Tuesday, November 1, 2011

నవంబర్ 6 నుండి ఫిరోజ్ షా కొట్లా మైదానంలో

Harbhajan Singh
న్యూఢిల్లీ: ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్ నవంబర్ 6 నుండి ఇండియాలో ఫిరోజ్ షా కొట్లా స్టేడియంలో జరగనున్న వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరిస్‌లో పాల్గోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలో మూడు స్పిన్నర్స్ స్దానాలు ఉంటే వాటి కొసం నలుగురు స్పిన్నర్స్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వారిలో వన్డేలలో చక్కని ప్రతిభ కనబరుస్తున్న ఆర్ అస్విన్, ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా.

ప్రస్తుతానికి టీమిండియా సెలక్టర్స్ ఈ నెల చివర్లో వెస్టిండిస్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కి ఎంత మంది స్పిన్నర్స్(ఇద్దరు, ముగ్గురు)ని తీసుకొనుంది ఈ నెల చివరిలో వెల్లడించడం జరుగుతుంది. ఇక హార్బజన్ సింగ్ విషయానికి వస్తే పోయిన నెలలో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరిస్, వన్డే సిరిస్‌లలో కనబర్చిన ప్రదర్శన చాలా పూర్‌గా ఉండడంతో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌కి తీసుకోలేదు.

ఐతే ఆ తర్వాత ఛాంపియన్స్ లీగ్‌లో
ముంబై ఇండియన్స్ టీమ్‌ కెప్టెన్‌గా టటైల్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఈ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ తరుపున క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ సరిగ్గా లేని ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీ నుండి ఫిట్ నెస్ సర్టిఫికెట్‌ను తీసుకొనిరావల్సిందిగా కొరడం జరిగింది. టీమిండియా సీనియర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ గాయాల నుండి త్వరలో కొలుకుంటున్నట్లు సమాచారం. యువరాజ్ సింగ్, విరాట్ కొహ్లి‌లకు కూడా టెస్టు జట్టులో స్దానం లభించవచ్చని భావిస్తున్నారు.

ఇక బౌలర్స్ విషయానికి వస్తే నలుగురు బౌలర్స్ స్దానాలు ఖాలీగా ఉంటే ఫేసర్ ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నారు. ఆ తర్వాత స్దానాలకు ఉమేష్ యాదవ్, వరుణ్ ఆరాన్, ఎస్ శ్రీశాంత్ పోటోపడుతున్నారు. స్వదేశంలో నవంబర్ 6 నుండి జరగనున్న వెస్టిండిస్ టూర్ కోసం యంగ్ ప్రతిభావంతులను సెలక్ట్ చేసేందుకు బిసిసిఐ యోచిస్తుంది.

No comments:

Post a Comment

Thank you for your comment