Tuesday, November 1, 2011

రాజీనామాలు ఎవరి గేమ్! ?

తెలంగాణ ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్
మరి ఆ కాంగ్రెస్ ను దెబ్బతీసి, ఆ కాంగ్రెస్ ను బెదిరిస్తే తెలంగాణ ఇస్తుందా?
అది కూడా ఇగో తిని బతికే గాంధీ కుటుంబం దీన్ని సహించి, భరిస్తున్నా… ఏ మాత్రం రాజకీయ పరిజ్క్షానం ఉన్న వారికయినా ఇది సులువుగా అర్థం అవుతుంది. దీన్ని బట్టి జరుగుతున్నదేమిటని తీగ లాగితే పెద్ద డొంకే కదులుతుంది.
పోలవరం నుంచి బయటపడటానికే…
ఈ గేమ్ అంతా ఢిల్లీ ఆడిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలిసే ఇదంతా జరుగుతుందని తెలిసింది. ప్రధానంగా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కేసీఆర్ పూర్తి స్థాయిలో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం దుమారం నుంచి బయటపడటానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు పటేల్‌కు కేసీఆర్ వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పరిణామం తెలుగుదేశాన్ని కూడా దెబ్బ కొట్టవచ్చని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వచ్చినప్పుడు ఇక తెలుగుదేశం ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తమ పార్టీలో చేరతారని, తెలంగాణాలో టిడిపిని భూస్థాపితం చేయవచ్చని కూడా కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. పోలవరం టెండర్ల దుమారం నుంచి బయటపడటానికే కాంగ్రెస్‌కు, టిఆర్ఎస్‌కు పడదని ప్రజలకు తెలియజెప్పడానికే ఈ వలసలని తెలుస్తోంది.
ఇదో నెంబర్ గేమ్
ప్రస్తుతం నెంబర్ గేమ్ నడుస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్‌కు చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారు. అవిశ్వాసంపై ఒకరు తమకు చెప్పాల్సిన పనిలేదన్న చంద్రబాబు ప్రజాసమస్యలపై తాము అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమన్నారు.
ప్రతిసవాల్….
మరోవైపు కేసీఆర్‌కు టిడిపి గట్టి సవాలే విసిరింది. కేసీఆర్, జగన్ కుమ్మక్కై ఈ డ్రామా ఆడుతున్నారని ఆ పార్టీ నేత రేవంతరెడ్డి విమర్శించారు. జగన్‌కు, కేసీఆర్‌కు దమ్ముంటే గవర్నర్ వద్ద ఎమ్మెల్యేలతో పెరేడ్ పెట్టాలని సవాల్ విసిరారు. కేవలం కేసీఆర్ డ్రామాలో భాగంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం పార్టీని వీడి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎదురుదాడికి దిగింది. డబ్బుకు అమ్ముడుపోయి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం ఆరోపించారు. ఢిల్లీలో కేకే మాత్రం హైకమాండ్ సూచన మేరకు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. ఇంకెవ్వరూ పార్టీని వీడేవారు లేరని, అయితే ఇప్పటికైనా హైకమాండ్ తెలంగాణాపై దృష్టి సారించాలని చెప్పారు.

No comments:

Post a Comment

Thank you for your comment