Tuesday, November 1, 2011

సచిన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కొచ్ చాపెల్

Tendulkar - Chappellసిడ్నీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై టీమిండియా మాజీ కోచ్ ఆస్ట్లేలియా ఆటగాడు గ్రెగ్ చాపెల్ తన రాసిన పుస్తకం ‘ఫియర్స్ ఫోకస్’లో ఘాటైన విమర్శలు గుప్పించాడు. వివరాల్లోకి వెళితే మైదానంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ టన్నుల కొద్ది పరుగులు సాధించినప్పటికీ మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మానసికంగా బలహీనుడేనని భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. ‘ఫియర్స్ ఫోకస్’ పేరుతో రాసిన పుస్తకంలో ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

‘నేను భారత్ కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ రోజు సచిన్ నా దగ్గరకు వచ్చి తన మానసిక పరిస్థితిపై రెండు గంటలకు పైగా చర్చించాడు. ఆ సందర్భంలో అతడు తన ఫామ్‌పై ఆందోళన, అపనమ్మకంతో ఉన్నాడు. 2006లో మలేసియాలో వన్డే టోర్నీ ముగిశాక సచిన్ మానసిక స్థితి మరీ సున్నితంగా మారింది. సాయం చేయాల్సిందిగా నన్ను అభ్యర్ధించాడు’ అని చాపెల్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఓ రోజు జట్టుతో పాటు ప్రయాణిస్తుండగా సచిన్ కనీసం పక్కకు కూడా చూడలేదని, హెడ్‌ఫోన్స్‌కు అతుక్కుపోయాడన్నాడు.

‘మామూలుగా సచిన్‌కు ఎక్కువగా విశ్రాంతి దొరకదు. నేను అదే ప్రస్తావిస్తూ... ‘నీకు ఎంతో మంది స్నేహితులున్నారు. వారందరికీ సమయం కేటాయించడం కష్టమవుతోందనుకుంటా’ అని అన్నాను. వెంటనే సచిన్ నా కళ్లలోకి చూస్తూ... ‘గ్రెగ్... భారత్‌లో నాకంటే నీకే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు’ అని అన్నాడని చాపెల్ తెలిపాడు. ఇది ఇలా ఉంటే ఇటీవలే పాకిస్దానీ ఫాస్టు బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ 'షోయబ్ అక్తర్' రాసిన పుస్తకంలో సచిన్ టెండూల్కర్ తన బౌలింగ్‌లో భయపడ్డాడని రాసిన విషయం మరువక ముందే చాపెల్ ఇలా మరలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇటీవలే సెలక్టర్‌ పదవి నుంచి గ్రెగ్‌ ఛాపెల్‌ను తప్పిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఛాపెల్‌ను తప్పిస్తూ సీఏ తీసుకున్న నిర్ణయాన్ని దాదా స్వాగతించాడు. ''ఇప్పుడు ఎవరిది ఒప్పో..ఎవరిది తప్పో ప్రజలకు తెలుస్తుంది. అతడో పెద్ద క్రికెటర్‌. పెద్ద పేరు కూడా ఉంది. కానీ ఇది దురదృష్టం'' అని అన్నాడు. తాను కెప్టెన్‌గా ఉన్న కాలంలో టీమ్‌ ఇండియా కోచ్‌గా ఛాపెల్‌ తెరవెనుక రాజకీయాలకు పాల్పడ్డాడని.. తన కెరీర్‌నే నాశనం చేశాడని గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Thank you for your comment