విదేశాలలో ఉద్యోగావకాశాలు బాగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో 2011-15
సంవత్సరాలలో కనీసం 3 లక్షల మంది ఇంజనీరింగ్ నిపుణులు ఇండియాకు వలస వచ్చేసే
అవకాశాలున్నాయని విదేశాలలో ఉద్యోగావకాశాలు ఇప్పించే కెల్లీ సర్వీసెస్
ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించింది. విదేశాలలో ఉద్యోగాలు లేక పోవడం, దేశంలో
ఉద్యోగావకాశాలు పెరుగుతుండడం చూసి ఇంజనీరింగ్ నిపుణులు ఇండియాకు తిరిగి
వచ్చేయాలని కోరుకుంటున్నారని ఆ సంస్థ తెలిపింది.
విదేశాలలో కన్నా భారత్ లోనే ఉద్యోగ సంతృప్తి బాగా ఉంటుందని వారు
అంటున్నట్టు తెలియజేసింది. ఇండియాలోనూ, విదేశాలలోనూ ఉద్యోగాలు చేస్తున్న
వెయ్యిమందిని ఎంపికచేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ఇది వరకు విదేశీ
ఉద్యోగాలకు ఎందుకు వెళ్ళాలనుకుం టున్నారు అని ఎవరినైనా ప్రశ్నిస్తే
ఆకర్షణీయమైన జీతం, ఉద్యోగంలో ఎదిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని
చెప్పేవారు. ఇండియా ఇటీవల కాలంలో ఒక పద్ధతిగా పురోగమించడం, అంతర్జాతీయంగా
మాంద్యం దెబ్బ బాగా ఉన్నా ఇండియా నిలకడగా ఉండి రాణించడం చూశాక విదేశాలలో
ఉన్న మన భారతీయులు ఇంటిముఖం పట్టడానికి ఎక్కువ ఆసక్తిని
ప్రదర్శిస్తున్నారని సర్వే తెలిపింది. ఇలా విదేశాల నుంచి వచ్చే వారిలో
అత్యధికులు అంటే 88%మంది కర్నాటకలో స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారని
తెలిపింది. ఆ తరువాతి స్థానాలలో గుజరాత్ (72%), మహారాష్ట్ర (66%), కేరళ
(65%), ఆంధ్రప్రదేశ్ (58%), ఢిల్లీ (55%), పంజాబ్ (48%)
రాష్ట్రాలున్నాయి.
No comments:
Post a Comment
Thank you for your comment