారు.
15 సంవత్సరాలకు గాను ఫ్రాంచైజీ ఖరీదు $20m. మొదట్లో పెట్టుబడి దారులు $5m చెల్లించాల్సి ఉండగా మిగిలిన డబ్బు ఓనర్ షిప్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. షారుఖ్ ఖాన్, జూహిచావ్లా, జై మెహాతా భాగస్వామ్యంతో ముంబై ఫ్రాంచైజీని దక్కించుకొగా, దాబుర్స్ మోహిత్ బర్మన్ ఢిల్లీ ప్రాంజైనీ దక్కించుకోగా, మలేషియా బిజినెస్ టైకూన్, యుకె ఫండ్ మేనేజర్ ఎస్ జి శ్రీనివాసన్ భాగస్వామ్యంతో చెన్నై ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. హైదరాబాద్ ప్రాంచైజీ విషయానికి వస్తే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఎన్ ప్రసాద్ ఇద్దరూ కలసి ఓకె చేశారు. ఛండీ ఘర్ ఫ్రాంచైజీని యువరాజ్ సింగ్, అతని స్నేహితుడుతో కలసి తీసుకున్నారు. కోల్‌కత్తా ప్రాంచైజీ మాత్రం సౌరభ్ గంగూలీ తీసుకొనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment
Thank you for your comment